• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కేజ్రీవాల్ కి చంద్రబాబు...

కేజ్రీవాల్ కి చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్

| ఢిల్లీ శాసనసభకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగబోతున్నాయి.

By - Tupaki Desk
Update: 2025-01-28 16:13 GMT

టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ మాజీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కి ఘనమైన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా అంటే ఈ ప్రశ్నకు జవాబు అవును అని వస్తోంది. ఢిల్లీ శాసనసభకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఎన్నికలు కేజ్రీవాల్ కి చావో రేవో అన్నట్లుగా ఉన్నాయి.

ఈసారి కనుక ఓటమి పాలు అయితే కేజ్రీవాల్ బిగ్ ట్రబుల్స్ లోకి వెళ్ళిపోతారని అంటున్నారు. ఇప్పటికే ఆయన మీద లిక్కర్ స్కాం కేసు ఉంది. కొన్నాళ్ళ పాటు జైలులో ఉండి వచ్చారు. దాంతో ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని ఆయన చూస్తున్నారు.

గెలిస్తే కనుక కేజ్రీవాల్ కి తిరుగులేదు, ఇండియా కూటమిలో అతి ముఖ్య పాత్రధారి అవుతారు. అంతే కాదు కేంద్రంలో నరేంద్ర మోడీకి మరింత గట్టి రాజకీయ ప్రత్యర్ధిగా మారి రాజకీయ సమరం సాగిస్తారు. ఆయన మీద ఉన్న లిక్కర్ స్కాం కేసుల విషయంలో పోరాడేందుకు మరింత ఆత్మ స్థైర్యం వస్తుంది.

అందుకోసమే చమటోడ్చి మరీ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇక బీజేపీ అయితే మొత్తానికి మొత్తం కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రులను పార్టీ సీనియర్ లీడర్లను దించి ప్రచారం హోరాహోరీగా చేస్తోంది. ఇపుడు చూస్తే ఎన్డీయే మిత్రులను కూడా ఢిల్లీ ఎన్నికల ప్రచారం కోసం వాడుకోబోతోంది.

అలా టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చింది. ఆయన ఫిబ్రవరి 1వ తేదీన ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారు. ఢిల్లీలో తెలుగువారు ఎక్కువగా ఉన్న చోట చంద్రబాబు ప్రత్యేకించి ప్రచారం చేస్తారు అని అంటున్నారు.

ఆయన ఎన్డీయేకు మద్దతుగా కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా ఈ ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ నెల 8న విశాఖలో జరిగిన సభలో అయితే ఢిల్లీలో బీజేపీ గెలిచి తీరుతుందని కూడా చంద్రబాబు ముందే జోస్యం చెప్పారు. ఆయన బీజేపీకు ఫుల్ సపోర్ట్ చేస్తూ ఆ విధంగా కేజ్రీవాల్ కి ఎదురు నిలుస్తున్నారు అన్న మాట.

మరి బాబు కేజ్రీవాల్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడమేంట్ అన్నది కనుక చూస్తే బాబుకు గతంలో కేజ్రీవాల్ మంచి స్నేహితుడుగా ఉన్నారు. 2018లో ఎన్డీయే నుంచి బాబు విడిపోయినపుడు నాటి ప్రతిపక్షాలతో చెట్టాపట్టాల్ వేశారు. ఇక కేజ్రీవాల్ ని ఆయన 2019 ఎన్నికల ప్రచారం కోసం కూడా ఉపయోగించుకున్నారు.

అలా అప్పటికి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ బబు కోసం ప్రత్యేకంగా విశాఖ వచ్చి మరీ భారీ బహిరంగ సభలో పాల్గొని బాబు విజనరీ అని పొగిడారు. ఆయనను గెలిపించాలని కూడా పిలుపు ఇచ్చారు. మరి బాబు కోసం కేజ్రీవాల్ ఒకనాడు ప్రచారం చేసిపెడితే ఇపుడు బీజేపీ కోసం బాబు కేజ్రీవాల్ కి ఎదురు వెళ్తున్నారు అని అంటున్నారు. ఆ విధంగా ఒకనాటి తన స్నేహితుడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు అని అంటున్నారు. మరి బాబు ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ మీద ఏ రకమైన విమర్శలు చేస్తారు దాని మీద కేజ్రీవాల్ కౌంటర్లు ఎలా ఉంటాయో కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది అని అంటున్నారు.

Tags:    
  • Delhielections 
  • Dlhiassemblyelections 
  • Assemblyeletions 
  • Delhi 
  • Bjp 
  • Aap 
  • Congressparty 
  • Arvindkejriwal 
  • Tdp 
  • Chandrababu 
  • Electioncampaigning 
  • Babureturngift 
  • Liquorscamcase 
  • NarendraModi 
  • Teluguvotes 
  • Electionpredictions 

Similar News

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

Copyright @2026

Powered by Blink CMS