• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  'క్లౌడ్ బరస్ట్' అంటే...

'క్లౌడ్ బరస్ట్' అంటే ఏంటి?.. అవి ఎక్కడ సంభవిస్తాయి?

| అయితే.. దేశంలో పలుచోట్ల భారీ వర్షాలు, వరదలకు 'క్లౌడ్‌ బరస్ట్‌' లే కారణమని అంటున్నారు!

By - Tupaki Desk
Update: 2025-06-26 02:45 GMT

సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే కుంభవృష్టి వర్షాలు, ఆకస్మిక వరదలు.. వాటి వల్ల కొండచరియలు విరిగిపడిపోవడం, జనావాసాలు మునిగిపోవడం వంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. దీంతో.. ఒక్కసారిగా పరిస్థితి మొత్తం జలమయం అయిపోతుంది. ఆ సమయంలో... ప్రాణ, ఆస్తి నష్టాలకు దారితీసే ఈ ప్రతికూల వాతావరణ స్థితిని ఎదుర్కోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

అయితే.. దేశంలో పలుచోట్ల భారీ వర్షాలు, వరదలకు 'క్లౌడ్‌ బరస్ట్‌' లే కారణమని అంటున్నారు! గతంలో... భారీ వర్షాల వెనుక విదేశీయులు క్లౌడ్‌ బరస్ట్‌ కుట్రకు పాల్పడి ఉండవచ్చని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు ఈ 'క్లౌడ్‌ బరస్ట్‌' అంటే ఏమిటీ..? అది ఎందుకు సంభవిస్తుంది..? మొదలైన విషయాలు ఇప్పుడు చూద్దామ్..!

భారత వాతావరణ శాఖ ప్రకారం.. సాధారణంగా అతి స్వల్ప సమయంలో అతి భారీ వర్షాలకు దారితీయడాన్నే 'క్లౌడ్‌ బరస్ట్‌' అని అంటారు. ఇందులో.. 20 నుంచి 30చ.కి.మీ పరిధిలో గంటకు 10 సెం.మీ వర్షపాతం నమోదవుతుంది. ఈ క్రమంలో.. ఒక్కోసారి ఊహించని స్థాయిలో కురిసే ఈ భారీ వర్షాలు ఆకస్మిక వరదలకు దారితీస్తాయి. ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంటాయి!

ఇంత ప్రమాదకరమైన క్లౌడ్‌ బరస్ట్‌ ఎప్పుడు సంభవిస్తుందనేది మాత్రం కచ్చితంగా అంచనా వేయడం కష్టమేనని.. తక్కువ పరిధిలో కుంభవృష్టి జరిగే అవకాశం ఉండటంతో అవి ఏ ప్రాంతంలో సంభవిస్తాయనే విషయాన్ని కచ్చితంగా ఎవరూ చెప్పలేరని అంటున్నారు. అయితే.. అవి ఎక్కువగా ఎత్తైన ప్రదేశాల్లోనే చోటుచేసుకుంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ముఖ్యంగా వర్షాకాలం సమయంలో జమ్మూ కశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి ఎత్తైన ప్రదేశాల్లో వాతావరణ మార్పుల వల్ల ఇవి అకస్మాత్తుగా సంభవిస్తుంటాయి. ఈ క్రమంలో... భారీ ప్రాణ, ఆస్తి నష్టాలకు దారితీసే ఈ క్లౌడ్‌ బరస్ట్‌ లు భారత్‌ లో చోటుచేసుకుంటూనే ఉన్నాయి. కేవలం హిమాలయ ప్రాంతాల్లోనే ఏటా పదుల సంఖ్యలో ఇవి సంభవిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Tags:    
  • Cloudburst 
  • IndianMonsoon 
  • FlashFloods 
  • WeatherAlert 
  • ClimateChange 
  • DisasterPreparedness 
  • JammuKashmir 
  • HimachalPradesh 
  • Uttarakhand 
  • RainAlert 

Similar News

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

పాపం ఏబీవీ : సోషల్ మీడియా హైప్....డిపాజిట్ గల్లంతు

2026-11-04 08:06 GMT

సుప్రీంషాక్‌: దిగొచ్చిన ఎన్నిక‌ల సంఘం.. బిగ్ రిలీఫ్‌!

2026-11-04 08:02 GMT

ఈమె ఏ పార్టీలోచేరినా విజయమే.. లక్ అంటే రమాకుమారిదే..

2026-11-04 08:01 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

Copyright @2026

Powered by Blink CMS