• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బొత్స కోటలో చిన్న శ్రీను...

బొత్స కోటలో చిన్న శ్రీను మార్చిన సీన్

| విజయనగరం జిల్లా రాజకీయాల్లో బొత్స సత్యనారాయణకు తాజా పరిషత్ ఎన్నికలు షాక్ ఇచ్చాయి. బొత్స కుమార్తె అనూష బొండపల్లి జడ్పీటీసీగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పాశల నీరజ చేతిలో 5,136 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరోవైపు, బొత్స మేనల్లుడు చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర తెర్లాం జడ్పీటీసీగా 6,651 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఈ ఫలితాలు జిల్లా రాజకీయాల్లో బొత్స ఆధిపత్యానికి సవాలుగా మారాయి.

By - Satya P
Update: 2026-11-08 03:00 GMT

విజయనగరం జిల్లా రాజకీయాలలో తనకంటూ ఒక బలమైన కోటను బొత్స సత్యనారాయణ నిర్మించుకున్నారు. ఆయన అక్కడ డీసీసీబీ చైర్మన్ గా తన ప్రస్థానం మొదలెట్టి ఎంపీగా తొలిసారి బొబ్బిలి నుంచి గెలిచారు. అలా మొదలైన ప్రజా ప్రాతినిధ్య ప్రస్థానంలో బొత్స తన వర్గాన్ని బలంగా తయారు చేసుకున్నారు. అందులో సొంత మేనల్లుడు చిన్న శ్రీను కీలకం. ఆయన బొత్సకు కుడి భుజం అని అంటారు. ఆయన మాట అంటే బొత్స చెప్పినట్లే. అంతలా జిల్లాను మేనల్లుడు తో కలిసి శాసించిన బొత్స తన మొత్తం రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కోని అత్యంత సంక్లిష్టమైన పరిస్థితులు ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు.

కుమార్తె ఓటమి :

బొత్స రాజకీయ వారసురాలిగా జెడ్పీ పీఠం మీద కూర్చోబెట్టాలనుకున్న కుమార్తె బొత్స అనూష తాజా ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. ఆమె పోటీ చేసిన గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గంలోని బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి పాశల నీరజ ఘన విజయం సాధించారు. బొత్స అనూష మీద ఏకంగా 5,136 మెజారిటీతో నీరజ గెలవడం విశేషం. దీంతో బొత్సకు ఇది జీర్ణించుకోలేని పరాజయం అయింది అని అంటున్నారు. బొత్స అనూష మీద ఎన్నో ఆశలు బొత్స పెట్టుకున్నారు. ఆమె కోసమే జెడ్పీ పీఠం అనుకున్నారు. కానీ చూస్తే మొత్తం సీన్ రివర్స్ అయింది.

ఆమె వల్లనే కదా :

నిజానికి బొత్స క్యాంప్ నుంచి చిన్న శ్రీను విడిపోవడానికి కారణం తన వారసురాలిగా కుమార్తెని పెట్టాలనుకోవడమే. చిన్న శ్రీను కూడా జెడ్పీ పీఠం మీద కన్ను వేశారు అని తెలిసి కూడా బొత్స ఆయనతో చెప్పి ఒప్పించకుండా ఏకపక్షంగా కుమార్తె పేరుని ప్రకటించారు అని అంటారు. అందుకే ఆగ్రహించిన చిన్న శ్రీను తన భవిష్యత్తు కోసం తన కుమార్తె సిరి సహస్ర భవిష్యత్తు కోసం పార్టీ మారారు అని అంటున్నారు. దాంతో ఇపుడు జనం వద్దకే ఇద్దరూ వెళ్లి తేల్చుకున్నారు. బొత్సకు మేనల్లుడికి మధ్య వివాదానికి కారణం అయిన బొత్స అనూష ఓటమితో చిన్న శ్రీను పై చేయి సాధించినట్లు అయింది అని అంటున్నారు.

సిరి సహస్ర బంపర్ విక్టరీ :

ఇక చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర బంపర్ విక్టరీ కొట్టింది.అ ఆమె బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం తెర్లాంలోని జెడ్పీటీసీకి పోటీ చేసి భారీ మెజారిటీ దక్కించుకున్నారు. ఆమె తన సమీప వైసీపీ అభ్యర్థిపై 6,651 ఓట్ల భారీ మెజారిటీతో బంపర్ విక్టరీ కొట్టారు. ఇక ఎన్నికల నామినేషన్ల సమయంలో కుల ధ్రువీకరణ పత్రాల విషయంలో వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసి వివాదాలు సృష్టించినప్పటికీ, వాటన్నింటినీ పక్కనబెట్టి తెర్లాం ఓటర్లు సిరి సహస్రకు భారీ విజయాన్ని అందించారు. ఈ విజయంతో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం రేసులో ఆమె మరింత ముందంజలో నిలిచారు.

కోటలు బీరలు వారినట్లే :

తన కుమార్తె సిరి సహస్త్రను గెలిపించుకుని బొత్స కుమార్తెని ఓడించడం ద్వారా బొత్స మీద చిన్న శ్రీను విజయం సాధించారు అని అంటున్నారు. ఇక జిల్లా రాజకీయాల్లో ఇప్పటిదాకా చూస్తే బొత్స హవా నడిచింది. ఇక మీదట చిన్న శ్రీను ప్రాభవం స్టార్ట్ అయింది అని అంటున్నారు. చిన్న శ్రీను వైసీపీ నుంచి వెళ్ళిపోయినా తమకు నష్టం వాటిల్లలేదని ఎన్నో చెప్పారు వైసీపీ నేతలు. కానీ అవన్నీ తప్పు అన్నది తాజా ఫలితాలు నిరూపించాయి. మొత్తానికి పెద్దాయన బొత్స కోటలకు బీటలు వారిపోతున్న నేపధ్యాన్ని పరిషత్తు ఎన్నికలు రుజువు చేశాయని అంటున్నారు.

Tags:    
  • botsa satyanarayana 
  • chinnasrinu 
  • vijayanagaram 
  • botsaanusha 
  • sirisahasra 
  • zptcelections 

Similar News

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

Copyright @2026

Powered by Blink CMS