ఆ దూకుడే బుద్ధాకు ఎస‌రు పెట్టిందా ..!

మ‌రీ ముఖ్యంగా.. పార్టీలో త‌న వాయిస్ వినిపించేందుకు వేరే వారిని తొక్కేశార‌న్న వాద‌న వినిపిస్తుండ‌డం చాలా ఇబ్బందిక‌రంగా మారింది.;

Update: 2025-05-14 19:30 GMT

దూకుడు మంచిదే.. కానీ, అన‌వస‌ర‌పు హంగామా.. అన‌వ‌స‌ర‌మైన రాజ‌కీయాలు ఎవ‌రికీమంచి చేయ‌వు. ఇ ప్పుడు ఈ విష‌యాలే.. విజ‌య‌వాడ‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ.. బుద్ధా వెంక‌న్న విష‌యంలో వినిపిస్తు న్నా యి. పార్టీకి వీర విధేయుడిన‌ని ప్ర‌క‌టించుకునే బుద్ధా.. నిజంగానే వీరవిధేయుడే. ఈ విష‌యంలో ఎవ‌రికీ సందేహం లేదు. అయితే.. అతి చేయ‌డ‌మే స‌మస్య‌. బుద్ధా విష‌యంలో ఇదే జ‌రిగింది. ఆయ‌న అతి స్పంద‌నే ఇబ్బంది పెడుతోంది. చంద్ర‌బాబు విష‌యంలో మ‌రీ జోరుగా ఆయ‌న స్పందించారు.

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ర‌క్త త‌ర్ప‌ణం పేరుతో హంగామా చేశారు. ఎన్నిక‌ల్లో టికెట్ ఇవ్వాల్సిందేన‌ని ప‌ట్టు బట్టారు. కానీ.. ద‌క్క‌లేదు. అంతేకాదు.. క‌నీసం ఇప్ప‌టి వ‌ర‌కు నారా లోకేష్ అప్పాయింట్‌మెంటు కూడా ఇవ్వ‌లేద‌ని బుద్ధా వ‌ర్గ‌మే చెబుతోంది. అదేస‌మ‌యంలో విజ‌య‌వాడ ప‌శ్చిమ టికెట్‌ను బీజేపీకి కేటాయించిన‌ప్పుడు స‌హక‌రించాల‌ని పార్టీ అధిష్టానం చెప్పింది. కానీ, బుద్ధా వెంక‌న్న ఓ చెవితో విని మ‌రో చెవితో వ‌దిలేశారు. ఇది కూడా మైన‌స్ అయిపోయింది.

మ‌రీ ముఖ్యంగా.. పార్టీలో త‌న వాయిస్ వినిపించేందుకు వేరే వారిని తొక్కేశార‌న్న వాద‌న వినిపిస్తుండ‌డం చాలా ఇబ్బందిక‌రంగా మారింది. దీనిపై పార్టీ అధినేత వ‌ర‌కు ఫిర్యాదులు అందాయ‌ని తెలిసింది. అయితే.. దీనిలో నిజం ఏంట‌నేది చూడాలి. ఇలా బుద్ధా దూకుడుగా వ్య‌వ‌హ‌రించిన కార‌ణంగానే.. ఆయ‌న‌కు పార్టీలో గుర్తింపు నానాటికీ త‌గ్గుతోంద‌న్న‌ది అనుచ‌రులు చెబుతున్నారు. వాస్త‌వానికి నామినేటెడ్ ప‌ద‌వులు భ‌ర్తీ చేస్తున్నా.. ఎమ్మెల్సీ ఎన్నిక‌లు వ‌స్తున్నా బుద్ధా పేరు వినిపించ‌డం లేదు.

నిజానికి బుద్దా దూకుడుకు.. ఇప్ప‌టికే పార్టీ వ‌చ్చిన తొలినాళ్ల‌లోనే ఆయ‌న‌కు నామినేటెడ్ ప‌ద‌వి ద‌క్కి ఉండాలి. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు. అంటే.. ఆయ‌న‌పై అధిష్టానం ద‌గ్గ‌ర ఏత‌ర హా మార్కులు ఉన్నాయో అర్ధం చేసుకోవ‌చ్చు. ఇక‌, ఇప్ప‌టికైనా బుద్దా దూకుడులో మార్పు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నాయ‌కులు చెబుతున్నారు. దూకుడు మంచిదే అయినా.. దానిలోనూ కొన్ని ప‌ద్ద‌తులు ఉంటాయి. వాటి ప్ర‌కారం ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తేనే బెట‌ర్ అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News