• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ట్రెండింగ్... టర్కీపై...

ట్రెండింగ్... టర్కీపై బాయ్ కాట్ తుపాకులు!

| ఈ సమయంలో బాయ్ కాట్ టర్కీ, బాయ్ కాట్ టర్కీష్ ఎయిర్ లైన్స్ హ్యాష్ ట్యాగ్ లు సందడి చేస్తున్నాయి.

By - Tupaki Desk
Update: 2025-05-09 18:30 GMT

నీ స్నేహితుడు ఎవరో చెప్పు.. నీ గురించి నేను చెబుతాను అనేది చాలా అర్ధవంతమైన ఓ మంచి వాక్యం! ప్రస్తుతం భారత్ - పాక్ మధ్య పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తమైన వేళ టర్కీకిని చూసి టూరిస్ట్ కంపెనీలు ఇదే మాట చెబుతున్నాయనే చర్చ సోషల్ మీడియా వేదికగా నడుస్తుంది. ఈ నేపథ్యలోనే బాయ్ కాట్ టర్కీ అనేది ట్రెండింగ్ లో కొనసాగుతోంది!

అవును... పహల్గాం ఉగ్రదాడి అనంతరం ప్రపంచ దేశాలు భారత్ కు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. ఆపరేషన్ సిందూర్ కు ఇజ్రాయెల్ లాంటి దేశాలు మద్దతు పలికాయి. మరికొన్ని మౌనంగా ఉన్నాయి. అయితే... ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ కు మద్దతుగా టర్కీ మాత్రం తన వాయిస్ ని వినిపించింది.

ఈ నేపథ్యంలో టర్నీ తీరుపై భారతీయులతో పాటు ఉగ్రవాద వ్యతిరేక ప్రజానికం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సమయంలో టర్కీష్ ఎయిర్ లైన్స్ తో పాటు ఆ దేశంలో ఉన్న అన్ని బంధాలను తెంచుకోవాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో బాయ్ కాట్ టర్కీ, బాయ్ కాట్ టర్కీష్ ఎయిర్ లైన్స్ హ్యాష్ ట్యాగ్ లు సందడి చేస్తున్నాయి.

ఇదే సమయమంలో పలు టూరిస్ట్, ట్రావెల్ కంపెనీలు టర్కీష్ సంస్థలతో ఉన్న సంబంధాలను తెంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టర్కీ పర్యాటక, టర్కీ ఎయిర్ లైన్స్ కోసం మనం ఖర్చు చేసే ప్రతి రూపాయి మన జాతి ప్రయోజనలకు వ్యతిరేకంగా నిలబడే వారికి మద్దతు ఇస్తుందని.. అందుకే ఈ బాయ్ కాట్ టర్కీ ఉద్యమం అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన గోవా విల్లాస్ సంస్థ... భారత్ - పాక్ మధ్య ఉన్న పరిస్థితుల్లో టర్కీ అనుసరిస్తున్న భారత వ్యతిరేక వైఖరి కారణంగా.. గోవాలో టర్కీష్ పౌరులకు ఎలాంటి వసతి సేవలను అందించకూడదని తాము నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. తాము ఎప్పుడూ మా దేశానికి అండగా నిలబడతామని తెలిపింది.

మరోవైపు గో హోమ్మ్ స్టేస్ సంస్థ స్పందిస్తూ... టర్కీష్ ఎయిర్ లైన్స్ తో తన భాగస్వామ్యాన్ని ముగించినట్లు ప్రకటించింది. భారత్ పట్ల వ్యతిరేక వైఖరిని కలిగి ఉన్నందున... ఇకపై వారి విమానాలను మా అంతర్జాతీయ ప్రయాణ ప్యాకేజీలలో చేర్చమని వెల్లడించింది.

Tags:    
  • BoycottTurkey 
  • BoycottTurkishAirlines 
  • IndiaFirst 
  • StandWithIndia 
  • OperationSindoor 
  • TurkishBan 
  • NationalSecurity 
  • TravelBan 
  • SupportIndia 
  • Geopolitics 

Similar News

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS