బాబు....లడ్డూ ఇష్యూ మీద తన ఎమ్మెల్యేలనే కన్విన్స్ చేయలేకపోయారా ?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కాలంలో లడ్డూ ఇష్యూ మీద గట్టిగా మాట్లాడుతున్నారు.;
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కాలంలో లడ్డూ ఇష్యూ మీద గట్టిగా మాట్లాడుతున్నారు. లడ్డూ కల్తీ అయిందని, కల్తీ నెయ్యి అందులో కలిసింది అని ఆ విధంగానే కోట్లలో లడ్డూలను తయారు చేశారు అని విమర్శిస్తున్నారు. వైసీపీ పాలనలో అంతా కల్తీ నెయ్యి వ్యవహారంగానే సాగింది అని ఆయన అసెంబ్లీ సాక్షిగా నిందించారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలనే కన్విన్స్ చేయలేకపోయారు అని అంటున్నారు.
సీనియర్ పొలిటీషియన్ గా :
ఇదిలా ఉంటే చంద్రబాబు జనరల్ గా చూస్తే ఎంతో ధీమాగా మాట్లాడుతారు, ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు. ఎన్నో అసెంబ్లీ సమావేశాలను ఆయన నడిపించారు. అంతే కాదు హేమాహేమీలను ఢీ కొట్టి విజయం సాధించారు, అలాగే ఓటమి కూడా చవి చూశారు. ఉమ్మడి ఏపీలో సుదీర్ఘమైన సీఎం గా పనిచేసిన వారు, అలాగే ప్రతిపక్షంలో కూడా ఉంటూ అధికార పక్షాన్ని ఇరుకున పెట్టారు. బాబు నాయకత్వాన్ని ఎవరైనా మెచ్చుకుంటారు. తెలంగాణా వారితోనూ శభాష్ అనిపించుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి. ఇప్పటికీ తెలంగాణాలో టీడీపీకి ఒక శాతం ఓటింగ్ ఉంది.
ఇబ్బంది పడుతూనే :
ఇదిలా ఉంటే తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు మొదట అందుకున్నారు. కల్తీ జరిగింది అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశారు. అయితే 2024 సెప్టెంబర్ లో ఆయన స్టేట్మెంట్ ఇచ్చినపుడు జాతీయ స్థాయిలో ప్రకంపనలు పుట్టాయి. ఈ లడ్డూ ఇష్యూలో వైసీపీ అయితే పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. కానీ ఇప్పుడు చూస్తూంటే టీడీపీ ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపిస్తోంది. మొదట పై చేయి సాధించినట్లుగా అనిపించినా చివరికి చతికిలపడే పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు.
బాబు ప్రకటన మీద :
ఇదిలా ఉంటే తిరుమల లడ్డూ విషయం కానీ కల్తీ నెయ్యి విషయం కానీ చంద్రబాబు అసెంబ్లీలో డిబెట్ పెట్టి మరీ ఇచ్చిన వివరణ ముఖ్యమంత్రి హోదాలో చేసిన ప్రకటన సొంత పార్టీ ఎమ్మెల్యేలనే సరిగ్గా కన్వీన్స్ చేయలేక పోయింది అని అంటున్నారు. ఇక పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భార్య చేతిలో బైబిల్ ఉందని చెప్పినా భూమన కరుణాకరరెడ్డి కూతురు పెళ్ళి విషయం కానీ ఆయన క్రిస్టియన్ అని ముద్ర వేసే ప్రయత్నం కానీ ఈ వాదనలు ఏవీ ఎమ్మెల్యేలను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయని అంటున్నారు. అందుకే ఎమ్మెల్యేలు ఎవరూ పెద్దగా రెస్పాండ్ అవలేదని అంటున్నారు.
ఎన్నో సార్లు చర్చ జరిగింది :
ఎందుకు అంటే ఈ విషయాల మీద ఆ పాత వీడియోల మీద ఎన్నో సార్లు చర్చ సాగింది. భూమన కానీ వైవీ సుబ్బారెడ్డి కానీ వివరణ ఇచ్చి ఉన్నారు. తమ మీద క్రిస్టియన్ ముద్ర అన్నది అబద్ధం అని వారూ చెప్పుకున్నారు. అదే నిరూపితం అయింది. అలాంటి వాటిని ఉదాహరణలుగా తీసుకుని చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడం వల్ల అవన్నీ పాత చింతకాయ పచడి మాదిరిగానే ఉన్నాయని అంటున్నారు. దాంతోనే ఇవన్నీ పెద్దగా ఎవరికీ ఎక్కలేదని అంటున్నారు.
కొత్త టాపిక్స్ మీద ఫోకస్ :
ఇపుడు చూస్తే కొత్త టాపిక్స్ ముందుకు వచ్చాయి. అవి తిరుపతి లడ్డూ లో కల్తీ నెయ్యి కలిపిన దాని మీద హెరిటేజ్ మీద అలాగే ఇందాపూర్ డెయిరీ మీద హాట్ టాపిక్స్ నడుస్తున్నాయి. వీటి విషయంలో వివరణ ఇచ్చి ప్రత్యర్ధి వైసీపీకి చెక్ పెట్టాల్సిన చోట బాబు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ వేరే విధంగా ఉందని అంటున్నారు. అందుకే టీడీపీ క్యాడర్ సైతం సరిగ్గా రియాక్ట్ కాలేదని అంటున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ :
ఇక ఇందాపూర్ డెయిరీ మీద టీడీపీ అనుకూల మీడియాలో కో మాన్యుఫ్యాక్చర్ అని ఏకంగా కంఫర్మ్ చేసేశారు అని అంటున్నారు. అయితే బాబు అసెంబ్లీలో చెప్పినది వేరే విధంగా ఉంది అని అంటున్నారు. అంతే కాదు వెబ్ సైట్ లో మార్చివేశారు అని అంటున్నా అవన్నీ కూడా అవన్నీ కూడా ఇప్పటికే సోషల్ మీడియా సర్కిల్స్ లో తెర సర్క్యులేట్ అయిపోయాయి అని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎందుకో ప్రజంటేషన్ సరిగ్గా ఈ ఇష్యూల మీద చేయలేకపోయారు అని అంటున్నారు.
వైసీపీకి ఏ మాత్రం నోరెత్తకుండా :
తిరుమల రెండు కొండలు అన్న దాని మీద కూదా చంద్రబాబు సభకు చెబుతూ చాలా సార్లు తడబాటుకు గురి అయ్యారని అంటున్నారు. చంద్రబాబు ఎంతో సీనియర్ అయిన నేత కానీ హెరిటేజ్ ఇష్యూ వంటి వాటి మీద సున్నితమైన అంశాలు కావడంతో అనుకున్న విధంగా చెప్పలేకపోయారా అన్న చర్చ సాగుతోంది. ఏది ఏమైనా బాబు అసెంబ్లీ ప్రసంగం తరువాత ఇక వైసీపీకి ఏ మాత్రం నోరెత్తకుండా గట్టి జవాబు చెబుతారు అనుకున్నారు. కానీ అనుకున్నంత పవర్ ఫుల్ గా అయితే బాబు స్పీచ్ లేదని అంటున్నారు. ఇంకా గట్టిగానే చెప్పవచ్చు అని కూడా అంటున్న వారు ఉన్నారు. మొత్తం మీద అసెంబ్లీలో కల్తీ నెయ్యి ఇష్యూలో ఎక్కువగా పాత పాయింట్లే దొర్లాయని కొత్తగా ఏవైనా చేర్చి మాట్లాడి ఉంటే రక్తి కట్టేది అని అంటున్నారు.