ప్రపంచంలో అతిపెద్ద పార్టీ బీజేపీనే.. అసలు ఆ పార్టీ చరిత్ర ఏంటి..?
భారతీయ జనతా పార్టీ గుర్తు లాగానే చరిత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏర్పాటు చేసిన భారతీయ జనసంఘ్ నుంచి ఏర్పాటైంది.;
‘అంధేరా ఛేటేగా.. సూరజ్ నిఖిలేగా.. కమల్ ఖీలేగా (సూర్యుడు ఉదయిస్తాడు.. చీకట్లు తొలగిపోతాయి.. మళ్లీ కమలం కాంతులతో విరబూస్తుంది) మాజీ ప్రధాని అటల్ బిహారీ చెప్పిన ఈ కవిత వినని నాయకుడు ఉన్నాడంటే ఆశ్చర్యమే. భారతదేశంలో అటల్ జీని మరిచిపోతే నాయకత్వ లక్షణాలు లేవని ఖచ్చితంగా చెప్పవచ్చు అంటూ గొప్ప గొప్ప నాయకులు ఆయన కీర్తి గురించి శ్లాఘించారు. ఆయన దేశం, తర్వాత పార్టీ గురించి మాత్రమే ఆలోచించే నేత. అందుకే ఆయనకు భార్య, పిల్లలు కూడా లేరు. నేటితరం నేతలను ఎంతో మందిని తయారు చేసిన ఘనత ఆయన సొంతం. ప్రత్యర్థి పార్టీ నేతలు కూడా ఆయన గురించి కీర్తించక తప్పదు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఉన్నంత కాలం ఆయన పేరు గుర్తుంటుంది.
పార్టీ ఆవిర్భావం ఇలా..
భారతీయ జనతా పార్టీ గుర్తు లాగానే చరిత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏర్పాటు చేసిన భారతీయ జనసంఘ్ నుంచి ఏర్పాటైంది. భారతీయ జనతా పార్టీ 1980, ఏప్రిల్ 6వ తేదీన ఏర్పాటైంది. జనసంఘ్ నుంచి కొందరు నాయకులు బీజేపీని ఏర్పాటు చేశారు. పార్టీ గుర్తుగా కమలం పువ్వును ఎంచుకున్నారు. ఒక సమయంలో బీజేపీ తక్కువ సీట్లతో నిలదొక్కుకోలేకపోయింది. ఆ తర్వాత కేవలం మిత్రపక్షంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి మాత్రమే వచ్చింది. ఆ తర్వాత ఒక శక్తిగా అవతరించింది.
కష్టాల్లో నుంచి ప్రపంచ గుర్తింపు వరకు..
వాజ్‌పేయి కాలం తర్వాత బీజేపీ చాలా కష్టాలు ఎదుర్కొంది. సరైన నాయకుడు లేక పార్టీ పాతాళానికి పడిపోయింది. ఆ సమయంలోనే పార్టీని నిలబెట్టేందుకు అమిత్ షా లాంటి దిగ్గజ నేతలు పగ్గాలు చేపట్టారు. ఆయనకు తోడు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, నేటి ప్రధాని మోడీ అండగా నిలవడంతో చాణక్య చతురతతో పార్టీని రేసుగుర్రంగా ముందుకు నడిపారు. 2014లో దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ఎన్నికైన తర్వాత పార్టీ వేగంగా విస్తరించింది. బీజేపీతోనే దేశానికి భద్రత అంటూ ఆ పార్టీ ప్రచారం కలిసి వచ్చింది.
నేడు ప్రపంచంలో అతిపెద్ద పార్టీ..
నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ ఎదిగింది. ప్రపంచంలో ఎక్కువ మంది జనాభా ఉన్న భారతదేశంలో ఉన్న వందకు పైగా పార్టీల్లో బీజేపీ మాత్రమే ప్రపంచ స్థాయిలో గొప్పదిగా నిలిచింది. భారతీయ జనతా పార్టీ లో ప్రస్తుతం 14 కోట్ల మంది సభ్యులు ఉన్నారని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు. 20కి పైగా రాష్ట్రాలు, దేశ వ్యాప్తంగా 2 కోట్ల మంది క్రియాశీల సభ్యులు ఉన్నారని చెప్పారు. ఇక ప్రభుత్వం విషయానికి వస్తే.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వాయ్య దేశమైన భారత్ ను మూడో సారి పాలిస్తుంది. 240 మందికి పార్లమెంట్ సభ్యులు, 1500 మంది శాసన సభ సభ్యులు, 170 మంది శాసన మండలి సభ్యులు పార్టీకి చెందిన వారు ఉన్నారు.
మోడీ విధానాల వల్ల మరింత గుర్తింపు..
మూడు టర్మ్ లు దేశాన్ని పాలించిన బీజేపీకి 11 సంవత్సరాల నుంచి సభ్యులు పెరుగుతూ వస్తున్నట్లు నడ్డా చెప్పారు. జమ్ము-కశ్మీర్ లో 370 ఆర్టికల్ తొలగింపు నుంచి మోడీ ప్రభుత్వంపై విశ్వాసం బలపడిందని, ముఖ్యంగా యంగ్ జనరేషన్ బీజేపీ వైపునకు వస్తున్నట్లు నడ్డా చెప్పారు. రామ మందిరం, వక్ఫ్ చట్టంలో సవరణలు, ట్రిపుల్ తలాక్, నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ రూపకల్పన లాంటి పెద్ద పెద్ద సమస్యలు కేవలం బీజేపీతో మాత్రమే నెరవేరడంతో యూత్ లో మంచి భావన పెరిగిందని చెప్పారు.