• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బర్త్ డే వేళ అదిరిపోయే...

బర్త్ డే వేళ అదిరిపోయే న్యూస్ తో విజయ్ ?

| ఇలా ముఖ్యమంత్రి అయ్యారు, అలా తొలి పుట్టిన రోజు వస్తోంది. సీఎం కుర్చీ ఎక్కిన కేవలం నలభై రోజుల వ్యవధిలోనే విజయ్ తన తొలి బర్త్ డే జరుపుకోబోతున్నారు. ఈ నెల 22న దళపతి, సీఎం విజయ్ పుట్టిన రోజు.

By - Satya P
Update: 2026-06-13 08:23 GMT

ఇలా ముఖ్యమంత్రి అయ్యారు, అలా తొలి పుట్టిన రోజు వస్తోంది. సీఎం కుర్చీ ఎక్కిన కేవలం నలభై రోజుల వ్యవధిలోనే విజయ్ తన తొలి బర్త్ డే జరుపుకోబోతున్నారు. ఈ నెల 22న దళపతి, సీఎం విజయ్ పుట్టిన రోజు. ఈసారి పుట్టిన రోజు విజయ్ కే కాదు ఆయన అభిమానులకు కూడా ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చే రోజు. ప్రతీ ఏటా సినీ స్టార్ గానే ఆయన పుట్టిన రోజును అభిమానులు జరుపుకునే వారు. ఈసారి ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో మా ఆరాధ్య నాయకుడు అంటూ అపుడే దళపతి ఫ్యాన్స్ అంతా తమిళనాడు వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలను చేసుకుంటున్నారు.

అతి పెద్ద ప్రకటనతో :

అయితే పుట్టిన రోజున విజయ్ కూడా అభిమానులకు తనను ఆరాధించే వారికి గొప్ప వార్తను వినిపించబోతున్నారు అని అంటున్నారు. అదేంటి అంటే టీవీకే పార్టీకి విజయ్ కి మద్దతుగా దన్నుగా ఒక భారీ న్యూస్ చానల్ ని ప్రారంభించడం అని చెబుతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో సుదీర్ఘ కాలం కొనసాగాలని భావిస్తున్న 52 ఏళ్ళ విజయ్ అనేక ఇన్నింగ్స్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో తన రాజకీయ పార్టీకి ఫుల్ సపోర్టుగా ఒక పవర్ ఫుల్ న్యూస్ చానల్ ఉండాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. నిజానికి చూస్తే తమిళనాడులో మీడియాకూ రాజకీయానికి మధ్య అవినాభావ సంబంధం ముడి పడిపోయి ఉంది. అటు డీఎంకేకు సన్ టీవీ సపోర్ట్ ఉంటే ఇటు అన్నా డీఎంకేకి జయ టీవీ మద్దతు ఉంది. విజయ్ కి ఎన్నికల వేళ కేవలం సోషల్ మీడియా మాత్రమే సపోర్టుగా నిలిచింది. దాంతో తమ పార్టీకి కూడా ఒక సొంత చానల్ ఉండాలని ఆయన భావిస్తున్నారని అందుకే తన బర్త్ డే రోజున ప్రకటిస్తారు అని అంటున్నారు.

భారీ ఎత్తున ఆదరణ :

సినీ రంగాన దళపతిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విజయ్ న్యూస్ చానల్ కనుక పార్టీ పరంగా పెడితే అది భారీ ఆదరణతో దూసుకుని పోవడం ఖాయమని అంటున్నారు. ఎందుచేతనంటే విజయ్ కి ఉన్న ఫ్యాన్ మెయిల్ బలం అలాంటిది అని గుర్తు చేస్తున్నారు. దాంతో పాటు తమ ప్రియతమ వెండి తెర నాయకుడు రాజకీయ నాయకుడు అయ్యాక ఫ్యాన్స్ ఆయన గురించిన వార్తల కోసం ఎంతో ఎదుచూస్తున్నారు. అయితే అవి ప్రస్తుతం ఉన్న తమిళనాడు మీడియా రాజకీయ ప్రభావంతో పెద్దగా ప్రచారంలోకి నోచుకోవడం లేదని అంటున్నారు. అందుకే సొంత చానెల్ పెడితే అభిమానులందరి కోరిక తీరుతుందని దిశా నిర్దేశం చేసినట్లు అవుతుందని విజయ్ భావిస్తున్నారు అని అంటున్నారు.

చానెల్ పేరు ఇదేనా :

ఇక విజయ్ తన టీవీకే పార్టీ తరఫున అధికారికంగా ఒక చానెల్ ని ప్రారంభిస్తారు అన్న వార్తలు వ్యాపిస్తున్న నేపధ్యంలో ఆ చానెల్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఆ చానెల్ పేరు వెట్రీ న్యూస్ గా ఉండబోతోంది అని అంటున్నారు. టీవీకే ఫుల్ ఫార్మ్ చూస్తే తమిళగ వెట్రి కగలం. వెట్రి అంటే విజయం అని అర్థం. విజయ్ పేరు కూడా అదే. ఇపుడు న్యూస్ చానల్ కి కూడా అదే పేరు కలపాలని చూస్తున్నారని సెంటిమెంట్ తో పాటు విజయ్ పేరు కూడా అందులో ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపధ్యంలోనే వెట్రీ న్యూస్ అని పెడుతున్నారని ప్రచారం సాగుతోంది. ఇక టీవీకే అధికారిక న్యూస్ చానెల్ విషయాన్ని తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు మణికందన్ భాస్కరన్ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా తెలియజేయడంతో టీవీకే వర్గాలతో పాటు వియజ్ ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్ లో ఉన్నాయి.

వెనక ఉన్నదెవరు :

ఇక వెట్రి న్యూస్ చానెల్ ని ఎవరు స్థాపిస్తున్నారు యజమానులు ఎవరు అన్న చర్చ సాగుతోంది. అయితే విజయ్ కి అత్యంత సన్నిహితుడైన ఒక వ్యాపారవేత్త ఈ చానెల్ ని స్థాపిస్తున్నారు అని అంటున్నారు. ఇక ఇప్పటికే ఈ చానెల్ లో పనిచేసే సిబ్బంది కోసం ప్రకటనలు ఇస్తున్నారు అని అంటున్నారు. ఇలా ఇన్ని జరుగుతున్నా టీవీకే మాత్రం అధికారికంగా ప్రకటన అయితే చేయడం లేదు. మొత్తానికి సీఎం గా తొలి బర్త్ డే వేళ విజయ్ నుంచి ఈ తరహా సంచలన ప్రకటన ఉండబోతోంది అని అంతా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    
  • thalapathyvijay 
  • cmvijay 
  • tamilnadupolitics 
  • tvkparty 
  • vettrinews 
  • indianpolitics 
  • celebrityturnpolitician 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS