తోక లేని పిట్ట.. చైనా ఆరో తరం యుద్ధ విమానం.. అనేక ప్రత్యేకతలు..
ఇప్పుడు ఇలాంటిదే చైనా ఆరో తరం యుద్ధ విమానం. కాగా, భారత్ వద్ద ఇప్పటికీ ఐదో తరం యుద్ధ విమానాలే లేవు.;
చైనా అంటే అంతే... ప్రత్యర్థులకు చిక్కదు.. శత్రువులకు అందదు.. ఏ రంగంలో అయినా సరే.. ఎంతో ముందుకెళ్లిపోతుంది.. ఇక రక్షణ రంగంలో మాత్రం ఎందుకు వెనకుంటుంది...? డ్రాగన్ కంట్రీది అసలే విస్తరణ వాదం.. దీనికితోడు ప్రపంచం అంతా రానురాను ఉద్రిక్త వాతావరణం పెరుగుతోంది. అందుకని ఏకంగా ఆరో తరం యుద్ధ విమానం తయారీకి సంకల్పించింది.. అనుకున్నదే తడవుగా దానిని అమలు చేసేసింది. ఇపుడా యుద్ద విమానం వివరాలు బయటకు వస్తున్నాయి.
తోక లేని పిట్ట 90 ఆమడల దూరం వెళ్లిందనేది తెలుగు సామెత. ఇప్పుడు ఇలాంటిదే చైనా ఆరో తరం యుద్ధ విమానం. కాగా, భారత్ వద్ద ఇప్పటికీ ఐదో తరం యుద్ధ విమానాలే లేవు. అమెరికా నుంచి ఎఫ్-35 వంటి యుద్ధ విమానాల కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తోంది. ఐదో తరంఎఫ్-35ను చూసుకునే అమెరికా, దాని మిత్రదేశాలు మురిసిపోతుంటే.. దానిని మించి ఆరో తరం యుద్ధ విమానాన్ని కూడా రంగంలోకి దింపుతోంది.
మన వద్ద ఇంకా నాలుగో తరం యుద్ధ విమానాలే ఉండగా.. 2024 డిసెంబరులోనే చైనా ఆరోతరం యుద్ధ విమానం నమూనాను ప్రదర్శించింది. తాజాగా ‘‘తోక లేకుండా చైనా ఆరో తరం’’ యుద్ధ విమానం వీడియో వైరల్ అవుతోంది.
ఈ అత్యాధునిక ఫైటర్ జెట్ అనేక ప్రత్యేకతల సమాహారం కావడం గమనార్హం. ఆ విశేషాలు ఏమంటే..
ఇంజిన్లు :3, తోక లేక పోవడం, ఆరో తరానికి చెందిన జె-36 ఫైటర్ జెట్లు.. అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీ (శత్రు రాడార్లకు అందకపోవడం), ఏవియానిక్స్, పవర్ ప్లాంట్, ఎయిర్ ఫ్రేమ్, దీర్ఘశ్రేణి క్షిపణుల వంటి ఆయుధాలను భద్రపర్చుకొనేందుకు ఇంజిన్ లో రెండు ఎయిర్ ఇన్ టేక్స్.