• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆడ‌దాని ఓర చూపుకు...

ఆడ‌దాని ఓర చూపుకు 'పడిపోయిన‌ జెన్స‌న్‌లు'!

| వివాహేతర సంబంధాలు, కార్యాలయ నిబంధనల ఉల్లంఘనలతో పలువురు ప్రముఖ సంస్థల సీఈఓలు వివాదాల్లో చిక్కుకున్నారు. జెఫ్ బెజోస్, బిల్ గేట్స్, ఎలోన్ మస్క్, బ్రయాన్ క్రజానిచ్, స్టీవ్ ఈస్టర్‌బ్రూక్ వంటి ప్రముఖుల వ్యక్తిగత జీవితాలు, ఉద్యోగులతో సంబంధాలు వార్తల్లో నిలిచాయి. కొందరు తమ పదవులను కూడా కోల్పోయారు. అయితే జెన్సన్ హువాంగ్ రాజీనామా చేశారనే కథనానికి విశ్వసనీయ ఆధారం లేదు.

By - Garuda Media
Update: 2026-11-13 10:30 GMT

``ఆడదాని ఓరుచూపుతో.. జ‌గాన ఓడిపోని ధీరులెవ్వ‌రోయ్‌!..`` అంటూ..సాగే తెలుగు సినిమాలోనిపాట గుర్తుందా?.. ఇది కేవలం పాటే కాదు.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే వాస్త‌వం అని ఒప్పుకోవాల్సిందే. ప్ర‌స్తుతం అమెరికా, చైనాలు స‌హా.. ప‌లు దేశాల‌ను కుదిపేస్తున్న చాట్ జీపీటీ ఎన్‌విడియా సంస్థ అధిప‌తి, సీఈవో జెన్స‌న్ హువాంగ్ వ్య‌వ‌హారాన్ని గ‌మ‌నిస్తే.. నిజ‌మ‌నే అంటున్నారు. చిరు ఉద్యోగిగా త‌న జీవితాన్ని ప్రారంభించిన జెన్స‌న్‌.. త‌న క‌ష్టంతో అత్యున్న‌త శిఖ‌రాల‌కు ఎదిగారు. ఒక‌ప్పుడు.. రూపాయి కోసం ఎదురు చూసిన ఆయ‌న‌... బిలీనియ‌ర్‌గా మారారు.

ప్ర‌పంచాన్ని సైతం త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేశారు. అలాంటి జెన్స‌న్‌ ఓ యువ‌తి ఓర చూపుకు ప‌డిపోయా రు. ఇది ఏకంగా ఆయ‌న‌ను సీఈవో పోస్టుకు రాజీనామా చేయించింది. అంతేకాదు.. అటు అమెరికా, ఇటు చైనాలు కూడా విచార‌ణ చేప‌ట్ట‌నున్నాయి. మొత్తంగా ఓ నిందితుడిగా ఆయ‌న మార‌నున్నారు. అయితే.. చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే.. ఇలాంటి జెన్స‌న్‌లు చాలా మంది ఉన్నారు. జీవితంలో అనేక క‌ష్టాలు ఎదుర్కొని ఇంతింతై అన్న‌ట్టుగా ఎదిగిన వారు.. వివాహేత‌ర సంబంధాలు, ప్రేమ ప్ర‌యాణాల‌తో త‌మ గ్రాఫ్‌ను తామే కూల‌దోసుకున్నారు.

ఎవ‌రెవ‌రంటే..

జెఫ్ బెజోస్ (అమెజాన్ వ్యవస్థాపకుడు). 2019లో లారెన్ సాంచెజ్‌తో ఉన్న రహస్య సంబంధం బయటపడటంతో బెజోస్ వ్యక్తిగత జీవితం పెద్ద వివాదంగా మారింది. దీని ఫలితంగా 25 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ భార్య మెకంజీ స్కాట్‌కు సుమారు 38 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విడాకుల భరణంగా ఇవ్వాల్సి వచ్చింది. అప్ప‌ట్లో అమెజాన్ షేర్లు కుప్ప‌కూలాయి. ప్ర‌పంచం కూడా ఆయ‌న‌ను నిందితుడిగా చూసింది.

బిల్ గేట్స్ (మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు). సంస్థలోని ఒక మహిళా ఉద్యోగితో గతంలో ఉన్న సంబంధంపై మైక్రో సాఫ్ట్ బోర్డు విచారణ జరపడం పెద్ద సంచలనం రేపింది. ఈ వివాదాల నేపథ్యంలోనే 2020లో ఆయన మైక్రోసాఫ్ట్ బోర్డు నుండి తప్పుకున్నారు 2021లో భార్య మెలిండా గేట్స్‌తో విడాకులు తీసుకున్నారు. ఆయ‌న‌పై వున్న ఆరోప ణ‌ల‌కు అమెరికా ఇప్ప‌టికీ విచార‌ణ జ‌రుపుతోంది.

ఎలోన్ మస్క్ (టెస్లా స్పేస్‌ఎక్స్ అధినేత). తన సంస్థల్లో పనిచేసే ఉద్యోగిని షివోన్ జిలిస్‌తో రహస్యంగా కవల పిల్లలకు జన్మనివ్వడం, అలాగే తన స్నేహితుడు సెర్గీ బ్రిన్ భార్యతో సంబంధం ఉందన్న ఆరోపణలు మస్క్‌ను తీవ్ర వివాదాల్లోకి నెట్టాయి. ఒక ద‌శ‌లో ఈయ‌న షేర్లు కూడా ప‌త‌నం అయ్యాయి.

బ్రయాన్ క్రజానిచ్ (ఇంటెల్ మాజీ సీఈఓ). సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఒక ఉద్యోగినితో సంబంధం పెట్టుకు న్నట్లు తేలడంతో 2018లో ఆయన తన సీఈఓ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

స్టీవ్ ఈస్టర్‌బ్రూక్ (మెక్‌డొనాల్డ్స్ మాజీ సీఈఓ). కంపెనీలోని ఒక ఉద్యోగినితో సంబంధం కలిగి ఉన్నందుకు 2019లో బోర్డు ఆయన్ను పదవి నుండి తొలగించింది. తర్వాత మరికొందరు ఉద్యోగులతోనూ సంబంధాలు ఉన్నాయని తేలడంతో భారీ జరిమానా కూడా చెల్లించారు.

లారెంట్ ఫ్రీక్స్ (నెస్లే మాజీ సీఈఓ). తన కింద పనిచేసే ఒక ఉద్యోగినితో ఉన్న రహస్య సంబంధాన్ని వెల్లడించనం దుకు 2025లో నెస్లే సంస్థ ఆయన్ను సీఈఓ పదవి నుండి తొలగించింది. ఆయ‌న‌పై కేసు కూడా నమోదైంది.

ఆండీ బైరాన్ (ఆస్ట్రోనోమర్ సీఈఓ). ఒక లైవ్ కాన్సర్ట్‌లో తమ సంస్థ హెచ్‌ఆర్ హెడ్‌తో సన్నిహితంగా ఉంటూ కెమెరాకు చిక్కడం వైరల్ కావడంతో ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పైగా.. సంస్థ ప్ర‌తిష్ట‌ను భంగ ప‌రిచార‌న్న కేసుతోపాటు.. జీవిత కాల నిషేధం విధించారు. భారీ జ‌రిమానా నోటీసులు కూడా ఇచ్చారు.

Tags:    
  • ceoscandals 
  • jeffbezos 
  • elonmusk 
  • corporatecontroversies 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS