• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇన్‌స్టాగ్రామ్ రీల్స్...

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం జీవితాలను తాకట్టు పెడుతున్నారా?

| భారత్‌లో ఒక సాధారణ పెళ్లికి సగటున రూ.39.5 లక్షలు ఖర్చవుతున్నట్లు గణాంకాలు వెల్లడించాయి. డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఈ మొత్తం రూ.58 లక్షలకు చేరుతోంది. 78 శాతం జంటలు తమ పొదుపును పెళ్లి కోసమే ఖర్చు చేస్తుండగా, 15.1 శాతం మంది అప్పులు చేసి మరీ వివాహాలు చేసుకుంటున్నారు.

By - A.N.Kumar
Update: 2026-11-13 19:30 GMT

ఒకప్పుడు పెళ్లంటే.. ఇంటి ముందు పందిరి.. బంధువుల సందడి.. నాలుగు రకాల పిండివంటలు.. ఆశీర్వాదాలతో ముగిసిపోయే ఒక మధురమైన వేడుక. కానీ ఇప్పుడు పెళ్లంటే.. జీవితకాలపు పొదుపును ఒక్క రోజులో ఆవిరి చేసే మెగా బడ్జెట్ సినిమా.. తాజాగా బయటపడిన గణాంకాలు చూస్తుంటే పెళ్లి పీటలెక్కే ముందు వధూవరులు జాతకాలు కాదు.. తమ బ్యాంక్ బ్యాలెన్స్‌లు చూసుకుని గుండెలు బాదుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

భారత్‌లో ఒక సాధారణ పెళ్లికి సగటున రూ. 39.5 లక్షలు ఖర్చవుతోందట.. వినడానికి ఇది సాధారణంగానే అనిపించినా ఆ అంకె చూస్తే సామాన్యుడికి కళ్లు తిరగడం ఖాయం. ఇక 'డెస్టినేషన్ వెడ్డింగ్' అంటూ గోవా బీచ్‌లకో రాజస్థాన్ కోటలకో వెళ్తే ఆ బడ్జెట్ ఏకంగా రూ. 58 లక్షలకు చేరుతోంది. ఏటా 8 శాతం చొప్పున పెరుగుతున్న ఈ పెళ్లి ఖర్చుల దెబ్బకు పెళ్లి పత్రిక అచ్చేయించకముందే జేబులకు చిల్లులు పడుతున్నాయి.

ఇందులో అత్యంత విషాదకరమైన కామెడీ ఏంటంటే.. దేశంలోని 78 శాతం జంటలు తమ కష్టార్జితంతో కూడబెట్టిన పొదుపు మొత్తాన్ని ఈ పెళ్లి తంతు కోసమే తగలేస్తున్నాయి. సొంత ఇల్లు కొనుక్కోవడానికో వ్యాపారం పెట్టడానికో దాచుకున్న డబ్బునంతా తీసి.. ఖరీదైన లెహంగాలు.. డ్రోన్ కెమెరాలు.. పూల అలంకరణల పాలు చేస్తున్నారు. పెళ్లికి వచ్చే బంధువులు భోజనంలో ఉప్పు తక్కువైందని వంకలు పెట్టి వెళ్లిపోతారు కానీ ఆ ఒక్క రోజు ఆడంబరం కోసం కొత్త జంటలు మాత్రం తమ భవిష్యత్తును ఫణంగా పెడుతున్నాయి.

పరువు ముఖ్యం బిగులూ.. పక్కింటి వాళ్లకంటే గ్రాండ్‌గా చేయాలి అనే ఆలోచన 15.1 శాతం జంటలను ఏకంగా అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. సగటున రూ. 15.5 లక్షల వరకు పర్సనల్ లోన్లు తీసుకుని మరీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఆ తర్వాత 'హనీమూన్'కు బదులుగా ప్రతి నెలా బ్యాంకు వాళ్లు పంపే ఈఎంఐ మెసేజ్‌లతో కొత్త జంటలు రొమాన్స్ చేయాల్సి వస్తోంది.

సోషల్ మీడియాలో నాలుగు లైకుల కోసం.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వైరల్ అవ్వడం కోసం ఏళ్ల తరబడి ఈఎంఐలు కట్టడం ఎంతవరకు సమంజసం? పెళ్లి అనేది ఇద్దరు మనుషుల కలయికే తప్ప.. అది మన ఆర్థిక స్థోమతను నిరూపించుకునే స్టేటస్ సింబల్ కాదు. ఆడంబరాల మోజులో పడి అప్పుల పల్లకి ఎక్కే బదులు.. ఉన్నంతలో ఆనందంగా పెళ్లి చేసుకుని.. ఆ మిగిలిన లక్షలతో ప్రశాంతంగా కాపురం చేసుకోవడం ఎంతో ఉత్తమం. లేదంటే పెళ్లి ఘనంగా జరిగింది కానీ.. అప్పు తీర్చడానికి జీవితకాలం పట్టింది అని చెప్పుకోవాల్సి వస్తుంది.

Tags:    
  • indianweddings 
  • weddingexpenses 
  • weddingcosts 
  • personalfinance 
  • weddingbudget 

Similar News

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS