• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏపీకి గేమ్ చేంజర్ గా బాబు...

ఏపీకి గేమ్ చేంజర్ గా బాబు లోకేష్ దావోస్ టూర్

| టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పాటు అయిన తరువాత దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం తొలి సదస్సు ఇది.

By - Tupaki Desk
Update: 2025-01-02 04:11 GMT

మరి కొద్ది రోజులలో ఏపీలో ఒక విశేషం జరగబోతోంది. ఒక విధంగా చెప్పాలీ అంటే దేశ రాజకీయాల్లో కూడా ఇది జరిగి ఉండదు. ఒకే ప్రభుత్వం తండ్రీ కొడుకులు పదవులలో ఉండడం అన్నది చాలా చోట్ల జరిగింది కానీ దావోస్ వంటి చోట పెట్టుబడుల సదస్సుకు తండ్రీ కొడుకులు సీఎం మినిస్టర్ హోదాలో కలసి వెళ్ళడం ఎక్కడా జరగలేదు. ఆ రికార్డుని సీఎం చంద్రబాబు మినిస్టర్ లోకేష్ కలసి క్రియేట్ చేయబోతున్నారు.

ఈ నెల 20 నుంచి 24 వరకూ అయిదు రోజుల పాటు దావోస్ లో జరిగే పెట్టుబడుల సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశ్రమలు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కలసి హాజరు కాబోతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పాటు అయిన తరువాత దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం తొలి సదస్సు ఇది.

సాధారణంగా దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు మంత్రులు ఎక్కువగా హాజరవుతారు. కొన్ని సందర్భాల్లో సీఎంలు కూడా వెళ్తారు. గత ఏడాది తెలంగాణా సీఎం గా రేవంత్ రెడ్డి కూడా దావోస్ సదస్సుకు వెళ్లారు. ఇక ఏపీలో జూన్ 12న అధికారాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టిన వెంటనే నారా లోకేష్ కొద్ది నెలల తేడాలో అమెరికా టూర్ పెట్టుకున్నారు. ఆయన ఈ ఏడాది అక్టోబర్ చివరిలో వారం నుంచి పది రోజుల పాటు అమెరికాలో పర్యటించారు. ఆయన గూగుల్ సంస్థలతో పాటు అనేక కంపెనీ అధిపతులను కలసి ఏపీలో పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేసారు.

వాటి ఫలితాలు తొందరలో వస్తాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో మరింత పట్టుదలగా చంద్రబాబు లోకేష్ దావోస్ వెళ్తున్నారు. ఈసారి ఇద్దరూ అక్కడ పెట్టుబడుల విషయంలో సీరియస్ గా ఫోకస్ చేయనున్నారు. ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకుని రావాలని చూస్తున్నారు లక్ష కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం దానికి తగినట్లుగా కార్యాచరణను సిద్ధం చేస్తోంది.

మొత్తం తమ అయిదేళ్ల పాలనలో లక్ష కోట్ల పెట్టుబడులు కనుక ఏపీకి వస్తే దాని నుంచి ఇరవై లక్షల దాకా ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆ విధంగా పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయని అదే సమయంలో ఏపీ పారిశ్రామికంగా అభివృద్ధి బాటను పడుతుందని కూడా అంచనా వేసుకుంటున్నారు. అదే విధంగా ఏపీ గ్రోత్ రేట్ కూడా పెరిగి దేశంలో అభివృద్ధి చెందిన టాప్ ఫైవ్ స్టేట్స్ లో ఒకటిగా ఉంటుందని ఉండాలని భావిస్తూ చంద్రబాబు లోకేష్ దావోస్ టూర్ ని పెట్టుకున్నారు

ఈ నెల 19న ఏపీ నుంచి బయలుదేరి చంద్రబాబు లోకేష్ దావోస్ చేరుకుంటారు అని అంటున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే చంద్రబాబు తొలి విదేశీ టూర్ ఇదే కావడం. ఆయన నాలుగవ సారి సీఎం అయ్యాక ఈ టూర్ చేస్తున్నారు అంతే కాదు చంద్రబాబు లోకేష్ ఇద్దరూ ఒకేసారి విదేశీ టూర్ చేయడంతో కనీసంగా వారం రోజుల పాటు కూటమి ప్రభుత్వానికి ఈ ఇద్దరూ లేని లోటు అయితే కచ్చితంగా ఉంటుంది అని అంటున్నారు.

అయితే దావోస్ సదస్సు మీద కోటి ఆశలు పెట్టుకుని చాలా ప్రెస్టీజియస్ గా ఈ టూర్ ని బాబు అండ్ లోకేష్ చేస్తున్నారు అని అంటున్నారు. ఒక విధంగా చంద్రబాబు లోకేష్ ల దావోస్ టూర్ ఏపీకి ఒక గేమ్ చేంజర్ గా మారుతుంది అంటున్నారు చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    
  • Chandrababu 
  • NaraLokesh 
  • DavosTour 
  • WorldEconomicForum 
  • APPolitics 
  • InvestmentSummit 
  • APDevelopment 
  • TDP 
  • GameChanger 
  • APJobs 

Similar News

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

Copyright @2026

Powered by Blink CMS