చాట్ మీ వాళ్లకు చూపించనా? న్యూ*డ్ కాల్ చేస్తావా? మైనర్ బెదిరింపు

అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని ఒక మైనర్ బాలికకు అదే మండలానికి చెందిన మరో గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలుడు పరిచయమయ్యాడు.;

Update: 2025-06-23 07:30 GMT

కొన్ని తరహా నేరాల్ని కొన్ని వయస్కుల వారే చేస్తారన్న భావన ఉండేది. కానీ.. ఇప్పుడది పోయింది. దీనికి సంబంధించిన అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది మాత్రం నిర్భయ ఉదంతం తర్వాతే. మారిన కాలానికి తగ్గట్లు మైనర్ అని పిలిచే దానికి ఇప్పుడున్న 18 ఏళ్ల వయసును తగ్గించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. తాజా ఉదంతం చూస్తే.. ఈ వాదనలో తప్పు లేదనిపించక మానదు. ఆన్ లైన్ లో స్నేహం పేరుతో పరిచయమైన మైనర్ అమ్మాయికి మైనర్ బాలుడు చేసిన పని.. తదనంతరం చోటుచేసుకున్న పరిణామాల గురించి తెలిస్తే నోట మాట రాదంతే. ఇంతా చేస్తే ఈ దారుణ అక్కడెక్కడో ఉన్న బీహార్ లోనో.. యూపీలోనో కాదు తెలంగాణలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని ఒక మైనర్ బాలికకు అదే మండలానికి చెందిన మరో గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలుడు పరిచయమయ్యాడు. కొంతకాలం వారి చాటింగ్ జరిగింది. తనకు న*గ్నంగా వీడియో కాల్ చేయాలని అడిగాడు. ఒకవేళ అలా చేయని పక్షంలో సదరు చాటింగ్ ను ఆమె తల్లిదండ్రులకు చూపిస్తానని బెదిరించాడు. దీంతో బెదిరిపోయిన సదరు బాలిక.. మైనర్ బాలుడు చెప్పినట్లే న్యూడ్ కాల్ చేసింది.

ఈ కాల్ ను రికార్డు చేసిన బాలుడు తన స్నేహితులకు షేర్ చేశాడు. ఇలా మానసికంగా.. శారీరకంగా వేధింపులకు గురి చేసిన ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమదు చేశారు. బాధిత బాలికకు సాయంగా రంగం లో కి షీటీం దిగి.. నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ ఎనిమిది మందిలో ఇద్దరు మైనర్లు (16 ఏళ్లు, 15 ఏళ్లు) కాగా.. మిగిలిన ఆరుగురు వంశీక్రిష్ణ (20), పవర్ తరుణ్ (18), సాబ్లె బాలవంత్ సింగ్ (18), గుండల్వార్ వరుణ్ (18), కారడ్ సుధీర్ (28), ముర్కుటే విఠల్ (23) మీద ఫోక్సో కేసు నమోదు చేశారు. వీరిని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా.. మైనర్లు ఇద్దరిని నిజామాబాద్ లోని జువైనల్ హోంకు తరలించగా.. మిగిలిన ఇద్దరిని రిమాండ్ కు తరలిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి వేధింపులకు.. బెదిరింపులకు బెదరకుండా పోలీసుల్ని ఆశ్రయిస్తే.. మంచిదన్న విషయాన్ని బాలికలు గుర్తించాలి.

Tags:    

Similar News