• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  లైవ్ లో మిడిల్ ...

లైవ్ లో మిడిల్ ఫింగర్... సారీ చెప్పిన యాంకరమ్మ!

| అవును... తాజాగా బీబీసీ న్యూస్ యాంకర్.. లైవ్‌ లో మధ్య వేలును చూపిస్తూ వార్తల్లో నిలిచారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

By - Tupaki Desk
Update: 2023-12-08 05:16 GMT

టీవీ లైవ్‌ లలో యాంకర్లు అలెర్ట్‌ గా లేకపోతే అప్పుడప్పుడూ మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. అనంతరం అవి బయటకు వచ్చిన తర్వాత వైరల్ అవుతుంటాయి. రికార్డెడ్ షోలో అయితే ఎన్ని టేక్ లైనా తీస్కోవచ్చు, ఎన్ని మిస్టేక్స్ అయినా చేసి కరెక్ట్ చేసుకోవచ్చు. కానీ... లైవ్ లో వీలైనంత ఎక్కువ కేర్ తీసుకోవాలి.. పూర్తి స్పృహలో ఉండాలి. తాజాగా బీబీసీ న్యూస్ యాంకర్ లైవ్ టీవీలో అసభ్యకరంగా సైగ చేసి కెమెరా కంటికి చిక్కుకుంది.

అవును... తాజాగా బీబీసీ న్యూస్ యాంకర్.. లైవ్‌ లో మధ్య వేలును చూపిస్తూ వార్తల్లో నిలిచారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్య వేలు చూపించిన విజువల్ రెప్పపాటులో స్క్రీన్‌ పై కనిపించింది. దాంతో విపరీతమైన ట్రోలింగ్స్ మొదలైపోయాయి. సోషల్ మీడియా వేదికగా ఆమెను నెటిజన్లు ఒక ఆటాడుకున్నారు. దీంతో... లైవ్ లో మిస్టేక్ చేసిన ఆ యాంకరమ్మ.. సోషల్ మీడియాలో సారీ చెప్పారు.

వివరాళ్లోకి వెళ్తే... బీబీసీ చీఫ్ ప్రెజెంటర్ అయిన మర్యం మోషిరి... మధ్యాహ్నం వార్తలకు రెడీ అవుతున్నారు. ఈ సమయంలో లైవ్‌ కి కౌంట్ డౌన్ ప్రారంభమై సున్నాకి చేరుకోవడంతో స్క్రీన్‌ పై ఆమె తన మధ్య వేలును చూపించారు. అనంతరం విషయం అర్ధమై వెంటనే తేరుకుని వార్తలు చదవడం ప్రారంభించారు. ఇందులో భాగంగా... "లైప్ ఫ్రం లండన్.. కరోనా సమయంలో యూకే పడ్డ ఇబ్బందులు, జరిగిన నష్టానికి బ్రిటీష్ మాజీ ప్రధాన మంత్రి బోరిస్ క్షమాపణలు చెప్పారు" అని న్యూస్ చదవడం మొదలుపెట్టారు.

అయితే ఆమె ఇలా కవర్ చేయాలని ప్రయత్నించారో ఏమో కానీ... ఈ లోపు క్రిస్ రోస్ అనే ట్విట్టర్ యూజర్ ఆ వీడియో షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోపై మోషిరి వివరణ ఇవ్వక తప్పలేదు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో తన వివరణను, క్షమాపణను రాసుకొచ్చారు.

ఇందులో భాగంగా... "అందరికీ హాయ్.. డైరెక్టర్ 10-0 నుండి కౌంట్ డౌట్ స్టార్ చేయడంతో నేను నా చేతి వేళ్లతో నెంబర్ చూపిస్తున్నట్లు నటిస్తున్నాను. ఈ సమయంలో సున్నాకంటే ముందు నంబర్ 1 కి చేరుకున్నప్పుడు నేను జోక్‌ గా వేలును చూపించాను.. అది కెమెరాలో చిక్కుకుంటుందని అనుకోలేదు. ఇది టీం తో జరిగిన ఒక జోక్ మాత్రమే. అయితే లైవ్ లో ప్రసారం అయినందుకు క్షమించండి" అని తెలిపారు.

Hey everyone , yesterday just before the top of the hour I was joking around a bit with the team in the gallery.

I was pretending to count down as the director was counting me down from 10-0.. including the fingers to show the number. So from 10 fingers held up to one.

When…

— Maryam Moshiri (@BBCMaryam) December 7, 2023


This isn’t satire, an actual BBC News presenter got caught giving the middle finger live.

Maryam Moshiri summing up the professionalism currently at the BBC. pic.twitter.com/QoJ4FT133J

— Chris Rose (@ArchRose90) December 7, 2023
Tags:    
  • Bbc 
  • Reporter 
  • Maryammoshiri 
  • Newreporter 
  • Live 
  • Abusive 
  • Maryam 

Similar News

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

పాపం ఏబీవీ : సోషల్ మీడియా హైప్....డిపాజిట్ గల్లంతు

2026-11-04 08:06 GMT

సుప్రీంషాక్‌: దిగొచ్చిన ఎన్నిక‌ల సంఘం.. బిగ్ రిలీఫ్‌!

2026-11-04 08:02 GMT

ఈమె ఏ పార్టీలోచేరినా విజయమే.. లక్ అంటే రమాకుమారిదే..

2026-11-04 08:01 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

Copyright @2026

Powered by Blink CMS