జగన్‌పై కూటమిలో 'పాజిటివ్' థింకింగ్.. మంచిదంటున్న బాబు!
మీరు చదివింది నిజమే!. ఎలాంటి తేడా లేదు. నిజంగానే ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.;
మీరు చదివింది నిజమే!. ఎలాంటి తేడా లేదు. నిజంగానే ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కూటమి నాయకులే చర్చించుకుంటున్నారు. జగన్‌పైనా.. వైసీపీపైనా..పాజిటివ్ నెస్ పెరుగుతోందన్నది సోషల్ మీడియాలో నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు. అనంతపురంలో ఓ ఫైర్ బ్రాండ్ టీడీపీ నాయకుడు నేరుగానే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల మూడ్ మారిందని కూడా అంటున్నాడు. జగన్ కు అనుకూలంగా ప్రజలు ఉంటున్నారని చెబుతున్నారు. ఇక, తూర్పుగోదావరిలో ఈ టాక్ పెద్దగా లేదుకానీ.. పశ్చిమలో మాత్రం జోరుగానే వినిపిస్తోంది.
అయితే.. ఇక్కడ నాయకులు చర్చించుకుంటున్న విషయం ఏంటంటే.. కూటమి పార్టీలు కలసి కట్టుగా ఉంటే ఇబ్బంది లేదని.. ఏమాత్రం చిన్న తేడా వచ్చినా.. జగన్ గెలిచేస్తారని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల మూడ్ కూడా అలానే ఉందని అంటున్నారు. ఈ వ్యవహారం పెద్ద ఎత్తున ఏపీలో ఇప్పుడు చర్చగా మారింది. వారు చెబుతున్నట్టు జరుగుతుందా? లేదా? అనేది పక్కన పెడితే.. ప్రస్తుతం కొంత అసంతృప్తి అయితే.. జనాల్లో కనిపిస్తోంది. ఈ విషయాన్ని చంద్రబాబు సహా మంత్రి ఇటీవల వ్యాఖ్యానించింది. ప్రజల్లో ఎందుకు అసంతృప్తి పెరుగుతోందన్నదానిపై 15 నిమిషాలపాటు చర్చించారు.
ఈ విషయం టీడీపీ అనుకూల మీడియాల్లోనూ వచ్చింది. కట్ చేస్తే.. దీనిని పట్టుకుని టీడీపీ నాయకులు.. జగన్‌కు పాజిటివిటీ పెరిగిందని ఆలోచన చేస్తున్నారు. అది.. కూటమి సఖ్యత కోల్పోయినప్పుడేనని వారు కూడా చెబుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం.. అటు తిరిగి ఇటు తిరిగి సీఎం చంద్రబాబు చెంతకు చేరింది.దీనిపై చంద్రబాబు ఆసక్తిగా రియాక్ట్ అయ్యారని తెలిసిం ది. మంచిదే.. కనీసం ఇప్పుడైనా మన వాళ్లు వాస్తవాలు తెలుసుకుంటారు!. అని వ్యాఖ్యానించారు. కూటమిగా ఉంటేనే బలంగా ఉంటామని తాను ఎన్నిసార్లు చెప్పినా.. కొందరు పెడచెవిన పెడుతున్నారని.. ఇప్పుడు వారికే తెలిసి వస్తోందని కూడా బాబు వ్యాఖ్యానించారు.
అంతేకాదు, క్షేత్రస్థాయిలో నాయకుల ఐక్యత అవసరమని.. కలసి కట్టుగా ఉండకపోతే.. శత్రువు(వైసీపీ)కు అవకాశం మనమే ఇచ్చినట్టు అవుతుందని చెప్పుకొచ్చారు. దీనిని చూసైనా.. టీడీపీ-జనసేన-బీజేపీ నాయకులు కలసి కట్టుగా ఉండాలని చంద్రబాబు సూచించారు. సో.. వైసీపీపై పాజిటివ్ థింకింగ్‌ను కూడా.. చంద్రబాబు తన పార్టీలకు అన్వయించి.. అది లేకుండా ఉండాలంటే.. అందరూ కలసి పనిచేయాలని సందేశాన్ని ఇచ్చారు. మరి నాయకులు అలా చేస్తారో .. లేదో చూడాలి.