బంగ్లాలో మరో నాయకుడి తలపై కాల్పులు... ఎవరి లేడీ క్రిమినల్..!
అవును... షరీఫ్ ఉస్మాన్ హైదీ హత్యతో బంగ్లాదేశ్ లో హింసాత్మక ఆందోళనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల వేళ మరో విద్యార్థి నాయకుడిపై హత్యాయత్నం జరిగింది.;
గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ తగలబడిపోతున్న సంగతి తెలిసిందే.. తాత్కాలిక ప్రభుత్వ పెద్దల చేతకాని తనమో, వ్యూహాత్మక ప్రయత్నమో తెలియదు కాని.. ఆ దేశంలో రోజు రోజుకీ అంతర్గత అశాంతి పెరిగిపోతుంది. ప్రధానంగా భారత వ్యతిరేకి, ఇంకిలాబ్ మోంచా నేత హైదీ హత్యతో ఆందోళనలు తీవ్ర హింసాత్మకంగా మారిన వేళ.. తాజాగా మరో హైప్రొఫైల్ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. దీంతో.. మరోసారి బంగ్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
అవును... షరీఫ్ ఉస్మాన్ హైదీ హత్యతో బంగ్లాదేశ్ లో హింసాత్మక ఆందోళనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల వేళ మరో విద్యార్థి నాయకుడిపై హత్యాయత్నం జరిగింది. ఇందులో భాగంగా... బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సీపీ) నేత మోతాలెబ్ సిక్దార్ పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తుపాకీ తూటా సిక్దార్ తలలోకి దూసుకుపోయిందని చెబుతున్నారు.. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అంటున్నారు!
బంగ్లా మీడియా నివేదికల ప్రకరం... ఖుల్నా జిల్లాలో ఎన్సీపీ సంస్థలో కేంద్ర వ్యక్తి ముహమ్మద్ మోతాలెబ్ సిక్దార్ తలపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ సంఘటన సోమవారం ఉదయం 11:45 గంటల ప్రాంతంలో జరిగింది. ఆ సమయంలో నగరంలోని సోనాదంగ ప్రాంతంలోని సిక్దార్ ఒక ఇంట్లో ఉన్నాడు. ఖుల్నాలో త్వరలో జరగాల్సిన పార్టీ డివిజన్ కార్మిక ర్యాలీని నిర్వహించే పనిలో ఉండగా ఈ దాడి జరిగిందని చెబుతున్నారు.
ఈ వ్యవహారంపై సోనాదంగ పోలీస్ స్టేషన్ లోని ఇన్వెస్టిగేషన్ ఇనిస్పెక్టర్ అనిమోష్ మండల్ స్పందిస్తూ... ఈ పరిణామాన్ని ధృవీకరించారు. ఇందులో భాగంగా సిక్దార్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు తెలిపారు. కాల్పుల ఘటన అనంతరం అతడిని హుటాహుటిన ఖుల్నా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించామని.. అక్కడ నుంచి అతని తలకు సీటీ స్కాన్ కోసం డయాగ్నస్టిక్ సెంటర్ కు తీసుకెళ్లారని చెప్పారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు.
సిక్దార్ పై కాల్పులు జరిగిన ఇంట్లోని ఆ మహిళ ఎవరు..?:
షరీఫ్ ఉస్మాన్ హైదీని దుండగులు కాల్చి చంపిన తర్వాత బంగ్లాదేశ్ రగిలిపోతోన్న వేళ.. ఊహించని స్థాయిలో మరో నాయకుడిపై కాల్పులు జరగడం కలకలం సృష్టిస్తోంది. అయితే... తాజాగా సిక్దార్ ని ఓ ఇంట్లో చంపారని.. ఆ ఇంటికి అతడు తరచు వెళ్తాడని.. ఆ ఇంట్లో ఓ జంట ఉంటారనే విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పైగా ఆ మహిళకు నేర చరిత్ర ఉందని అంటున్నారు. దీంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది.
అవును... బంగ్లాదేశ్ మీడియా నివేదికల ప్రకారం ఖుల్నా గాజీ మెడికల్ ప్రాంతంలోని అల్ అక్సా మసిదు లేన్ లోని ఓ అద్దె ఇంటికి సిక్దార్ తరచూ వెళ్లేవాడు. ఆ ఇంటిని ఒక జంట అద్దెకు తీసుకున్నారు. ఈ కాల్పుల ఘటనకు కాసేపు ముందే సిక్దార్ ఆ ఇంటికి వెళ్లినట్లు చెబుతున్నారు. అనంతరం ఆ ఇంట్లోనే కాల్పులు జరిగాయి. ఈ సందర్భంగా... సిక్దార్ తరచూ ఆ ఇంటికి వెళ్తుంటాడని.. ఆ ఇంట్లోని మహిళతో అతడు సంబంధం కలిగి ఉన్నాడని చెబుతున్నారు.
పైగా... కాల్పులు జరిగిన ఇంటిని పోలీసులు తనిఖీ చేయగా.. ఆ ఇంట్లో మాదకద్రవ్య సామాగ్రి, విదేశీ మద్యం బాటిళ్లు ఉన్నాయని చెబుతున్నారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆ మహిళ పారారీలో ఉందని.. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఆమె దొరికితే ఈ ఘటన వెనుక ఉన్న వ్యవహారం మొత్తం తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు.