వైరల్ పిక్... చంద్రబాబుతో బండ్ల గణేష్ ఆత్మీయ ఆలింగనం!
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజానికానికి అటూ సినిమా ఇండస్ట్రీ, ఇటు పాలిటిక్స్.. రెండింటిలోనూ తనదైన హల్ చల్ చేసిన వ్యక్తిగా బండ్ల గణేష్ సుపరిచితుడే!;
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజానికానికి అటూ సినిమా ఇండస్ట్రీ, ఇటు పాలిటిక్స్.. రెండింటిలోనూ తనదైన హల్ చల్ చేసిన వ్యక్తిగా బండ్ల గణేష్ సుపరిచితుడే! పెద్దగా పరిచయం అవసరం లేని వ్యక్తే! స్టేజిలపై మైకుల్లో ఆయన చేసే ప్రసంగాలు, టీవీ ఇంటర్వ్యూలలో ఆయన ఇచ్చే సంచలన స్టేట్ మెంట్లు ఓ పెద్ద హాట్ టాపిక్.
ఇక తన సినిమాలోని హీరోలను ఆడియో ఫంక్షన్స్ లో ఆకాశానికి ఎత్తేస్తుంటారు గణేష్. దానికి సంబంధించిన వీడియోలు నెట్టింట చేసిన సందడి అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఇక గత ప్రభుత్వ హయాంలో ఏపీలో చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు, హైదరాబాద్ లో గణేష్ రియాక్షన్ ఫైరల్ అయ్యింది! ఆయన చంద్రబాబుకు బిగ్ ఫ్యాన్!
ఇటీవల చంద్రబాబు వల్ల ఏడేళ్లుగా అంతు చిక్కని, పరిష్కారం కాని సమస్య కేవలం నిమిషాల్లో సమసిపోయిందని.. ఆ పని రెండు రోజుల్లోనే పూర్తయ్యిందని.. అది చంద్రబాబు ఘనత అని ఇటీవల గణేష్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తన అభిమాన నాయకుడు చంద్రబాబుని కలిశారు. ఆ ఫోటోలో కనిపిస్తున్న గణేష్ ముఖంలో ఆనందం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
అవును... బండ్ల గణేష్ తాజాగా ఏపీ ముఖ్యమంత్రి, తన అభిమాన నాయకుడు నారా చంద్రబాబుని కలిశారు. ఈ సందర్భంగా... గణేష్ ని బాబు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ సమయంలో బండ్ల గణేష్ ముఖంలో సంతోషంతో పాటు కృతజ్ఞత స్పష్టంగా కనిపిస్తోంది! ఈ పిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది.