శివలింగం మీద తేలు లాంటి జగన్....ఇక నో చాన్స్ !

జగన్ విషయంలో కచ్చితంగా కఠినంగానే వ్యవహరిస్తామని ఆయన కుండబద్ధలు కొట్టారు. ఇప్పటి దాకా ఒకటి ఇక ముందు మరోటి అని అన్నారు.;

Update: 2025-06-12 17:08 GMT

టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఆయన శివలింగం మీద తేలు మాదిరిగా ప్రజలను బాధపెడుతున్నారని నిందించారు. జగన్ రాజకీయ పార్టీ ముసుగులో అంతా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏడాది కూటమి పాలన పూర్తి అయిన సందర్భంగా ఒక ప్రముఖ తెలుగు టీవీ చానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన చంద్రబాబు తన జగన్ మీద హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయంగా జగన్ ని రాజకీయంగా నిర్వీర్యం చేయాల్సి ఉందని అన్నారు. ఆయన రాజకీయాలకే కుదరని మనిషి అని కామెంట్స్ చేశారు.

జగన్ లాంటి వ్యక్తులను రాజకీయాల నుంచి పూర్తిగా దూరం పెట్టాల్సిందే అన్నారు. తాను తీవ్ర వాదులతోనే పోరాడి విజయం సాధించిన వాడిని అని చెప్పారు హైదరాబాద్ లో మతకలహాలను నిలువరించిన వాడిని అని ఆయన చెప్పారు. అంతే కాదు రాయలసీమలో ఒకపుడు ఫ్రాక్షనిజం పెద్ద ఎత్తున ఉంటే దాన్ని అంతం చేసిన ఘనత తనదని అన్నారు.

ఇన్ని చేసిన తనకు జగన్ అనే ఫ్యాక్టర్ ఎక్కువ ఏమీ కాదని బాబు చెప్పుకొచ్చారు. జగన్ రాజకీయ ముసుగు వేసుకుని ఆడుతున్న నాటకాన్ని రట్టు చేస్తామని గర్జించారు బాబు. ప్రజల భవిష్యత్తుతో వారి జీవితాలలో జగన్ ఆటలాడుకుంటునారని ఈసారి ఆ చాన్స్ ఇవ్వబోమని తెగెసి చెప్పారు.

జగన్ విషయంలో కచ్చితంగా కఠినంగానే వ్యవహరిస్తామని ఆయన కుండబద్ధలు కొట్టారు. ఇప్పటి దాకా ఒకటి ఇక ముందు మరోటి అని అన్నారు. జగన్ విషయంలో భవిష్యత్తులో ఏమి చేయదలచుకున్నది స్పష్టత అయితే బాబు ఇచ్చారు కానీ ఏ విధంగా అన్నది మాత్రం చెప్పలేదు. ఆయన లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాల్సిన వారు కాదని చంద్రబాబు ఫైర్ అయ్యారు.

మొత్తానికి జగన్ విషయంలో చూస్తూ ఊరుకునేది లేదని బాబు అంటున్నారు. ఆయన ఇక ముందు వైసీపీ కట్టడికి జగన్ విషయంలో తీసుకోవాల్సిన చర్యలకు సంకేతాలు ఇస్తున్నారు. వైసీపీని రాజకీయ పార్టీగా కూడా బాబు భావించడం లేదని ఆయన మాటల బట్టి అర్ధం అవుతోంది. రాజకీయ ముసుగులో నేరస్తులు అంటూ ఆయన పదే పదే మాట్లాడుతున్నారు. జగన్ ని నేరస్తుడిగా చితీకరించి జనం ముందు పెడుతున్నారు.

ఆయనను రాజకీయాలలో లేకుండా చూస్తామని అంటున్నారు. చంద్రబాబు అయితే వైసీపీ విషయంలో ఏ మాత్రం ఉపేక్షించేది లేదన్నట్లుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే చాలా దశాబ్దాలుగా రాజకీయాలు నేరాలు అరాచకాలు అవినీతి అన్నీ కలగలసిపోయిన నేపథ్యం ఉంది. జనాలు వీటిని ఎంత మేరకు సీరియస్ గా పట్టించుకుంటారు అన్నది కూడా చూడాలని విశ్లేషకులు అంటున్నారు. భారతీయ రాజకీయాల్లో ఎవరిని అయినా జైలులో పెడితే సింపతీ వచ్చేస్తోంది.

అందువల్లనే ఎవరైనా ఏమైనా చేస్తూ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. మరి బాబు అయితే వైసీపీని జగన్ ని స్పేర్ చేయబోమని అంటున్నారు. జగన్ గురించి జనాలకు చెప్పి మరీ ఆయన మీద చర్యలు తీసుకుంటే జనామోదం ఉంటుందని బహుశా ఆయన భావిస్తున్నారులా ఉంది. అందుకే నేరస్తులకు రాజకీయాల్లో చోటు లేదని అంటున్నారు. చూడాలి మరి కూటమి చేతిలో నాలుగేళ్ళ పాటు అధికారం ఉంది. జగన్ విషయంలో ఇక మీదట ఏ తీరున వ్యవహరిస్తారు అన్నది రానున్న కాలంలో తెలుస్తుంది.

Tags:    

Similar News