• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నాగర్ కర్నూల్ నుంచి...

నాగర్ కర్నూల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి ఆయనే..

| చివరకు ఆయన బీఆర్ఎస్ తరపునే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-03-16 11:00 GMT

లోక్ సభ ఎన్నికల ముంద తెలంగాణలో అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయ్యారు. ఆమెను ఢిల్లీలో కోర్టులో హాజరుపరిచారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులు ఒక్కొక్కరుగా వెళ్లిపోతుండగా, అనూహ్యంగా ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన మరీ ఆయన కారు పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రవీణ్ కుమార్ భావజాలానికి బీఆర్ఎస్ లో మనగలగడం సాధ్యమా? అనేది పక్కనపెడితే.. తెలంగాణలో తమకు వ్యతిరేకంగా జరుగుతున్న ఎన్నో పరిణామాల మధ్య బీఆర్ఎస్ కు ఇదొక ఊరట.

సీట్ల కేటాయింపుపై మాయావతి గుర్రు

కేసీఆర్ రెండు సీట్లే ఇస్తామనడం, అందులో ఒకటి ఎంఐఎంకు తప్ప ఏ పార్టీకీ గెలుపు అవకాశాలు లేని హైదరాబాద్ కావడంతో మాయవతి సంతృప్తి చెందలేదని అందుకే పొత్తు వద్దన్నారని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో అసంతృప్తికి గురైనందునే ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి గుడ్ బై చెప్పినట్లు స్పష్టమవుతోంది. చివరకు ఆయన బీఆర్ఎస్ తరపునే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

పోటీ అక్కడినుంచేనా?

బీఆర్ఎస్ లో చేరే ఉద్దేశంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ తో ప్రవీణ్ కుమార్ సమావేశం అయ్యారు. కాగా, ఆయన నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇతర పార్టీలతో పొత్తులు వద్దనడంతోనే ప్రవీణ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో సిర్పూర్ జనరల్ సీటు నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేసి ఓడిన ప్రవీణ్ కుమార్.. లోక్ సభ ఎన్నికలకు మాత్రం బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి హోదాలో నిర్ణయించారు. ఈ మేరకు కేసీఆర్ తో సంప్రదింపులు జరిపారు. అయితే, మాయావతి మాత్రం లోక్ సభ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు ఉండవని తేల్చి చెప్పారు. అప్పటికీ బీఆర్ఎస్ అటు ఎన్డీఏ, ఇటు యూపీఏ కూటమిలో లేనందున పొత్తులు పెట్టుకునేలా ఒప్పించారు. ఈ మేరకు లక్నో నుంచి బీఎస్పీ ప్రతినిధి వచ్చి కేసీఆర్ తో చర్చించారు. దీంతోనే హైదరాబాద్, నాగర్ కర్నూల్ ఎంపీ స్థానాలను బీఎస్పీకి ఇచ్చారు.

Tags:    
  • Loksabhaelections 
  • Congressparty 
  • Brsparty 
  • Bjp 
  • Bsp 
  • Kcr 
  • Kavitha 
  • Delhi 
  • RsPraveenkumar 

Similar News

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

పవన్ పిఠాపురంలో రెబెల్స్ కొత్త రికార్డు !

2026-11-03 18:23 GMT

తమిళనాడుకు ప్రత్యేక జెండా ...ఏం జరుగుతోంది ?

2026-11-03 18:16 GMT

బాబుతో విజయ్ డీకే రేవంత్ : దక్షిణాదిన కొత్త ఐక్యత !

2026-11-03 18:15 GMT

ఒక్క ఓటుతో విజేత‌లు.. ఎన్నెన్నో విచిత్రాలు!

2026-11-03 18:13 GMT

బంగ్లా బార్డర్ లో భారత జవాన్లపై దాడి చేస్తే.. ట్రీట్ మెంట్ వేరేలా ఉంటుంది.. అదే జరిగింది..

2026-11-03 18:09 GMT

ఢిల్లీ హోటల్ గొడవపై స్పందించిన మంత్రి దామోదర.. అసలేం జరిగింది?

2026-11-03 18:06 GMT

వైసీపీని 'ఓటు' బ్యాంకు కాపాడిందా?!

2026-11-03 17:30 GMT

కోయ ప్రవీణ్...వైసీపీకి ఆయన కఠినం కానీ !

2026-11-03 17:00 GMT

పెళ్లి కోసం 7 వేల మంది క్యూ.. ఇంత కరువులో ఉన్నారేంట్రా సామీ

2026-11-03 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS