కూటమి మంత్రుల్లో టెన్షన్.. రీజనేంటి ..!
రాష్ట్రంలో చంద్రబాబు చేపడుతున్న పలు సర్వేలు నిజాలో.. కాదో.. అనే విషయం పక్కన పెడితే ఈ సర్వే రిపోర్ట్ లు ఆధారంగా చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు మంత్రుల్లో టెన్షన్ పడుతున్నాయి.;

రాష్ట్రంలో చంద్రబాబు చేపడుతున్న పలు సర్వేలు నిజాలో.. కాదో.. అనే విషయం పక్కన పెడితే ఈ సర్వే రిపోర్ట్ లు ఆధారంగా చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు మంత్రుల్లో టెన్షన్ పడుతున్నాయి. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు మంత్రులను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. అయితే పైకి ఎవరూ చెప్పకపోయినా అంతర్గత చర్చల్లో మాత్రం మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గమనిస్తే మంత్రులు ఇతర విషయాల్లో వేలు పెడుతున్నారని, వేరే వేరే శాఖలలో వ్యవహారాలను గమనిస్తూ వారి మంత్రతో శాఖలను వదిలేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల తెనాలి ఘటన తర్వాత పోలీస్ వ్యవహారంలో మంత్రి అనిత పై మరో మంత్రి కామెంట్ చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలను ఉద్దేశించే చంద్రబాబు అన్నారని మంత్రుల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో మంత్రి సబితకు సంబంధించిన శాఖలో మరో మంత్రి వేలు పెట్టడం కూడా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు పర్యవసానంగా మారిందని మరికొందరు చెబుతున్నారు. ప్రస్తుతం టిడిపి మంత్రుల వ్యవహార శైలిపైనే చంద్రబాబు వ్యాఖ్యలు చేసినా.. అంతర్గత చర్చల్లో మాత్రం అందరి పైనా ఇది వర్తిస్తుందన్నట్టు గానే మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో తాజాగా జరిగిన బదిలీలు వివాదాస్పదమయ్యాయి.
అదే విధంగా విద్యాశాఖలో కూడా టీచర్లు బదిలీలు వివాదానికి దారి తీశాయి. ఈ రెండు విషయాల్లోనూ టిడిపిలో ఉన్న మంత్రులే జోక్యం చేసుకున్నారనేది అనుకూల మీడియాలో వచ్చిన వార్తలను బట్టి తెలుస్తోంది. ఈ రెండు విషయాలను కూడా ముఖ్యమంత్రి పరోక్షంగా ప్రస్తావించారని అందుకే ఆయన సర్వేల రిపోర్టు పేరుతో మంత్రులను గట్టిగానే హెచ్చరించారని ఒక వాదన నడుస్తోంది. అయినా మంత్రుల విషయంలో చంద్రబాబు గతంలో కంటే ఇప్పుడు ఇంకా గట్టిగానే స్పందించడం హెచ్చరించడం వంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి.
దీంతో ఆ మంత్రులు మారతారా లేక మంత్రులనే చంద్రబాబు మారుస్తారా అనేది ఏ ఇద్దరు మంత్రులు కలిసినా చర్చించుకుంటు న్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఎలాంటి చర్యలు ఉండబోవని మరో రెండు మూడు నెలల పాటు వేచి చూసిన తర్వాత వివాదాస్పద మంత్రులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారనే మాట కూడా వినిపిస్తుండడం గమనార్హం. అదేవిధంగా మంత్రుల మధ్య సఖ్యత లేదనే విషయాన్ని చంద్రబాబు పరిశీలిస్తున్నారని చెబుతుండడం వంటివి ప్రస్తుతం ఆసక్తిగా మారాయి. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. ఏదేమైనా ఎన్ని సర్వేలు వచ్చినా.. కొందరు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు అయితే వ్యవహరిస్తున్నారనేది వాస్తవం.