• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చైనా, ఫిలిప్పీన్స్ మధ్య...

చైనా, ఫిలిప్పీన్స్ మధ్య చిచ్చురేపిన డీప్‌ ఫేక్ వీడియో!

| అవును... ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్.. "చైనా నుంచి ముప్పు పొంచి ఉంటే తక్షణమే దాడి చేయాలి" అంటూ తన మిలిటరీకి సూచించిన ఫేక్ ఆడియో క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారింది.

By - Tupaki Desk
Update: 2024-04-26 03:39 GMT

డీప్ ఫేక్ అనే సమస్య ఇటీవల కాలంలో తెరపైకి వచ్చి చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. సెలబ్రెటీల ఫేక్ ఫోటోలు, ఫేక్ వీడియోలూ క్రియేట్ చేస్తూ నెట్టింట తీవ్ర వివదాలకు నెలవైంది. ఈ సమయంలో ఏకంగా దేశాధ్యక్షుల వాయిస్ లను ఫేక్ చేస్తూ.. ఇతర దేశాలపై యుద్ధానికి సైన్యాన్ని అలర్ట్ చేసే పనులకు పూనుకుంటుంది. ఇది అత్యంత ఆందోళనకరమైన విషయం అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సమయంలో అలాంటి సమస్యను ఎదుర్కొంది ఫిలిప్పీన్స్!

అవును... ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్.. "చైనా నుంచి ముప్పు పొంచి ఉంటే తక్షణమే దాడి చేయాలి" అంటూ తన మిలిటరీకి సూచించిన ఫేక్ ఆడియో క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో... ఇది దేశ విదేశాంగ విధానానికి చిక్కులను కలిగిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

ఈ డీప్ ఫేక్ చేయబడిన ఆడియో మార్కోస్ జూనియర్ కి సంబంధించిన దాదాపు స్పష్టమైన స్వరాన్ని కలిగి ఉందని చెబుతున్నారు. ఇందులో భాగంగా.. చైనా, ఫిలిప్పీన్స్‌ కు ముప్పు కలిగిస్తే జోక్యం చేసుకోవాలని అతను తన మిలిటరీకి సూచించాడు. బీజింగ్ ద్వారా ఫిలిపినోలకు మరింత హాని జరగడాన్ని తాను ఏమాత్రం సహించలేనని ఆయన ఆ ఆడియో క్లిప్ లో చెప్పారు.

ఇదే క్రమంలో... ఈ ఆడియోతో పాటు దక్షిణ చైనా సముద్రంలో చైనా నౌకలను చూపిస్తున్న ఫోటోల స్లైడ్‌ షో కూడా ఉందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. ఈ సందర్భంగా స్పందించిన ప్రెసిడెన్షియల్ కమ్యూనిటీ కమ్యూనికేషన్స్ ఆఫీస్... ఈ డీప్ ఫేక్ గురించిన బహిరంగ హెచ్చరికను జారీ చేసింది... ఇది పూర్తిగా నకిలీదని ధృవీకరించింది. ఇదే సమయంలో నిందితులపై చర్యలకు ఆదేశించింది!

ఇదే క్రమంలో... ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్ వాయిస్ ని పోలిన ఆడియోను రూపొందించిన వీడియో కంటెంట్ ఆన్‌ లైన్‌ లో సర్క్యులేట్ అవుతున్న ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ ఫామ్‌ లో పోస్ట్ చేయబడిందనే విషయం తమ దృష్టికి వచ్చిందని.. ప్రెసిడెన్షియల్ కమ్యూనికేషన్స్ ఆఫీస్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాంటి ఆదేశం ఏదీ వాస్తవం కాదని వెల్లడించింది!

Tags:    
  • Deepfakevideos 
  • Philippines 
  • China 
  • FerdinandMarcos 
  • Fakeaudioclip 
  • SouthChina 
  • Politicalnews 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS