సింగపూర్ లో రోడ్డు దాటుతున్న బాబు... వైరల్ ఫోటోలో నిజమెంత?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మే 13న ముగిసింది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి

Update: 2024-05-23 11:03 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మే 13న ముగిసింది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో... ఫలితాలకు చాలా గ్యాప్ ఉండటంతో నేతలు కాస్త చిల్ అవుతున్నారు! ప్రధానంగా సుమారు రెండు నెలలకుపైగా ప్రచార కార్యక్రమాల్లో అలసిపోయిన వారు కౌంటింగ్ తేదీకి చాలా సమయం ఉండటంతో కాస్త రిలాక్స్ అవుతున్నారు.

ఇందులో భాగంగా... వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీసమేతంగా లండన్ పర్యటనకు వెళ్లారు. ఆయన అక్కడకు రీచ్ అయిన తర్వాత కొన్ని ఫోటోలు, వీడియోలు నెట్టింట విడుదలయ్యాయి. ఇదే క్రమంలో చంద్రబాబు కూడా, తన సతీమణితో కలిసి అమెరికాకు వెళ్లారంటూ వార్తలొచ్చాయి. అయితే... అమెరికా రాలేదని టీడీపీ ఎన్నారై జనాలు చెప్పడంతో... బాబు విదేశాలకు వెళ్లారనేది మాత్రమే స్పష్టం అయ్యింది.

ఈ సమయంలో చంద్రబాబు విదేశీ పర్యటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఇందులో భాగంగా... చంద్రబాబు సింగపూర్ వెళ్లారంటూ ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన ఫోటోలో చంద్రబాబు సింగపూర్‌ లోని ఓర్చార్డ్ రోడ్‌ లో నడుచుకుంటూ వెళుతున్నట్లుగా ఉంది. ఈ ఫోటోతో పాటు.. "అమెరికా వేళతానని చెప్పి..... సింగపూర్ లో ఏం చేస్తున్నట్టు???" అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు!

అయితే చంద్రబాబు సింగపూర్‌ లోని ఓర్చార్డ్ రోడ్‌ లో నడుచుకుంటూ వెళుతున్నట్లు ఉన్న పిక్ లో నిజం లేదని.. ఆ ఫోటో ఎడిట్ చేసినట్లు ఉందని ఫ్యాక్ట్ చెక్ చేసి చెబుతున్నారు. ఇందులో భాగంగా... ఈ వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేస్తే.. 2023 సెప్టెంబర్ 27న సీ.ఎన్‌.ఏ వెబ్‌ సైట్‌ లో పబ్లిష్ చేసిన స్టోరీలో ఉన్న ఫోటో అని బయటపడిందని చెబుతున్నారు.

ఆ ఫోటోలో సింగపూర్‌ లోని ఓర్చార్డ్ రోడ్‌ లో కొంతమంది జనాలు రోడ్లపై మాస్కులు పెట్టుకుని నడుచుకుంటూ వెళుతున్నారు. వారితో పాటు చంద్రబాబు నడుచుకుంటూ వెళుతున్నట్లు ఆ ఫోటోలో ఉంది. అయితే... సీ.ఎన్‌.ఏ స్టోరీలో ఉన్న ఫోటోలో చంద్రబాబు ఎక్కడ కనిపించలేదు. దీంతో ఈ ఫోటో ఫేక్ అని.. చంద్రబాబు సింగపూర్ లో ఉన్నారా, మరెక్కడైనా ఉన్నారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అని అంటున్నారు!

Tags:    

Similar News