• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జనసేన ఎమ్మెల్యే కారుపై...

జనసేన ఎమ్మెల్యే కారుపై దాడి... పవన్ కీలక ఆదేశాలు!

| ఈ నేపథ్యంలో... నాలుగు కూడలి దగ్గరకు ఆ వాహనం రాగానే కొంతమంది గుర్తుతెల్లియని వ్యక్తులు ఆ వాహనంపై రాళ్లతో దాడి చేశారు.

By - Tupaki Desk
Update: 2024-07-30 03:51 GMT

ప్రస్తుతం ఏపీలో శాంతిభద్రతలు అనే అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తజాగా పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కాన్వాయ్ పై దాడి వ్యవహారం కలకలం రేపింది. ఎమ్మెల్యే కారుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఇలా తన పార్టీ ఎమ్మెల్యే వాహనంపై దాడి జరిగిన వెంటనే డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు.

అవును... సోమవారం రాత్రి బర్రింకలపాడు నుంచి జీలుమిల్లి బయలుదేరారు ఎమ్మెల్యే బాలరాజు. ఈ నేపథ్యంలో... నాలుగు కూడలి దగ్గరకు ఆ వాహనం రాగానే కొంతమంది గుర్తుతెల్లియని వ్యక్తులు ఆ వాహనంపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆ కారు వెనుక అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో... తన వాహనంపై జరిగిన దాడిపై ఎమ్మెల్యే బాలరాజు స్పందించారు.

ఇందులో భాగంగా... ఆ రాళ్లదాడి జరిగిన సమయంలో కారులో తాను లేనని, తాను సురక్షితంగానే ఉన్నట్లు బాలరాజు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి, దాడి చేసినవారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ దాడి స్థానికంగా కలకలం రేపింది.

ఇక బాలరాజు వాహనంపై చోటు చేసుకున్న రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. దాడి సమయంలో ఎమ్మెల్యే బాలరాజు వాహనంలో లేకపోవడం వల్ల ఎలాంటి హానీ జరగలేదని అన్నారు. ఈ దాడికి కారణమైన వారిని పోలీసులు తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలీసులు రంగంలోకి దిగారని తెలుస్తోంది.

Full View
Tags:    
  • Andhrapradesh 
  • Chirribalaraju 
  • Janasena 
  • Mla 
  • Pawankalyan 
  • Deputychiefminister 
  • Politicalnews 

Similar News

బీజేపీ చేతికి బ్లాంక్ చెక్...రాహుల్ మాటల్లో అంతరార్థం ?

2026-11-29 02:33 GMT

రాహుల్ నోట తొలిసారి జగన్ మాట !

2026-11-29 02:32 GMT

జర్మనీ నుంచి వచ్చాడు.. 99 లక్షలు పాడాడు.. సర్పంచ్ అయ్యాడు..

2026-11-29 02:31 GMT

జ‌న‌సేన‌లో బాలరాజు గోల‌.. మార్పు త‌ప్ప‌దు స‌ర్‌!

2026-11-29 02:28 GMT

టోల్ ప్లాజాల వ‌ద్ద‌ తోల్ తీస్తారు.. నంబర్ ప్లేట్లు దాస్తే 5 రెట్లు జరిమానా

2026-11-29 01:30 GMT

'అతి' విశ్వాసం.. కూటమికి ఇబ్బందేనా.. ?

2026-11-29 01:30 GMT

మేనిఫెస్టోపై జ‌గ‌న్ ఎక్స‌ర్‌సైజ్‌.. ఈ సారి ఉచితాలు త‌క్కువేనా..?

2026-11-29 00:30 GMT

వైసీపీ ఎంపీకి సాయిరెడ్డి 'ఫోన్‌ ఇన్విటేష‌న్‌'.. !

2026-11-28 23:30 GMT

జ‌గ‌న్ సెంట్రిక్‌గా తెలంగాణ రాజ‌కీయం... బెనిఫిట్టేనా.. ?

2026-11-28 22:30 GMT

టీడీపీ నుంచి బీజేపీలోకి.. మ‌ళ్లీ టీడీపీలోకి.. అన్నంవారి పాట్లు

2026-11-28 19:30 GMT

మోడీ మంత్రం: కాద‌న్న‌వారే.. క‌లిసి వ‌చ్చారు..!

2026-11-28 18:30 GMT

ముగ్గురు పిల్లల్ని కంటే రూ.50 లక్షలు.. త్వరపండి.. ప్రభుత్వ ఆఫర్

2026-11-28 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS