మోడీ వెళ్ళేది అందుకే ...బీజేపీ కాంగ్రెస్ ల మధ్య డైలాగ్ వార్

దేశంలో మోడీ ప్రధానిగా గత పదకొండేళ్లుగా పాలన సాగిస్తున్నారు. ఆయన మూడు సార్లు ఈ దేశానికి వరసగా నాయకత్వం వహిస్తున్నారు.;

Update: 2025-12-11 04:30 GMT

దేశంలో మోడీ ప్రధానిగా గత పదకొండేళ్లుగా పాలన సాగిస్తున్నారు. ఆయన మూడు సార్లు ఈ దేశానికి వరసగా నాయకత్వం వహిస్తున్నారు. ఇక మోడీ గురించి చెప్పుకోవాలంటే ఎక్కువగా ఆయన తన హయాంలో విదేశీ పర్యటనలు చేపట్టారు. ఇప్పటికీ ఆయన విదేశీ టూర్లు ఉంటున్నాయి. ఈ దేశంలో మరే ప్రధాని చేపట్టని విధంగా మోడీ విదేశీ పర్యటనకు ఉన్నాయన్నది అంతా అంటారు. అయితే ఇదే విషయం మీద కాంగ్రెస్ మోడీని గట్టిగానే టార్గెట్ చేస్తోంది. మోడీ విదేశీ పర్యటనలు ఎక్కువగా చేస్తారు అంటూ సెటైర్లు వేసింది. అయితే దానికి బీజేపీ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

మోడీ విదేశీ టూర్లు. :

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు సంబంధించి కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను బిజెపి తీవ్రంగా విమర్శించింది. మోడీ పర్యటనకు దేశం కోసం ఉంటాయని ఆయన దేశ హితం కోసమే విదేశీ పర్యటనలు పెట్టుకుంటారు అని బిజెపి అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది స్పష్టం చేశారు. అంత కాదు కాంగ్రెస్ పార్టీ మోడీ మీద చేసిన వ్యాఖ్యలను అంతా ఖండించాల్సిందే అని అంటున్నారు. నరేంద్ర మోడీ ప్రధాని హోదాలో అధికారిక పర్యటనలు చేస్తున్నారు అని ఆయన అన్నారు. ఇక దేశం పని కోసం మోడీ విదేశాలకు వెళతారని అన్నారు.

రాహుల్ దేనికో :

అదే సమయంలో బీజేపీ అసలు ఊరుకోలేదు. కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ ప్రతి పార్లమెంట్ సమావేశం తర్వాత విదేశాలకు ఎందుకు వెళ్తున్నారు అని సుధాంశు త్రివేది నిలదీశారు. రాహుల్ తన సెలవుల కోసం విదేశాలకు వెళతారని ఆయన ఎద్దేవా చేశారు. అలా రాహుల్ గాంధీ విలాసాల కోసం విదేశాలకు వెళ్తున్నారు అని మోడీ దేశ హితం కోసం టూర్లు వేస్తున్నారు అని బీజేపీ తేడా చూపించి మరీ వివరించే ప్రయత్నం చేసింది అన్న మాట.

తేడా తెలుసుకోండి :

మోడీని విమర్శించే ముందు దేశంలో ఏమి జరుగుతోంది అన్నది కాంగ్రెస్ గ్రహించాలని సుధాంశు త్రివేది కోరారు. అంతే కాదు మోడీ ఏమి చేసినా ప్రభుత్వం కోసం ప్రజల కోసమే అని అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. ఇక దేశంలో చూస్తే చాలా కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి విధి నిర్వహణలో ప్రధాని విదేశీ పర్యటనకు వెళ్ళడం అలాగే సెలవులలో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్ళడం మధ్య తేడా తెలియదా అని ప్రశ్నించారు. మోడీ దేశ ప్రతిష్ట పెంచుతూంటే రాహుల్ తన విదేశీ పర్యటనల ద్వారా దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. మొత్తానికి చూస్తే మోడీ విదేశీ టూర్లు రాహుల్ టూర్లు కూడా కాంగ్రెస్ బీజేపీల మధ్య డైలాగ్ వార్ కి కారణంగా మారిపోయాయి అన్న మాట అని అంతా అంటున్నారు.

Tags:    

Similar News