• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మరోసారి బెజవాడ హీట్‌.....

మరోసారి బెజవాడ హీట్‌.. అమ్మవారి పాదాల ముందు టీడీపీ నేత అప్లికేషన్‌!

| బెజవాడ పాలిటిక్స్‌ మరోసారి హీటెక్కాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో టికెట్ల కోసం నేతలు పోటీపడుతున్నారు.

By - Tupaki Desk
Update: 2024-02-01 13:01 GMT

బెజవాడ పాలిటిక్స్‌ మరోసారి హీటెక్కాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో టికెట్ల కోసం నేతలు పోటీపడుతున్నారు. ముఖ్యంగా టీడీపీలో ఈ పోటీ ఎక్కువగా ఉంది. విజయవాడ నగరంలో మూడు అసెంబ్లీ సీట్లు ఉండగా వీటిలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఆశించే నేతలు ఎక్కువయ్యారు. అందులోనూ జనసేన పార్టీ, టీడీపీ కలిసి పోటీ చేస్తుండటంతో నేతలు ఈ సీటు తమకంటే తమకని పోటీ పడుతున్నారు.

విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా ప్రస్తుతం వైసీపీ తరఫున వెలంపల్లి శ్రీనివాసరావు ఉన్నారు. ఈసారి ఆయనను విజయవాడ సెంట్రల్‌ కు మార్చారు. వైసీపీ తరఫున ముస్లిం అభ్యర్థికి వచ్చే ఎన్నికలకు సీటు ఇచ్చారు.

ఇక జనసేన పార్టీ తరఫున పోతిన మహేశ్‌ ఈ సీటును ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన వచ్చే ఎన్నికల్లోనూ పోటీకి సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది తానేనంటూ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు.

మరోవైపు టీడీపీ తరఫున విజయవాడ పశ్చిమ సీటును మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్, మరో నేత ఎంకే బేగ్‌ ఆశిస్తున్నారు. ముస్లింలకు ఈ సీటు ఇవ్వాలని.. ముఖ్యంగా తనకు లేదా తన కుమార్తెకు ఈ సీటు ఇవ్వాలని జలీల్‌ ఖాన్‌ కోరుతున్నారు. ఇవ్వకపోతే ముస్లింలు ఉరేసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక బుద్ధా వెంకన్న ఏకంగా బలప్రదర్శనకు దిగారు. తన అనుచరులు, కార్యకర్తలతో తన నివాసం నుంచి అమ్మవారి గుడి వరకు పాదయాత్ర చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయవాడ పశ్చిమలో పోటీ చేసేది తానేనంటూ తేల్చిచెప్పారు. తన దరఖాస్తును టీడీపీ అధినేత చంద్రబాబుకు సమర్పించే ముందు అమ్మవారి పాదాల వద్ద పెట్టి పూజ చేయడానికి వచ్చానన్నారు

విజయవాడ పశ్చిమ నుంచి అసెంబ్లీకి లేదా అనకాపల్లి నుంచి పార్లమెంటుకు పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని బుద్ధా వెంకన్న కోరారు. చంద్రబాబును, పవన్‌ కళ్యాణ్‌ ను ఎవరైనా విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

కేశినేని నాని అనే కుక్కకు బుద్ధి చెప్పాలని ర్యాలీగా వచ్చానని బుద్ధా వెంకన్న హాట్‌ కామెంట్స్‌ చేశారు. చంద్రబాబు తనకు దైవసమానులని వ్యాఖ్యానించారు. కేశినేని వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్‌ గురించే మాట్లాడే కుక్కల తాట తీస్తానని హెచ్చరించారు. అమ్మవారి పాదాల ముందు తాను అప్లికేషన్‌ పెట్టడానికి వస్తే భారీగా కేడర్‌ తరలివచ్చారన్నారు. తనకు టికెట్‌ కేటాయించాలని చంద్రబాబు, పవన్‌ ఇద్దర్నీ కోరుతున్నానన్నారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తానని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో విజయవాడ పాలిటిక్స్‌ మరోసారి ఆసక్తిగా మారాయి. విజయవాడ పశ్చిమ సీటును ఆశించేవారు ఎక్కువగా ఉండటం, మరోవైపు జనసేన కూడా ఈ సీటు తమకేనని చెబుతుండటంతో ఈ సీటును ఏ పార్టీ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.





 


Tags:    
  • Vijayawada 
  • Buddhavenkanna 
  • APelections 
  • Tdp 
  • Chandrababundiu 
  • Janasena 
  • Potinamahesh 
  • Ysrcp 
  • Kanakadurgamatemple 

Similar News

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

పాపం ఏబీవీ : సోషల్ మీడియా హైప్....డిపాజిట్ గల్లంతు

2026-11-04 08:06 GMT

సుప్రీంషాక్‌: దిగొచ్చిన ఎన్నిక‌ల సంఘం.. బిగ్ రిలీఫ్‌!

2026-11-04 08:02 GMT

ఈమె ఏ పార్టీలోచేరినా విజయమే.. లక్ అంటే రమాకుమారిదే..

2026-11-04 08:01 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

Copyright @2026

Powered by Blink CMS