• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాలయ్య అసెంబ్లీ...

బాలయ్య అసెంబ్లీ ఎపిసోడ్...త్వరలో చిరుతో బాబు భేటీ ?

| వియ్యంకుడు కం బావమరిది బాలయ్య అసెంబ్లీకి రాక రాక వచ్చి రచ్చ చేసి వెళ్లారు. ఆయన అసెంబ్లీలో చిరంజీవి మీద చేసిన వ్యాఖ్యలు మీద మెగా ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు.

By - Satya P
Update: 2025-09-27 11:30 GMT

వియ్యంకుడు కం బావమరిది బాలయ్య అసెంబ్లీకి రాక రాక వచ్చి రచ్చ చేసి వెళ్లారు. ఆయన అసెంబ్లీలో చిరంజీవి మీద చేసిన వ్యాఖ్యలు మీద మెగా ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. అదే సమయంలో ఒక బలమైన సామాజిక వర్గం సైతం రగులుతోంది. ఇక వీటి అన్నింటి కంటే ఎక్కువగా చూస్తే మెగాస్టార్ స్పీడ్ రియాక్షన్. ఆయన ఎక్కడో విదేశాల్లో ఉండి కూడా వెంటనే రెస్పాండ్ కావడం తన ఆవేదనను ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే ఈ ఎపిసోడ్ మాత్ర అలా కంటిన్యూ అవుతోంది. దాంతో కూటమిలో ఒక గంభీర వాతావరణం నెలకొంది అని అంటున్నారు జనసేన టీడీపీల మధ్య గ్యాప్ ఉందా అన్నది ఒక చర్చ అయితే దానిని పెంచి పెద్దది చేసేందుకు వైసీపీ ఎటూ కాచుకుని కూర్చుని ఉంది అన్నది మరో విషయం. ఏది ఏమైనా మెగాస్టార్ తీవ్రంగా మనస్థాపానికి గురి అయ్యారు అన్నది వాస్తవం. మరి ఏమి చేయాలి అన్నదే కదా అసలైన చర్చ.

బాలయ్యకి చిరుకు మధ్యన :

ఇక విషయంలోకి వెళ్తే బాలయ్యకు చిరంజీవికి మధ్యన మొదటి నుంచి గ్యాప్ అనేది ఉంది అని సినీ జనాలు చెప్పుకుంటారు. ఈ ఇద్దరి మధ్యన సాన్నిహిత్యం చూసిన వారు తక్కువ అని అంటారు. సుదీర్ఘమైన ఈ ఇద్దరి కెరీర్ కూడా పోటా పోటీగా సాగింది. కెరీర్ లో ఉన్న పోటీ కూడా వారి మధ్యన గ్యాప్ కి కారణం అని చెబుతారు. మరో వైపు చూస్తే చిరంజీవికి జనసేన పార్టీ టీడీపీ తో కలవడం మొదటి నుంచి ఇష్టం లేదు అని చెబుతారు. దానికి కారణం చాలానే ఉంది. ఇక కమ్మ కాపుల మధ్య కూడా పడదు అని మరో ప్రచారం కూడా ఉంది. సినీ రంగంలో అది స్పష్టమైన విభజనగా ఉంటూ వచ్చింది. రాజకీయంగా అయితే ఒక మ్యాజిక్ గా ఏపీలో టీడీపీ జనసేన పొత్తుతో ఉన్నాయని చెబుతారు.

బాలయ్య పాత వీడియోలు :

