టూరిస్టులను పొమ్మంటున్నారు.. ఆ దేశ ప్రజల ఆందోళన.. కారణాలు ఇవే

కొంతకాలం క్రితం వరకు బార్సిలోనాలో అద్దె ఇళ్లు సరసమైన ధరల్లో దొరికేవి. హోటళ్లు, రెస్టారెంట్లు కూడా సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేవి.;

Update: 2025-06-19 14:30 GMT

ప్రపంచ దేశాలు టూరిజంను ప్రధాన ఆదాయ వనరిగా అభివృద్ధి చేసుకునేందుకు శ్రమిస్తుంటే, యూరప్‌లోని స్పెయిన్ రాజధాని బార్సిలోనాలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా ఏ ఖర్చు లేకుండా విదేశాల నుంచి నిధులు రావడానికి టూరిజం ఎంతో సహాయపడుతుంది. అందుకే దాదాపు అన్ని దేశాలు తమ దేశానికి ఎక్కువగా పర్యాటకులు రావాలని ఆశిస్తుంటాయి. కానీ బార్సిలోనా ప్రజలు మాత్రం "మా నగరానికి పర్యాటకులు రావద్దు" అంటూ నిరసనలకు దిగడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

-ఎందుకింత ఆందోళన?

బార్సిలోనా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక ప్రదేశం. అక్కడి మైలు మాళ్ల సౌందర్యం, సముద్రతీరాలు, ప్రకృతి, ఆధునిక బోటింగ్, విలాసవంతమైన హోటళ్లు, రాత్రి వేడుకలు, రుచికరమైన వంటకాలు ఇవన్నీ ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. 15.5 మిలియన్ల మందికి పైగా పర్యాటకులు ఒక్క ఏడాదిలో బార్సిలోనాను సందర్శించగా, అక్కడి జనాభా కేవలం 1.5 మిలియన్లే. ఈ భారీ తాకిడి కారణంగా స్థానికుల జీవితం పూర్తిగా మారిపోయింది.

బార్సిలోనాకు ఓవర్ టూరిజం ఏవిధంగా భారం అయింది?

కొంతకాలం క్రితం వరకు బార్సిలోనాలో అద్దె ఇళ్లు సరసమైన ధరల్లో దొరికేవి. హోటళ్లు, రెస్టారెంట్లు కూడా సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేవి. కానీ పర్యాటకుల సంఖ్య పెరిగిన కొద్దీ అక్కడి జీవిత వ్యయం ఆకాశాన్ని తాకింది. అద్దె ఇళ్లు దొరకడం మిషన్ అయింది. హోటళ్ల ధరలు రెట్టింపు అయ్యాయి. సాధారణంగా కొనే నీటి బాటిల్ ఖర్చు కూడా గణనీయంగా పెరిగింది. దాని ప్రభావం స్థానికుల జీతాలపై పడింది. ఇకనైనా ఈ పరిస్థితిని ప్రభుత్వం గమనించాలని కోరుతూ ప్రజలు ప్లకార్డులు పట్టుకుని నిరసనలకు దిగారు.

"ఇప్పటివరకు మేము భరించాం. కానీ ఇక సాధ్యపడడం లేదు. ఇంతటి టూరిజం వల్ల మా జీవన విధానం నాశనమవుతోంది. గతంలో బార్సిలోనాలో జీవితం చక్కగా, సరసమైన ధరల్లో సాగేది. కానీ ఇప్పుడు అన్నీ అధిక ధరలకు మారిపోయాయి. మేము ఊహించని స్థాయిలో ఖర్చులు పెరిగాయి. టూరిస్టులే దీనికి కారణం" అని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పర్యాటకుల రాక వల్ల నగరానికి ఆదాయం వచ్చినా, స్థానిక ప్రజల జీవితం చికాకుగా మారడాన్ని అధికారులు పట్టించుకోవాలన్నది బార్సిలోనా వాసుల డిమాండ్. "మా దేశానికి వచ్చినవారు తమ ఆనందం కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. మేము ప్రశాంతంగా జీవించాలంటే టూరిజాన్ని పరిమితం చేయాలి" అని వారు కోరుతున్నారు.

Tags:    

Similar News