చైనా తో.. భార‌త్‌-భార‌త్‌ తో ఏపీ పోటీ ప‌డుతున్నాం: చంద్ర‌బాబు

అభివృద్ధి విష‌యంలో ఏపీ దూసుకుపోతోంద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. చైనాతో భార‌త దేశం పోటీ ప‌డుతుండ‌గా.. భార‌త దేశంతో చైనా పోటీ ప‌డుతోంద‌ని ఆయ‌న తెలిపారు.

Update: 2026-06-15 08:38 GMT

అభివృద్ధి విష‌యంలో ఏపీ దూసుకుపోతోంద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. చైనాతో భార‌త దేశం పోటీ ప‌డుతుండ‌గా.. భార‌త దేశంతో చైనా పోటీ ప‌డుతోంద‌ని ఆయ‌న తెలిపారు. పెట్టుబ‌డులు, పారిశ్రామిక రంగాల్లో ఏపీకి భారీ ఎత్తున కంపెనీలు వ‌స్తున్నాయ‌న్నారు. సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా.. స్టార్టప్ వెంచర్ కాపిటలిస్టుల(స్టార్ట‌ప్‌ల పెట్టుబ‌డిదారులు)తో నిర్వ‌హించిన‌ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

ఈ స‌మావేశాన్ని సింగపూర్‌‌లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే స‌మ‌న్వ‌యం చేయ‌గా.. దీనిలో మంత్రి పి.నారాయణ, సింగపూర్‌ స్టార్టప్ వెంచర్ కాపిటలిస్టులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బా బు భార‌త్ స‌హా ఏపీలోని పెట్టుబ‌డుల‌కు అనుకూల అవ‌కాశాల‌ను వివ‌రించారు. గ‌త 12 సంవ‌త్స‌రాలుగా భార‌త్ లో అనేక సంస్క‌ర‌ణ‌లు వ‌చ్చాయ‌ని .. ప్ర‌స్తుతం అతి పెద్ద ఆర్థిక శ‌క్తిగా ఎదుగుతోంద‌ని తెలిపారు.

ప్రధాని న‌రేంద్ర మోడీ లాంటి ఆధునిక ఆలోచనలు ఉన్న వ్యక్తి దేశాన్ని ఓ అద్భుతమైన వేగంతో అభివృద్ధి చేస్తున్నారు. చైనా లాంటి దేశాలు ఆర్ధిక అభివృద్ది సాధించటానికి దశాబ్దాల కాలం పట్టింద‌ని, కానీ భారత్‌కు అంత సమయం పట్టటం లేదని అన్నారు. వైద్య సాంకేతిక‌తలో.. ఇతర ఆధునిక పరికరాల తయారీలో భారత్ అగ్రస్థానంలో ఉందని చంద్ర‌బాబు తెలిపారు.

తయారీ రంగాన్ని ప్రోత్సహించేలా ఏపీలో సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌స్తున్న‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. ఈ క్ర‌మంలో ప్ర‌తి కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక‌వేత్త నినాదంతో ప‌నిచేస్తున్నామ‌న్నారు. భూ సేక‌ర‌ణ స్థానంలో స‌మీక‌ర‌ణ‌ను తీసుకువ‌చ్చామ‌ని.. దీనికి రైతుల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంద‌న్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తికి 33 వేల‌కు పైగా ఎక‌రాల భూమిని స‌ముపార్జించామ‌న్నారు. ప్ర‌పంచ స్థాయి రాజ‌ధానిగా దీనిని డెవ‌ల‌ప్ చేస్తున్నామ‌ని చెప్పారు.

గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ లాంటి పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇచ్చామ‌ని చంద్ర‌బాబు తెలిపారు . పారిశ్రామిక ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఇదే సరైన సమయమ‌ని,. పెట్టుబడిదారులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శ్రీసిటీ లాంటి ప్రత్యేక పారిశ్రామిక సెజ్‌ల‌ను అభివృద్ది చేశామ‌న్నారు. అన్ని అంశాలకూ టెక్నాలజీని అనుసంధానించామ‌న్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా పెట్టుబడులకు ఆస్కారం ఉంద‌ని తెలిపారు.

Tags:    

Similar News