• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  టీడీపీ నుంచి బీజేపీలోకి.....

టీడీపీ నుంచి బీజేపీలోకి.. మ‌ళ్లీ టీడీపీలోకి.. అన్నంవారి పాట్లు

| మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ తిరిగి టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు బాపట్ల రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. గతంలో బీజేపీలో చేరిన ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తాజాగా పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేయడం ఈ ఊహాగానాలకు బలమిచ్చింది. ఆయన చేరికపై మంత్రి నారా లోకేష్ స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

By - Garuda Media
Update: 2026-11-28 19:30 GMT

మాజీ ఎమ్మెల్సీ.. బాప‌ట్ల జిల్లాకు చెందిన అన్నం స‌తీష్ ప్ర‌భాక‌ర్ రూటు మార్చుతున్నారా? ఆయ‌న తిరిగి టీడీపీ వైపు చూస్తున్నారా? అంటే.. అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. వాస్త‌వానికి టీడీపీతోనే రాజ‌కీయ అరంగేట్రం చేసిన అన్నం.. 2014, 2019 అసెంబ్లీ ఎన్నిక్ల‌లో బాప‌ట్ల టికెట్ కూడా ద‌క్కించుకున్నారు. అయితే.. స్వ‌ల్ప తేడాతో ఆయ‌న పరాజ‌యం పాల‌య్యారు. అనంత‌రం.. ఆయ‌నకు వ్యాపార భాగ‌స్వామిగా ఉన్న ఓ కీల‌క నాయ‌కుడు, ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఓ నేత‌తో క‌లిసి.. బీజేపీ పంచ‌న చేరిపోయారు.

వాస్త‌వానికి ఆ స‌మ‌యంలోనే టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ‌ద్ద‌ని వారించారని పార్టీ వ‌ర్గాలు గుర్తు చేస్తున్నాయి. కానీ, అన్నం మాత్రం దూకుడుగా బీజేపీ కండువా క‌ప్పుకొన్నారు. కానీ ఆయ‌నకు వ్య‌క్తిగ‌తంగా ఇమేజ్ లేక‌పోవ‌డం.. బీజేపీ బాప‌ట్ల‌ ప‌రిధిలో పుంజుకోక‌పోవడంతో దిక్కులు చూసే పరిస్థితి ఏర్ప‌డింది. మ‌రోవైపు.. టీడీపీ పుంజుకోవ‌డం.. మ‌రోసారి కూడా కూట‌మి అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో అన్న‌వారు రూటు మార్చుతున్నార‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో అన్నం ప్ర‌భాక‌ర్‌.. టీడీపీ అనుకూల ప్ర‌చారం చేయ‌డంపార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీసింది. నిజానికి గ‌త కొంత‌కాలంగా ఆయ‌న బీజేపీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవ‌ల ఆ పార్టీకి రాజీనామా కూడా చేశాన‌ని ప్ర‌క‌టించారు. కానీ, దీనిపై బీజేపీ ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. పార్టీ ప‌రంగా అన్నంకు ప్రాధాన్యం లేకుండా పోవ‌డం.. కీల‌క నాయ‌కులు ఎవ‌రూ ఆయ‌న‌ను బ‌ల‌ప‌ర‌చ‌క‌పోవ‌డం వంటివి అన్నంకు క‌మ‌లం పార్టీలో క‌ల‌క‌లం రేపేలా చేస్తున్నాయ‌ని అంటున్నారు. అందుకే పార్టీకి రాజీనామా చేశార‌ని చెబుతున్నారు.

ఇక‌, ఇప్పుడు అన్నం చూపు మ‌రోసారిటీడీపీ వైపు ప‌డింద‌ని చెబుతున్నారు. అయితే.. ప్ర‌స్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వేగేశ్న న‌రేంద్ర వ‌ర్మ‌.. అన్నంను పార్టీలోకి తీసుకునే విషయంపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారని తెలుస్తోంది. అన్నంను పార్టీలోకి తీసుకువ‌చ్చే చ‌ర్య‌ల‌పై ఆయ‌న ఆగ్ర‌హంతో ఉన్నార‌ని అంటున్నారు. కానీ, బ‌ల‌మైన ఓ నేత మ‌ద్ద‌తుతో అన్నం తెర‌చాటు ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో విష‌యం మంత్రి నారా లోకేష్ వ‌ర‌కు వెళ్లింద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం దీనిపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని.. త్వ‌ర‌లోనే నిర్ణ‌యం ఉంటుంద‌ని అంటున్నారు.

Tags:    
  • annamsatishprabhakar 
  • tdp 
  • bjp 
  • bapatla 
  • naralokesh 
  • chandrababu 

Similar News

సేనానీ...యాక్షన్ కి దిగాల్సిందే !

2026-11-29 19:30 GMT

టీడీపీ వ‌ర్గ‌పోరుతో గ‌న్న‌వ‌రం కుత‌కుత‌!

2026-11-29 16:30 GMT

110 ఏళ్ల వయసులోనూ ఓటు.. చంద్రబాబు ప్రశంసలు అందుకున్న రాఘవమ్మ!

2026-11-29 15:50 GMT

ఇది చారిత్ర‌క ఘ‌ట్టం.. మిస్‌కావొద్దు: చంద్ర‌బాబు

2026-11-29 15:50 GMT

పంచాయతీ పోలింగ్ ర‌చ్చ‌ర‌చ్చ‌!

2026-11-29 15:49 GMT

మూడు రోజులు ఏపీలోనే మోడీ!

2026-11-29 15:43 GMT

అమరావతి భవిష్యత్తుకు అంతర్జాతీయ విద్యా బాట.. రూ.100 కోట్లతో ఇంగ్లండ్ దిగ్గజ పాఠశాల

2026-11-29 12:58 GMT

ఆరు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం.. ఎంపీగా ఐదుసార్లు విజయం.. తెరమరుగైన రాయపాటి శకం

2026-11-29 10:57 GMT

శ్రీకాకుళం మేయర్ సీటు... మాదే అంటున్న వైసీపీ...కూటమి !

2026-11-29 03:54 GMT

రాహుల్ నోట తొలిసారి జగన్ మాట !

2026-11-29 02:32 GMT

జర్మనీ నుంచి వచ్చాడు.. 99 లక్షలు పాడాడు.. సర్పంచ్ అయ్యాడు..

2026-11-29 02:31 GMT

జ‌న‌సేన‌లో బాలరాజు గోల‌.. మార్పు త‌ప్ప‌దు స‌ర్‌!

2026-11-29 02:28 GMT

Copyright @2026

Powered by Blink CMS