ఇటు వాళ్లు అటు.. వైసీపీలో కీలక నేతల మార్పు!
వచ్చే ఎన్నికలు కీలకం కావడంతో ఇటు పార్టీలు.. అటు నాయకులు కూడా అలెర్టు అవుతున్నారు. ము ఖ్యంగా వైసీపీలో నాయకులు మరింత జాగ్రత్త పడుతున్నారు.;
వచ్చే ఎన్నికలు కీలకం కావడంతో ఇటు పార్టీలు.. అటు నాయకులు కూడా అలెర్టు అవుతున్నారు. ము ఖ్యంగా వైసీపీలో నాయకులు మరింత జాగ్రత్త పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉన్న నియోజకవర్గాలను వారు ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో జిల్లాల సరిహద్దులు కూడా దాటుతు న్న పరిస్థితి కనిపిస్తోంది. కొందరు ఎంపీలు.. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాల మార్పు కోరుతూ.. పార్టీ అధినేతపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది.
తాడేపల్లి వర్గాల కథనం మేరకు.. మచిలీపట్నం ఎంపీగా ఉన్న బాలశౌరి తనను గుంటూరుకు పంపించే యాలని కోరుతున్నారట. గతంలో ఆయన నరసరావు పేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలో అక్కడ తన అదృష్టం చూసుకుంటానని చెబుతున్నారు. తన గెలుపు సాధ్యమేనని అంటున్నారు. ఇక, నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణ దేవరాయులు కూడా.. మార్పు కోరుకుంటున్నారు. ఈ సారి ఆయన ఎమ్మెల్యేగా వెళ్తానని చెబుతున్నారు.
ఇక, పార్టీలో నిన్న మొన్నటి వరకు స్పందన లేకుండా ఉన్న మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి కూడా గుంటూ రు టికెట్ కోసం పట్టుబడుతున్నారు. ఇక, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విశాఖ ఉత్తరం టికెట్ ను కోరుతున్నారు. దీంతో విశాఖ ఎంపీ స్థానాన్ని వైసీపీ ముఖ్యనాయకుడు ఒకరు కోరుతున్నట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ రాజమండ్రి సిటీ లేదా రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం కోరుతున్నారు.
కాకినాడ ఎంపీ సత్యవతి కూడా వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీటు కోసం పట్టుబడుతున్నారు. ఇక, ఎమ్మెల్యే గా ఉన్న మాజీ ఐఏఎస్ వరప్రసాద్.. తనకు బాపట్ల ఎంపీ సీటు కావాలని కోరుతుండగా.. ఇక్కడ ఎంపీగా ఉన్న నందిగం సురేష్ ఎమ్మెల్యే టికెట్ కోరుతున్నారు. ప్రస్తుతం ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్.. కొండపి నియోజకవర్గం టికెట్‌ను కోరుతున్నారు.
అదేవిధంగా కడపలోనూ ఇలాంటి మార్పులు కోరుతున్నవారి సంఖ్య మూడుగా ఉందని తెలిసింది. మొత్తానికి స్థానికంగా వారికి ఎదురవుతున్న వ్యతిరేకత.. సొంత నేతల అసంతృప్తితో నియోజకవర్గాలు మారితే.. ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.