బెంగళురు నుంచి ఎంఎన్‌సీ కంపెనీలు జెండా ఎత్తేయబోతున్నాయా?

దేశంలోని ఐటి, లాజిస్టిక్ రంగాలకు ప్రధాన కేంద్రంగా పేరొందిన బెంగళూరు, ఇప్పుడు మౌలిక సదుపాయాల పరంగా వెనుకబడిపోతున్నది.;

Update: 2025-09-17 11:30 GMT

దేశంలో ముంబై, ఢిల్లీ తర్వాత సాఫ్ట్ వేర్ తో పాటు ఇతర ఎంఎన్ సీ కంపెనీలు ఎంచుకునే ప్రధాన నగరం బెంగళురు. దేశంలోని ఐటి, లాజిస్టిక్ రంగాలకు ప్రధాన కేంద్రంగా పేరొందిన బెంగళూరు, ఇప్పుడు మౌలిక సదుపాయాల పరంగా వెనుకబడిపోతున్నది. రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, నిర్లక్ష్యానికి గురవుతున్న మురిసిన రోడ్లు, గుంతలతో నిండిన రహదారులు, పర్యవేక్షణలో లోపం తదితర అంశాలతో ఎంఎన్ సీ కంపెనీల మనుగడను ప్రశ్నార్థకంగా మారబోతున్నది. ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు మల్టీనేషనల్ కంపెనీలు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. నగరంలో ఉద్యోగులు గంటల తరబడి ప్రయాణించాల్సి రావడం, వ్యాపార కార్యకలాపాలు అంతరాయం ఎదుర్కొనడంతో షిఫ్టింగ్ తప్పదనే భావనే వ్యక్తమవుతున్నది. ప్రముఖ లాజిస్టిక్ టెక్ సంస్థ బ్లాక్‌బక్ తమ ప్రధాన కార్యాలయాన్ని బెంగళూరులోని బెల్లందూరు నుంచి తరలించనున్నట్లు ప్రకటించింది. ఇది ఒక పెద్ద హెచ్చరికగా నిలుస్తోంది.

ఇండియన్ సిలికాన్ వాలీ

బెంగళూరు ‘ఇండియన్ సిలికాన్ వాలీ’గా పేరు తెచ్చుకున్నప్పటికీ, మౌలిక సదుపాయాల కల్పనలో అంతే స్థాయిలో ముందుకు సాగలేకపోతున్నది. ఐదేళ్లలో వచ్చిన గణనీయమైన మార్పులు, అంచనాలు లేకపోవడం పై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య సమన్వయం లేదనే మరో విషయం ఇక్కడ స్పష్టమవుతున్నది.

పెరుగుతున్న ధరలు

ఇక్కడి ఆస్తుల ధరలు అమెరికా, దుబాయ్ తరహా స్థాయిలో పెరిగిపోతున్నది. కానీ సదుపాయాల పరంగా ఎటువంటి అభివృద్ధి లేకపోవడం పెద్ద మైనస్ గా మారుతున్నది. ఇక్కడి గుంతలు, ధూళి, రోడ్ల దుస్థితిపై ప్రభుత్వ దృష్టి సారించకపోవడం అక్కడి అడ్మినిస్ట్రేషన్ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ప్రజల ప్రయాణ భద్రతను పెంపొందించడంలో అనేక లోపాలను ఎత్తి చూపుతున్నది.

వాటిపై ప్రణాళికలు కరువు..

ప్రైవేట్ సంస్థలు, ప్రెస్టీజ్, సత్వ వంటి పెద్ద సంస్థలు టెక్ పార్కుల నిర్మాణానికి బెంగుళూరు వైపు మొగ్గు చూపుతుండడం శుభపరిణామమే అయినా, మౌలిక సదుపాయాల కల్పనపై సమర్ధవంతమైన ప్రణాళికలు రూపొందించకపోవడం నిర్లిప్తతకు నిదర్శనం.

హెచ్చరికను లెక్కలోకి తీసుకుంటారా?

బ్లాక్‌బక్ సంస్థ నిర్ణయం ప్రభుత్వానికి మరియు ఇతర సంస్థలకు హెచ్చరికగా మారాలి. ఇది అభివృద్ధి పేరుతో జరుగుతున్న నిర్లక్ష్యానికి ఎదురుదెబ్బగా మారుతున్నది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల పై మరింత శ్రద్ధ పెట్టి, నగరంలోని ట్రాఫిక్, రోడ్డు నిర్వహణ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాల్సిన అవసరం నేడు స్పష్టమైంది.

అంతేకాకుండా, నగరాభివృద్ధికి వ్యతిరేకంగా ఎదురయ్యే ప్రతీ సంక్షోభాన్ని, ప్రైవేట్ రంగ సంస్థల డిమాండ్లను గమనించి సమన్వయ చర్యలు చేపట్టడమే సమాజాన్ని నూతన దిశగా నడిపించే మార్గం. ఇకపై నిర్లక్ష్యానికి చోటు లేదు.

Tags:    

Similar News