• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రాజ్యసభలో కరెన్సీ నోట్ల...

రాజ్యసభలో కరెన్సీ నోట్ల కట్ట రచ్చ... అసలేం జరిగిందంటే..?

| రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీకి కేటాయించిన సీటు వద్ద కరెన్సీ నోట్ల కట్టను గుర్తించినట్లు ఛైర్మన్ ప్రకటించడం తీవ్ర సంచలనంగా మారింది.

By - Tupaki Desk
Update: 2024-12-06 10:40 GMT

రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ సీటు వద్ద కరెన్సీ నోట్ల కట్ట తీవ్ర సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీకి కేటాయించిన సీటు వద్ద ఈ కరెన్సీ నోట్ల కట్టను గుర్తించినట్లు ఛైర్మన్ జగ్ దీప్ ధన్ ఖడ్ శుక్రవారం సభలో ప్రకటించారు. దీంతో.. ఈ వ్యవహారం తీవ్ర దుమారానికి దారి తీసింది. దీనిపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అవును... రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీకి కేటాయించిన సీటు వద్ద కరెన్సీ నోట్ల కట్టను గుర్తించినట్లు ఛైర్మన్ ప్రకటించడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా.. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని బీజేపీ డిమాండ్ చేసింది.

అసలేం జరిగిందంటే..?:

ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాజ్యసభ శుక్రవారం సమావేశమైంది. ఈ సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్ ధన్ ఖడ్ మాట్లాడుతూ.. గురువారం నాడు సభను వాయిదా వేసిన తర్వాత భద్రతా అధికారులు ఛాంబర్ లో సాధారణ తనిఖీలు చేపట్టారని తెలిపారు.

ఈ క్రమంలో... 222వ నెంబర్ సీటు వద్ద ఓ కరెన్సీ నోట్ల కట్ట కనిపించిందని.. అది తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటు అని.. ఈ విషయం తన దృష్టికి రాగానే దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలిపారు. దీంతో... సభలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.

ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఛైర్మన్ ప్రకటనను ఖండించారు. ఈ ఘటనపై విచారణకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ.. దర్యాప్తు పూర్తికాకముందే సభ్యుడి పేరు చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఖర్గే వ్యాఖ్యలపై స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు... పేరు చెబితే తప్పేంటి అని ప్రశ్నించారు. ఆ సీటు వద్ద ఎవరు కుర్చుంటారో చెప్పారని.. అందులో సమస్య ఏమిందని ప్రశ్నించారు. సభకు ఇలా నోట్ల కట్టలు తీసుకురావడం సరికాదని చెప్పుకొచ్చారు.

మరోవైపు ఈ పరిణామాలపై సింఘ్వీ స్పందించారు. ఇలాంటి పరిస్థితి తాను ఎప్పుడూ చూడలేదని.. తాను రాజ్యసభకు ఒక రూ.500 నోటు మాత్రమే తీసుకెళ్లానని.. మధ్యాహ్నం 12:57 గంటలకు సభ లోపలికి వచ్చానని.. ఒంటి గంటకు సభ వాయిదా పడటంతో క్యాంటీన్ కు వెళ్లి, 1:30కి పార్లమెంట్ నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు.

Never heard of it till now. I carry one Rs 500 note when I go to Rajya Sabha. I heard about this for the first time. I reached the House at 12:57 PM and the house rose at 1 PM, then I sat in the canteen till 1:30 PM and then I left the parliament: Congress MP and advocate… https://t.co/XISu0YQm0Z pic.twitter.com/ug3LaxWgSf

— ANI (@ANI) December 6, 2024

#WATCH | Rajya Sabha Chairman Jagdeep Dhankhar says, "I here by inform the members that during the routine anti-sabotage check of the chamber after the adjournment of the House yesterday. Apparently, a wad of currency notes was recovered by the security officials from seat number… pic.twitter.com/42GMz5CbL7

— ANI (@ANI) December 6, 2024
Tags:    
  • Memberofparliament 
  • Telanganamp 
  • Abhishekmanusinghvi 
  • JagdeepDhankar 
  • Rajyasabha 
  • Congressmp 
  • BJP 
  • Mallikarjunkharge 
  • Kiranrijiju 
  • Politicalnews 

Similar News

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

Copyright @2026

Powered by Blink CMS