వైసీపీపై బాబు కామెంట్స్.. మీనింగ్ ఏంటి ..!
అనంతపురం వేదికగా.. బుధవారం నిర్వహించిన సూపర్ సిక్స్ - సూపర్ హిట్ భారీ బహిరంగ సభ నుంచి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి;
అనంతపురం వేదికగా.. బుధవారం నిర్వహించిన సూపర్ సిక్స్ - సూపర్ హిట్ భారీ బహిరంగ సభ నుంచి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా టీడీపీలోనే ఈ చర్చ ఎక్కువగా జరుగుతోంది. చంద్రబాబు అనేక విషయాలను ప్రస్తావించారు. అయితే.. దీనిలోనూ ప్రధానంగా ఆయన ప్రతిపక్షం వైసీపీని ఉద్దేశించి.. గతానికి భిన్నంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీశాయి? అసలు బాబు వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటన్న విషయంపై విస్తృతంగా చర్చ సాగుతోంది.
ఇంతకీ బాబేమన్నారు..?
సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో తరచుగా వైసీపీని టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ దఫా కొంత డోసు పెంచారు. వైసీపీ అధినేత జగన్‌ను ధ్రుతరాష్ట్రుడితో పోల్చారు. ఆయన కౌగిలిని ధ్రుత రాష్ట్ర కౌగిలితో పోల్చారు. అంటే.. ధ్రుతరాష్ట్రుడి దగ్గర ఉన్నవారు.. ఆయన కారణంగానే నాశనం అయి పోతారన్నది బాబు ఉద్దేశం. అలానే.. జగన్ దగ్గర ఉన్నవారు.. జగన్ కారణంగానే అడ్రస్ లేకుండా పోతా రనిబాబు చెప్పకనే చెప్పారు. అంతేకాదు.. మరో అడుగు ముందుకు వేసి.. వైసీపీ పార్టీ కార్యాలయాలకు తాళాలు వేసుకునే పరిస్థితి వస్తోందన్నారు.
ఇది మరింతగా చర్చకు దారితీసింది. వైసీపీ కార్యాలయాలకు ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో తాళాలు పడిన మాట వాస్తవం. పిఠాపురం, కుప్పం, మంగళగిరితోపాటు.. తాడికొండ సహా.. 30 - 40 నియోజకవర్గాల్లో నాయకులు లేకుండా పోయారు. దీంతో అక్కడ కార్యక్రమాలు కూడా సాగడం లేదు. ఈ విషయాన్ని స్వయంగా జగన్ కూడా బుదవారం ఒప్పుకొన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు యాక్టివ్‌గా లేరని ఆయన చెప్పుకొచ్చారు. సో.. చంద్రబాబు అన్నీ ఆలో్చించే ఈ వ్యాఖ్యలు చేశారన్నది స్పష్టంగా తెలుస్తోంది.
మరి చంద్రబాబు ఉద్దేశం ఏంటి..?
బాబు చేసిన వ్యాఖ్యల అంతరాతర్థంపై ఇప్పుడు విస్తృతంగా చర్చ జరగడానికి కారణం.. వైసీపీకి తాళాలు పడితే.. జగన్‌ను ధ్రుతరాష్ట్రుడిగా భావించి.. ఆ పార్టీ నాయకులు బయటకు వస్తే.. తమలో కలుపుకొనేందు కు రెడీగా ఉన్నారా? అంటే.. కూటమి పార్టీల్లో దేనిలో చేరినా తమకు అభ్యంతరం లేదని పరోక్షంగా చం ద్రబాబు సిగ్నళ్లు ఇచ్చారా? అనేది ప్రశ్న. కానీ, గతంలో వైసీపీ నుంచి తీసుకున్న నాయకులతో ఇబ్బం దులు వచ్చాయని .. చంద్రబాబు స్వయంగా చెప్పారు. ఇప్పుడు ఆయనే వైసీపీ పని అయిపోయింద న్నారు. మరి దీనిని బట్టి.. తిరిగి తలుపులు తెరిచేందుకు రెడీ అయ్యారా? అనేది సందేహం. మరి చంద్రబాబు ఉద్దేశం ఏంటో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.