• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  "సినీ ప్రముఖులకు సీఎం...

"సినీ ప్రముఖులకు సీఎం అందుకు మాత్రమే కావాలా"?

| అవును... విషయం ఏదైనా.. అది బండ్ల గణేష్ ద్వారా వెళ్లడైతే సంచలనంగా మారుతుందని అంటుంటారు.

By - Tupaki Desk
Update: 2024-11-09 04:52 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు, పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమయంలో వీలుకాకో, గుర్తు లేకో, అవసరం కాదనుకునో, నేరుగా కలిసే ఛాన్స్ లేదనుకునో.. కారణం ఏదైనా చాలా మంది సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పలేదు! దీనిపై బండ్ల గణేష్ స్పందించారు.

అవును... విషయం ఏదైనా.. అది బండ్ల గణేష్ ద్వారా వెళ్లడైతే సంచలనంగా మారుతుందని అంటుంటారు. సాల్ట్, పెప్పర్, మసాలా గట్టిగా దట్టించి ఏ విషయాన్నైనా స్పైసీగా జనాల్లోకి వదలగలుగుతారని చెబుతుంటారు. ఫలితంగా ఆయనకొచ్చే క్రెడిట్ సంగతి కాసేపు పక్కనపెడితే.. కొన్ని సందర్భాల్లో నెటిజన్లకు మాత్రం అడ్డంగా దొరికేస్తుంటారు అని కామెంట్ చేస్తుంటారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా గణేష్ మరోసారి నెట్టింట వైరల్ గా మారారనే చెప్పాలి! దీనికి కారణం... రేవంత్ రెడ్డి పుట్టిన రోజున శుభాకాంక్షలు చెప్పడానికి సమయం లేని సినీ ప్రముఖులందరికీ నమస్కారాలు అంటూ బండ్ల పెట్టిన ట్వీటే. దీంతో కామెంట్ సెక్షన్ లో నెటిజన్స్ హల్ చల్ చేస్తున్నారు.

"గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను" అంటూ ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు బండ్ల గణేష్!

దీంతో... రాహుల్ గాంధీ, ప్రియాంక్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా... వీళ్లు ఎందుకు విషెస్ చెప్పలేదు అని కొందరు కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో... అడిగి మరీ శుభాకాంక్షలు చెప్పించుకోవడం ఏమిటన్నా అని మరొకరు కామెంట్ చేశారు.

ఇదే సమయంలో మరికొంతమంది పర్సనల్ గా ఫోన్ చేసో, వాట్సప్ లో మెసెజ్ పెట్టో విషెస్ చెప్పి ఉంటారు కదా అన్నా.. ఈ తుత్తర ఏలా? అని ఇంకొకరు రియాక్ట్ అవుతుంటే... గణేష్ అన్నకు తెలంగాణలో మరో కోళ్ల ఫారమ్ కన్ ఫాం అని ఇంకొకరు స్పందిస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం... 'వాటే టైమింగ్ బ్రో' అని అభినందిస్తున్నారు!!

గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. “టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను”.🙏 @revanth_anumula anna @TelanganaCMO

— BANDLA GANESH. (@ganeshbandla) November 9, 2024
Tags:    
  • Congressparty 
  • Brsparty 
  • Bjp 
  • Revanthreddy 
  • TelanganaCM 
  • Birthdaywishes 
  • Bandlaganesh 
  • Tweet 
  • Socialmedia 
  • Viral 

Similar News

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS