• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  దావోస్ రిజల్ట్ : పాజిటివ్...

దావోస్ రిజల్ట్ : పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసిన బాబు

| ఏపీ లాంటి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించాలని అతి పెద్ద లక్ష్యంతో దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫారం కి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్ళారు

By - Tupaki Desk
Update: 2025-01-24 04:15 GMT

ఏపీ లాంటి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించాలని అతి పెద్ద లక్ష్యంతో దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫారం కి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్ళారు. ఆయన బృందంలో యంగ్ టీం ఉంది. ఐటీ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు, పరిశ్రమల మంత్రి టీజీ భరత్ ఉన్నారు.

ఇదిలా ఉంటే నాలుగు రోజుల పాటు దావోస్ లో పర్యటించిన చంద్రబాబు అక్కడ అంతర్జాతీయ ప్రముఖులతో భేటీ అయ్యారు. బిలిగేట్స్ తో భేటీ వేసారు. ఐటీ దిగ్గజ సంస్థల పెద్దలనూ కలిసారు. వీలైనంత వరకూ ఏపీలో ఉన్న వనరుల గురించి ప్రమోట్ చేశారు. అమరావతి రాజధానిలో అనుకూల అంశాలు, మెగా సిటీ విశాఖలో ఐటీ పరంగా విస్తరణకు గల మార్గాలు అన్నీ కూడా బాబు వివరించారు. నారా లోకేష్ కూడా ఈసారి కీలక పాత్ర పోషించారు.

అయితే ఏపీలో రాజధాని నగరం ఇంకా రూపు దిద్దుకోవాల్సి ఉంది. విశాఖ మహా నగరంగా ఉన్నా మిగిలిన రాష్ట్రాలలో ఉన్న మెగా సిటీస్ తో పోటీ తట్టుకోవాల్సి ఉంది. అందుకే దావోస్ టూర్ లో ఏపీ ప్రభుత్వం చేసిన కృషి అయితే పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేసింది కానీ ఒప్పందాలు అయితే పెద్దగా గ్రౌండింగ్ కాలేదు అన్నది ఉంది.

అయితే అందరినీ ఆకట్టుకోవడంలో ఏపీ ప్రభుత్వ పెద్దలు సక్సెస్ అయ్యారు అనే చెప్పాల్సి ఉంది. మరో వైపు తెలంగాణాకు ఒక లక్షా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయీ అంటే హైదరాబాద్ విశ్వనగరంగా ఉండడం వల్లనే అని అంటున్నారు.

ఇది పోటీ ప్రపంచం. ఎంత అనుకున్నా ఎంతలా ప్రమోట్ చేసినా ఏపీలో ఉన్నవి అన్నీ టైర్ టూ సిటీసే. దాంతో పాటు బేసికల్ గా ఏపీ అగ్రికల్చర్ స్టేట్ గా ఉంది. దానిని పారిశ్రామికంగా పరుగులు పెట్టించే దశలో ఇపుడు మొదటి అడుగుల వద్దనే కధ సాగుతోంది.

దాంతో ఏపీకి పెట్టుబడులు పెద్దగా రావడం లేదు అంటే ఈ నేపథ్యాన్ని కూడా ఆలోచించాల్సిందే అని అంటున్నారు. ఏపీ పట్ల మోజు పెరగాలీ అంటే రాజధానిగా అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేసుకోవడం, అదే సమయంలో విశాఖతో పాటుగా ఇతర నగరాలను మహా నగరాలుగా తీర్చి దిద్దడం వంటివి చేయాలి.

అపుడు దావోస్ కి ప్రత్యేకంగా వెళ్ళాల్సిన పని ఉండదు, అక్కడి వారే వెతుక్కుంటూ వస్తారని చెప్పాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఏపీ మరింతగా ముందుకు సాగాలీ అంటే పాలకులతో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యంతో పనిచేయాల్సి ఉంటుంది. ఏపీని అంతా కలసి అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. దావోస్ సాక్షిగా మరో మారు ఇదే విషయం ఆవిష్కృతమైంది.

Tags:    
  • Chandrababu 
  • Apgovernment 
  • TDP 
  • Davos2025 
  • Apinvestments 
  • Chandrababunaidu 
  • Billgates 
  • Naralokesh 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS