చిన్నారికి నామకరణం చేసిన చంద్రబాబు... పేరేమిటో తెలుసా?

ఆ సమయంలో.. తమ పాపకు పేరు పెట్టాలంటూ వారు చంద్రబాబు చేతుల్లో పెట్టారు.;

Update: 2025-07-02 04:48 GMT

ప్రతీ నెల ఒకటో తేదీ వచ్చిందంటే చంద్రబాబు గ్రామాల్లోకి వెళ్లిపోతున్నారు. ఆ గ్రామాల్లోని పేదల ఇళ్లల్లో కనిపిస్తున్నారు. ప్ర్జలతో మమేకమవుతున్నారు. వారి కష్టాలు వింటున్నారు, వారితో ముచ్చటిస్తున్నారు. తన లక్ష్యాలు చెబుతున్నారు, హామీల అమలు ప్రయత్నాలు వివరిస్తున్నారు. ఈ సమయంలో తాజాగా ఓ చిన్నారికి నామకరణం చేశారు.

అవును... ప్రతీ నెల 1వ తేదీన చంద్రబాబు ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెలలో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం మలకపల్లిలో పింఛన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. మలకపల్లిలో చర్మకారుడు, డప్పు కళాకారుడు సనమంట్ర పోసిబాబు నివాసానికి చంద్రబాబు వెళ్లి రూ.4 వేల పింఛను అందించారు

అనంతరం... పోసిబాబు నివాసం నుంచి మలకపల్లిలో ప్రజావేదికకు వెళ్లే మార్గంలో మూడు నెలల పసిపాపను పట్టుకొని అభివాదం తెలుపుతున్న ఓ కుటుంబం కనిపించడంతో చంద్రబాబు కాన్వాయ్‌ ను ఆపించారు.. కారులో నుంచి కిందికి దిగారు. ఆ సమయంలో.. తమ పాపకు పేరు పెట్టాలంటూ వారు చంద్రబాబు చేతుల్లో పెట్టారు.

ఈ సందర్భంగా... పాప పేరులో మొదటి అక్షరం ఏమి ఉండాలని చంద్రబాబు ప్రశ్నించగా... 'ఎస్‌' అక్షరం వచ్చేలా పెట్టండని వారు చెప్పారు. దీంతో... నాలుగు పేర్లు సూచించాలంటూ కలెక్టర్‌ ప్రశాంతిని అడిగారు సీఎం చంద్రబాబు. ఈ సమయంలో కలెక్టర్ కొన్ని పేర్లు చెప్పడంతో.. పాపను ముద్దాడిన చంద్రబాబు..'షర్లిన్‌ ప్రశస్థ' అని నామకరణం చేశారు.

ఇలా తమ పాపకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే పేరు పెట్టడంతో.. తల్లి అశ్విని, మేనమామ సునీల్‌ ఆనందం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా... కూటమి ప్రభుత్వ పాలన బాగుందని, మళ్లీ మీరే రావాలని కోరుకుంటున్నట్లు అక్కడున్న ప్రజలు చంద్రబాబుకు తెలిపారు. గతంలో ఎన్నో ఇబ్బందులు పడినట్లు చెప్పారు.

Tags:    

Similar News