గ్రామీణ బ్యాంకులకు కొత్త లొగో
దేశంలో కొత్త పేర్లు, కొత్త లోగోలతో సరికొత్త నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం వరసగా తీసుకుంటోంది.;
దేశంలో కొత్త పేర్లు, కొత్త లోగోలతో సరికొత్త నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం వరసగా తీసుకుంటోంది. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు (ఆర్‌ఆర్‌బి)లకు కొత్త లోగోను సూచిస్తూ వాటిని నూతనంగా ఆవిష్కరించింది. ఈ లోగోలను ఎందుకు ఆవిష్కరిస్తున్నామో కూడా కేంద్రం వివరించింది.
పురోగతి కోసం :
దేశంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఎపుడూ పురోగతిని సాధించాలన్నది ఈ లోగో ప్రధాన ఉద్దేశ్యం గా చెబుతున్నారు. అదే విధంగా ఆర్ధికంగా గ్రామీణ ప్రాంతాన్ని శక్తివంతం చేయడంతో పాటు అవసరమైన విజ్ఞానాన్ని అందించేలా ఈ లోగా సూచిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్రామీణ భారతదేశానికి సేవ చేయడంలో ఆర్‌ఆర్‌బిల మూల విలువలను వాటి సమున్నత ఆశయాలను కూడా ఈ కొత్త లోగో ప్రతిబింబిస్తుందని పేర్కొంటోంది.
దేశమంతటా :
ఇదిలా ఉంటే ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇవన్నీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చూసే కనుక ఏకంగా ఏడు వందలకు పైగా జిల్లాలలో అదే విధంగా 22 వేలకు పైగా స్థానిక శాఖలతో ఒక బలమైన నెట్‌వర్క్‌తో పనిచేస్తున్నాయి. ఇక కేంద్ర స్థాయిలో 28 ఆర్‌ఆర్‌బిల నెట్ వర్క్ తో ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఇవి ఆర్థికంగా రూరల్ సెక్టార్ ని మెయిన్ స్ట్రీమ్ తో కలిపి ఉంచడంతో పాటు ఆర్ధికంగా సమ్మిళితాన్ని ప్రోత్సహించడంలో అతి ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. అదే విధంగా గ్రామీణ అభివృద్ధికి తోడ్పడటంలోఆర్‌ఆర్‌బీలు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
బ్యాంకింగ్ రంగంలో :
ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం దేశంలోని బ్యాకింగ్ రంగంలో సంస్కరణలు పెద్ద ఎత్తున ప్రవేశపెడుతోంది. అదే విధంగా అనేక ప్రధాన బ్యాంకులను తగ్గించడం ద్వారా ప్రపంచ స్థాయిలో వచ్చే పోటీని తట్టుకునే విధంగా అతి పెద్ద బ్యాంకులుగా రూపుదిద్దే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో రూరల్ సెక్టార్ కి అవసరం అయ్యే విధంగా ఉన్న ఆర్‌ఆర్‌బీలను ప్రోత్సహించేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలోనే లోగో చూస్తేనే ఆ భావన రావాలన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉంది. మరి ఆర్‌ఆర్‌బీలు ఈ కొత్త లోగో అందించే స్పూర్తితో మరింతగా గ్రామీణ ప్రాంతానికి ఏ విధంగా సేవలు విస్తృతం చేస్తాయన్నది చూడాల్సి ఉంది.