• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కాంగ్రెస్ గూటికి మరో...

కాంగ్రెస్ గూటికి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే

| ఒకరు తర్వాత మరొకరు అన్నట్లుగా తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి విపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు చేరుతున్నారు.

By - Tupaki Desk
Update: 2024-04-08 06:24 GMT

ఒకరు తర్వాత మరొకరు అన్నట్లుగా తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి విపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు చేరుతున్నారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరటం తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంట్రావు ఆదివారం సీఎం రేవంత్ సమక్షంలో అధికార పార్టీలో చేరారు.

ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ నివాసానికి తెల్లం చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య.. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు ఖమ్మం జిల్లా నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా తెల్లం గెలుపొందినా కారు పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొంటున్నది లేదు.

అధికారికంగా కాంగ్రెస్ లోకి చేరకున్నా.. ఆ పార్టీకి చెందిన కార్యక్రమాల్లో అనధికారికంగా పాల్గొంటున్నారు. చివరకు శనివారం తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జనజాతర సభకు హాజరై.. వేదిక మీద కూర్చున్నారు. కాంగ్రెస్ లో చేరతారన్నప్రచారం జరిగినప్పటికీ ఆయన ఆ పని మాత్రం చేయలేదు. తాజాగా ఆ కొరత తీరుస్తూ ముఖ్యమంత్రి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవటం ద్వారా అధికారికంగా కాంగ్రెస్ లోకి చేరినట్లైంది. దీంతో.. బీఆర్ఎస్ కు చెందిన మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి చేరినట్లైంది. దీంతో అధికారికంగా గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన మూడో ఎమ్మెల్యేగా తెల్లం నిలిచారు.

Tags:    
  • Brs 
  • Tellamvenkatrao 
  • Congress 
  • Revanthreddy 
  • Loksabhaelections 
  • Kcr 
  • Ktr 
  • Harishrao 
  • Bjp 
  • Bhadrachalammla 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS