మీ కోసం ఎదురు చూస్తున్నాం స‌ర్‌: మోడీకి బాబు లేఖ‌

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి ఆన్‌లైన్ వేదిక‌గా సీఎం చంద్ర‌బాబు సోష‌ల్ మీడియాలో లేఖ రాశారు. ''మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం స‌ర్‌.'' అని తెలిపారు.

Update: 2026-07-31 13:30 GMT

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి ఆన్‌లైన్ వేదిక‌గా సీఎం చంద్ర‌బాబు సోష‌ల్ మీడియాలో లేఖ రాశారు. ``మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం స‌ర్‌.`` అని తెలిపారు. శ‌నివారం భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ప్రారంభోత్స‌వానికి వ‌స్తున్నాన‌ని.. ఇది త‌న‌కు వ‌చ్చిన గౌర‌వ‌మ‌ని.. ఏపీ ప్ర‌జ‌ల‌తో త‌న‌కు ఎన‌లేని అనుబంధం ఉంద‌ని పేర్కొంటూ.. ప్ర‌ధాన మంత్రి సోష‌ల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ పోస్టును రీట్వీట్‌ చేసిన సీఎం.. ప్ర‌ధానిని ఆహ్వానిస్తూ.. తాను కూడా సందేశం పంచుకున్నారు. ప్ర‌ధాన మంత్రిరాక కోసం ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ట్టు పేర్కొన్నారు.

భోగాపురం అంత‌ర్జాతీయ విమానం.. ఉత్త‌రాంధ్ర‌కు గేమ్ ఛేంజ‌ర్‌గా మారుతుంద‌ని చంద్ర‌బాబు తెలిపారు. అనేక అవాంత‌రాల‌ను దాటుకుని అత్యంత వేగంగా పూర్తి చేసుకున్న ఈ విమానాశ్ర‌యం శ‌నివారం ప్రారంభం కానుంద‌ని పేర్కొన్నారు. దీనిని తానే సంక‌ల్పించి.. తానే పూర్తి చేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఎంతో మందిస‌హ‌కారంతో రూపుదిద్దుకున్న ఈవిమానాశ్ర‌యం ఉత్త‌రాంధ్ర‌లో అతిపెద్ద వాణిజ్య‌, వ్యాపార కార్య‌క్ర‌మాల‌కు వేదిక‌గా మారుతుంద‌న్నారు. ఒక్క ఉత్త‌రాంధ్ర‌కే కాకుండా.. రాష్ట్రం మొత్తానికి అతి పెద్ద అంత‌ర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్ర‌యం ఇదేన‌ని పేర్కొన్నారు.

శంషాబాద్ విమానాశ్ర‌యం హైద‌రాబాద్‌కు ఏ విధంగా పేరు తీసుకువ‌చ్చిందో.. ఉత్త‌రాంధ్ర‌కు అలానే ఏపీ మొత్తానికి భోగాపురం విమానాశ్ర‌యంకూడా అంతే పేరు తీసుకురానుంద‌న్నారు. ఇది రాష్ట్రానికి త‌ల‌మానికంగా మారుతుంద‌న్నారు. ప్ర‌ధాని మోడీ రాక కోసం.. ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ట్టు పేర్కొన్నారు. ఈసారి గిరిజ‌న విద్యార్థులు వేలాదిగా పాల్గొని థింసా నృత్య ప్ర‌ద‌ర్శ‌న చేయ‌నున్న‌ట్టు తెలిపారు. ఇది గిన్నీస్ వ‌రల్డ్ రికార్డులో చోటు చేసుకుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అలానే ఉత్త‌రాంధ్ర క‌ళ‌లు, సంస్కృతి వంటివి కూడా ఈ కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌ధానికి చేరువ కానున్నాయ‌ని వివ‌రించారు.

Tags:    

Similar News