పొత్తు తేల్చేసిన పవన్... బీజేపీ ఫస్ట్ రియాక్షన్!

టీడీపీ - జనసేన పొత్తు కన్ ఫాం అని ప్రకటించారు. ఈ విషయంపై తాజాగా ఏపీ బీజేపీ స్పందించింది.;

Update: 2023-09-14 13:40 GMT

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాన్ కలిసారు. సుమారు 40 నిమిషాల ములాకత్ అనంతరం బయటకు వచ్చిన పవన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. టీడీపీ - జనసేన పొత్తు కన్ ఫాం అని ప్రకటించారు. ఈ విషయంపై తాజాగా ఏపీ బీజేపీ స్పందించింది.

అవును... ఎన్నికలు మరో ఆరునెలల తర్వాత జరిగినా, రేపే జరిగినా టీడీపీ - జనసేన కలిసే పోటీచేస్తాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అయితే తాను ప్రస్తుతానికి బీజేపీతో పొత్తులో ఉన్నాయని.. అయితే వారు కూడా తమతో కలిసి వచ్చే విషయం ఆలోచించుకోవాలన్నట్లుగా పవన్ స్పందించారు. దీంతో తాజాగా ఈ విషయంపై ఏపీ బీజేపీ స్పందించింది. ఇన్ని రోజులూ చెప్పిందే చెప్పింది!

బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వెళ్లాలని తన కోరిక అని పవన్ గతంలో ఎన్నోసార్లు చెప్పిన నేపథ్యంలో... మరోసారి అదే ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ, బీజేపీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. దీంతో... పవన్‌ కల్యాణ్‌ ప్రకటన తర్వాత.. టీడీపీ - జనసేనతో బీజేపీ కలిసి వస్తుందా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో బీజేపీ స్పందించింది.

ఇందులో భాగంగా... ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌ లో జనసేన పార్టీతో బీజేపీ పొత్తు కొనసాగుతోందని ఏపీ బీజేపీ చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని గతంలోనే పవన్ కల్యాణ్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. కానీ, పొత్తుల అంశం మాత్రం బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందని స్పష్టం చేసింది.

ఇదే సమయంలో... రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేదానిపై కేంద్ర నాయకత్వం స్పష్టత ఇస్తుందని పేర్కొన్న ఏపీ బీజేపీ... పొత్తులను ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నిర్ణయిస్తారని మరోసారి చెప్పుకొచ్చింది ఏపీ బీజేపీ!

మరోవైపు క‌డ‌ప‌లో మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, జ‌న‌సేన‌తో క‌లిసే బీజేపీ పోటీ చేస్తుంద‌ని అన్నారు. ప్రధాని మోడీతో ప‌వ‌న్‌ క‌ల్యాణ్ అన్ని మాట్లాడుకునే పొత్తుపై ప్రక‌ట‌న చేశార‌ని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల‌నివ్వకూడ‌ద‌ని ప‌వ‌న్‌ క‌ల్యాణ్ బీజేపీ పెద్దల‌కు చెప్పార‌ని అన్నారు. ఇదే సమయంలో... ప‌వ‌న్ ఆలోచ‌న స‌రైంద‌ని మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి కితాబిచ్చారు.

Tags:    

Similar News