ఇక బాలయ్య వైఖరి చూస్తే ఓపెన్ గా ఉంటుంది. ఆయన ముందు పర్యవసానాలు చూసుకోరు అంటారు. తనకు తోచినది అనేస్తారు. ఆయన పాత వీడియోలలో కూడా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పటికీ యూ ట్యూబ్ లో అలా ఉన్నాయి. వాటిని ఇదే సమయంలో బయటకు తెచ్చి వైసీపీ చేయాల్సింది అంతా చేస్తోంది. అంతే కాదు వైఎస్సార్ బాలయ్య ఇంట్లో కాల్పుల కేసుల విషయంలో చేసిన హెల్ప్ గురించి అలాగే బసవతారకం ఆసుపత్రికి కోట్ల రూపాయలను జగన్ సీఎం గా ఉన్నపుడు రిలీజ్ చేసిన వ్యవహారాన్ని కూడా వైసీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ హైలెట్ చేస్తూనే ఉన్నారు. ఇక అఖండ సినిమా సమయంలో బాలయ్య జగన్ ని కలవడానికి చేసిన ప్రయత్నం గురించి అసలు విషయం మాజీ మంత్రి పేర్ని నాని చెప్పేశారు. నేను జగన్ ని కలవను అని బాలయ్య అన్న మాటలకు ఇది కౌంటర్ ఎటాక్ అన్న మాట.

టీడీపీకి డ్యామేజ్ :

ఏపీలో చూస్తే కులాల సమాహారంగా రాజకీయం ఉంటుంది. కులాలు బహు సున్నితమైనవి. వాటిని డీల్ చేయాలంటే తలకాయ నొప్పిగానే ఉంటుంది. కుడి ఎడమలను తూర్పు పడమరలను కూడా జట్టు కట్టించి కూటమి పెట్టించిన చంద్రబాబు పొత్తుల రాజకీయానికి ఈ విధంగా ఇబ్బందులు రావడం అంటే అది బిగ్ ట్రబుల్ గానే చూస్తున్నారు. ఒక బలమైన సామాజిక వర్గం రగులుతోంది అన్నది కూడా ఉంది దీంతో టీడీపీకే ఎటు చూసినా ఈ పరిణామాలు డ్యామేజ్ గా మారుతున్నాయని అంటున్నారు.

వెంటనే ఫుల్ స్టాప్ పడాలి :

ఇక ఈ విధంగా కూటమిలోనే చిచ్చు పెట్టినట్లుగా బాలయ్య చేసిన వ్యాఖ్యలు అయితే ఉన్నాయని అంటున్నారు. దాంతో వీటికి తక్షణం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని టీడీపీలో భావనగా ఉందిట. సాధ్యమైనంత త్వరలో చంద్రబాబు మెగాస్టార్ చిరంజీవితో భేటీ అవుతారు అని అంటున్నారు. అలాగని నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్ళినా లేక ఆయనను రప్పించుకున్నా వేరే సంకేతాలు వెళ్తాయని ఆలోచిస్తున్నారు. అందుకే ఒక కామన్ ఫంక్షన్ లోనే మెగాస్టార్ చిరంజీవి చంద్రబాబు కలిసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. అలా కలుసుకుని మనసు విప్పి ఇద్దరూ మాట్లాడుకుంటారు అని ఆ విధంగా మెగా స్టార్ కోపాన్ని చల్లార్చే ప్రయత్నం అయితే చేస్తారని టాక్ బాగా నడుస్తోంది.

కట్టడి చేయడంలో సక్సెస్ :

ప్రస్తుతానికి చిరంజీవి అయితే దేశంలో లేరు. ఆయన విదేశాల నుంచి వచ్చిన తరువాత తొందరలోనే ఈ భేటీ ఉండొచ్చు అని అంటున్నారు. ఇక ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది కానీ కూటమిలో రెండు పార్టీల క్యాడర్ లీడర్ తొందర పడకుండా కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు అని అంటున్నారు. అంతే కాదు మెగాస్టార్ చిరంజీవి మీద వ్యతిరేకంగా ఏ రకమైన ట్రోల్స్ కానీ పోస్టులు కానీ పెట్టవద్దు అని కూడా ఆదేశాలు వెళ్ళాయని అంటున్నారు. సో మొత్తానికి బాబు రంగంలోకి దిగుతున్నారన్న మాట. ఈ ఆసక్తికరమైన భేటీ అయితే ఉండొచ్చు అని అంటున్న క్రమంలో వెయిట్ అండ్ సీ.

Tags:    
  • Balakrishna 
  • Chiranjeevi 
  • MegaStars 
  • APPolitics 
  • Janasena 
  • TDP 
  • YSRCP 
  • PoliticalDrama 
  • MegaFansReact 
  • TollywoodBuzz 
  • CelebrityPolitics 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS