• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పాక్ విషయంలో భారత్ కు...

పాక్ విషయంలో భారత్ కు బలోచిస్తాన్ కీలక సూచన!

| ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ – పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-05-12 06:30 GMT

ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ – పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) స్పందించింది. ఈ సందర్భంగా భారత్ కు కీలక సూచన చేసింది. తాజా నిర్ణయం వెనుక పాక్ ఉద్దేశం ఇదేనని వెల్లడించింది!

అవును... భారత్ - పాక్ మధ్య కాల్పుల విరమణ కుదిరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పందించిన బీఏల్ఏ.. పాకిస్థాన్ ఊసరవెల్లి అని, దాని మాటలు నమ్మొద్దని.. పాక్ వినిపించే శాంతి, సోదరభావం, కాల్పుల విరమణ వంటి ప్రవచానాలన్నీ కేవలం మోసాలని.. అవి యుద్ధ వ్యూహాలని.. పాకిస్థాన్ తో అప్రమత్తంగా ఉండాలని చెప్పింది.

ఇదే సమయంలో విదేశీ మద్దతు ఉన్న సంస్థగా, పోరాటంగా చూస్తూ వారిపై వస్తోన్న విమర్శలపైనా బీఏల్ఏ స్పందించింది. ఇందులో భాగంగా.. తాము కీలుబొమ్మలం కాదని, రిమోట్ తో తమను ఆడించలేరని.. ఈ ప్రాంతానికి సంబంధించి అన్ని విషయాల్లోనూ తమకు సరైన స్థానం ఉందని తెలిపింది. తమది డైనమిక్ పార్టీ అని చెప్పుకుంది.

కాగా... భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతోన్న తరుణంలో బలోచిస్థాన్ ప్రావిన్స్ లోని కాలత్ జిల్లా మంగోచర్ పట్టణాన్ని తాము స్వాధీనం చేసుకున్నట్లు బీఏల్ఏ శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం కూడా వీరి దాడిలో పాక్ సైనికులు 22 మంది మరణించినట్లు వార్తలొచ్చాయి.

వాస్తవానికి ప్రత్యేక దేశంగా ఏర్పడాలని పాకిస్థాన్ లోని బలోచిస్థాన్ ప్రావిన్స్ లోని ప్రజలు కొన్ని దశాబ్ధాలుగా పోరాడుతున్నారు. ఇక్కడ బొగ్గు, బంగారం, చమురు, రాగి, సహజ వాయు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. ఫలితంగా... పాక్ ఖజానా నిండుతోంది. అయితే... ఇక్కడ వ్యవసాయానికి ఆమోదయోగ్యత తక్కువ. కారణం.. ఇక్కడ కఠినమైన ఎడారి ఉంటుంది.

దీంతో.. పేదరికం పెరిగింది.. జనాభా తక్కువైపోయింది.. అభివృద్ధికి దూరమైపోయింది.. ఈ నేపథ్యంలోనే రాజకీయ అనిశ్చితి నెలకొని, వేర్పాటువాదులు శక్తిమంతులయ్యారు. ఇప్పుడు పాక్ ను వణికిస్తున్నారు.

Tags:    
  • OperationSindoor 
  • IndiaPakistanTensions 
  • BalochLiberationArmy 
  • BLAStatement 
  • PakistanCeasefire 
  • BalochistanCrisis 
  • GeoPolitics 
  • BLAvsPakistan 
  • SouthAsiaNews 
  • MilitaryConflict 

Similar News

వైసీపీని 'ఓటు' బ్యాంకు కాపాడిందా?!

2026-11-03 17:30 GMT

కోయ ప్రవీణ్...వైసీపీకి ఆయన కఠినం కానీ !

2026-11-03 17:00 GMT

పెళ్లి కోసం 7 వేల మంది క్యూ.. ఇంత కరువులో ఉన్నారేంట్రా సామీ

2026-11-03 16:30 GMT

మీరు గెలిచినా, ఓడినా ఎవరికీ పట్టదు.. వైరల్ అవుతున్న బిజినెస్‌మ్యాన్ ట్వీట్!

2026-11-03 15:30 GMT

తిండి క‌ల్తీ.. నెయ్యి క‌ల్తీ.. స‌మాజం క‌ల్తీ.. లైసెన్సులు ర‌ద్దు చేస్తున్న FDA

2026-11-03 14:30 GMT

వాసిరెడ్డి ప‌ద్మ వార‌సురాలి విజ‌యం!

2026-11-03 12:30 GMT

అదృష్టం తలుపుతట్టింది.. వైసీపీ అభ్యర్థికి లాటరీలో విజయం దక్కింది..

2026-11-03 12:22 GMT

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

2026-11-03 11:30 GMT

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

Copyright @2026

Powered by Blink CMS