ఉండవల్లితో బ్రదర్ అనిల్ భేటీ.. ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా?

తన కొడుకు ఎంగేజ్ మెంట్ కు.. పెళ్లికి రావాలంటూ శుభలేఖను ఇచ్చి ఆహ్వానించారు.

Update: 2024-01-13 05:29 GMT

కొడుకు పెళ్లి వేళ.. శుభలేఖల్ని పంచే హడావుడిలో ఉన్నారు వైఎస్ షర్మిల దంపతులు. కొడుకు రాజారెడ్డి ఎంగేజ్ మెంట్ జనవరి 18న.. పెళ్లి ఫిబ్రవరి 17న జరుగుతున్న సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి శుఖలేఖల్ని పంచే విషయంలో షర్మిల.. ఆమె భర్త బ్రదర్ అనిల్ వ్యవహరిస్తున్న తీరు ఆసక్తికరంగా ఉండటమే కాదు.. వారి వరుస భేటీలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంటికి వెళ్లారు బ్రదర్ అనిల్.


తన కొడుకు ఎంగేజ్ మెంట్ కు.. పెళ్లికి రావాలంటూ శుభలేఖను ఇచ్చి ఆహ్వానించారు. రాజమండ్రిలో ఈ ఇద్దరి భేటీ ఆసక్తికరంగా మారినట్లుగా చెబుతున్నారు. శుభలేఖలు ఇచ్చే క్రమంలో రాష్ట్ర రాజకీయాల మీదా వారిద్దరి చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని ఉండవల్లిని కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది. దివంగత వైఎస్ కు అత్యంత సన్నిహితుడు.. నమ్మకస్తుడైన ఉండవల్లి.. వైఎస్ కుటుంబానికి చాలా దగ్గరన్న విషయం తెలిసిందే.

Read more!

అయితే.. తాను పెళ్లి శుభలేఖను ఇవ్వటానికి వచ్చానే తప్పించి.. రాజకీయాల గురించి మాట్లాడటానికి రాలేదని బ్రదర్ అనిల్ కుమార్ స్పష్టం చేస్తున్నారు. తానురాజకీయాలకు దూరంగా ఉన్నానని.. ఏసుప్రభు గురించి చెప్పటానికి మాత్రమే తాను ఉన్నట్లుగా చెప్పిన ఆయన.. రాజకీయాల గురించి తాను మాట్లాడనని పేర్కొన్నారు. మరోవైపు.. ఉండవల్లి సైతం మీడియాతో మాట్లాడుతూ..తన మీద గౌరవంతోనే బ్రదర్ అనిల్ తన ఇంటికి వచ్చారన్నారు. తనను కాంగ్రెస్ లోకి తీసుకునే అవకాశం లేదని.. ఎందుకుంటే తాను రాజకీయాల నుంచి రిటైర్ అయిన విషయాన్ని ఆయన స్పష్టం చేయటం ద్వారా.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసినట్లుగా చెబుతున్నారు.

Tags:    

Similar News