• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కేసీఆర్ అధికారిక నివాసం.....

కేసీఆర్ అధికారిక నివాసం.. ఇక ఆ మంత్రి నివాసం..

| కాంగ్రెస్ పార్టీ అధికారిక నివాసాలను ఒక్కొక్కటిగా ఆధీనంలోకి తీసుకుంటుంది. పాలనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటుంది.

By - Tupaki Desk
Update: 2023-12-13 11:10 GMT

కాంగ్రెస్ పార్టీ అధికారిక నివాసాలను ఒక్కొక్కటిగా ఆధీనంలోకి తీసుకుంటుంది. పాలనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటుంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ బంగ్లాలు, స్థలాలను కాంగ్రెస్ పార్టీ పాలనకు ఉపయోగించుకుంటుంది. దీనిలో భాగంగా హైదరాబాద్ నడిబొడ్డులోని బేగంపేట్ లో ఉండే ‘ప్రగతి భవన్’ను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. ‘ప్రగతి భవన్ గేట్లను కూల్చివేస్తానని, ప్రజలకు పాలకులకు అడ్డుగా ఉన్న భారికేడ్లను కూలుస్తానని’ ఎన్నికల ప్రచారంలో రేవంత్ అన్నారు. ఆ మేరకు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు (డిసెంబర్ 07)న ప్రగతి భవన్ ముందు ఉన్న ఇనుప కంచెలను తొలగించారు.

ప్రమాణ స్వీకారం తర్వాత ‘ప్రజా దర్బార్’ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రగతి భవన్ కు ‘మహాత్యా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్’గా నామకరణం చేశారు. ఇక అప్పటి నుంచి ప్రజా భవన్ లో ప్రజావాణి కార్యక్రమం జరిగింది. మంత్రులు కొండా సురేఖ, సీతక్క, తదితరులు ఇక్కడే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అయితే గత ప్రభుత్వంలో కేసీఆర్ అధికారిక నివాసం కావడంతో ఇక్కడే కీలక సమావేశాలు జరిగేవి. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రముఖులతో నిత్యం రద్దీగా ఉండేది ఈ ప్రజా భవన్.

అయితే, రేవంత్ ప్రభుత్వం ఇటీవల మరో నిర్ణయం తీసుకుంది. ప్రజా భవన్ ఇక నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ఉండబోతోందని చెప్పారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి జీవో నెం. 1638 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్డు, రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న ఈ భవంతిని భట్టీకి అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంతో భట్టీ తన నివాసాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తారని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం హోదాలో భట్టి విక్రమార్క అధికారిక కార్యక్రమాలు ఇక్కడి నుంచే కొనసాగించనున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు సామాన్యులకు ప్రజా భవన్ గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ప్రభుత్వం భట్టీకి ప్రజా భవన్ కేటాయించడంపై వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
  • Bhattivikramarka 
  • Congress 
  • Deputychiefminister 
  • Prajabhavan 
  • Revanthreddy 
  • Kcr 
  • Brs 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS