• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  రాహుల్ నోట తొలిసారి జగన్...

రాహుల్ నోట తొలిసారి జగన్ మాట !

| డీలిమిటేషన్ బిల్లుపై మీడియా సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలిసారి వైసీపీ అధినేత జగన్ పేరును ప్రస్తావించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం జగన్, చంద్రబాబు సహా ప్రాంతీయ పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కీలక సమయంలో వైసీపీ మద్దతు పొందడంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండగా, జగన్‌ను తమవైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి. రాహుల్ వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహం ఉందా అనే చర్చ మొదలైంది.

By - Satya P
Update: 2026-11-29 02:32 GMT

కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నోట తొలిసారి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మాట వినిపించింది. ఇది రాజకీయంగా చూస్తే ఆసక్తిని పెంచుతోంది. విషయం డీలిమిటేషన్ బిల్లు గురించి అయినా ఒక ప్రెస్ మీట్ లో రాహుల్ జగన్ గురించి పేరు పెట్టి మాట్లాడడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నదే అందరిలోనూ చర్చగా ఉంది. నిజానికి 2009లో కాంగ్రెస్ ఎంపీగా జగన్ ఉన్నారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ ని వీడి బయటకు వచ్చేశారు. ఇక కాంగ్రెస్ గురించి కానీ రాహుల్ సోనియా గాంధీల గురించి కానీ జగన్ ఎప్పుడూ బాహాటంగా మాట్లాడింది లేదు, అలాగే గాంధీ కుటుంబం కూడా జగన్ గురించి ఓపెన్ ఫ్లాట్ ఫారాలలో ఎక్కడా ప్రస్తావించినది కూడా లేదు. కానీ ఇపుడే ఎందుకు జగన్ పేరుని రాహుల్ తీసుకుని వచ్చారు అన్నదే ఇక్కడ చూడాల్సిన విషయంగా అంటున్నారు.

మోడీ షాల వ్యూహం :

ఎన్డీయే పార్టీలు అన్నీ కూడా ఎటూ ఆ వైపే ఉంటాయి. ఆదే సమయంలో జగన్ నాయకత్వంలోని వైసీపీ లాంటి తటస్థ పార్టీలు ఏ వైపునకు అయినా టర్న్ అయ్యే చాన్స్ ఉంది. కానీ వైసీపీ ఎపుడూ కాంగ్రెస్ వైపు రాలేదు, దానికి కారణాలు ఆ పార్టీ సైడ్ నుంచి ఉన్నా కూడా కలుపుకుని పోయే ప్రయత్నం పెద్దన్నగా ఇండియా కూటమి నాయకత్వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ కి ఉంది కదా అన్నది కూడా ఇక్కడ ప్రశ్న. అలా చూసుకున్నపుడు ఏనాడు వైసీపీని కాంగ్రెస్ ఖాతరు చేయలేదు అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అదే సమయంలో తమ పక్షం కానప్పటికీ కీలక సమయంలో వైసీపీ మద్దతుని బీజేపీ ఎలా పొందుతోంది అన్నది ఇక్కడ ప్రధాన పాయింట్. అక్కడే నరేంద్ర మోడీ అమిత్ షాల వ్యూహం ఉందని కూడా చెప్పుకోవాలి. మరి ఇండియా కూటమితో పాటుగా ఇతర పక్షాల మద్దతు కూడగట్టడంలో రాహుల్ ఎక్కడ వైఫల్యం చెందారు అన్నది కూడా చర్చనీయాంశంగానే ఉంది అంటున్నారు.

కలిసి రావాలంటూ :

అయితే అంతా అయిపోయాక రాహుల్ గాంధీ ఒక మీడియా సమావేశం పెట్టి జగన్ చంద్రబాబు కలిసి రావాలని పిలుపు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉందా అన్నదే ఇక్కడ మరో ప్రశ్న. రాజ్యాంగ విలువల రక్షణ కోసం ప్రాంతీయ పార్టీలు అన్నీ చేతులు కలపాలని రాహుల్ ఓపెన్ గానే పిలుపు ఇచ్చారు. అందులో తప్పు లేదు, పైగా ఇండియా కూటమి డీలిమిటేషన్ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మరి ఈ సమయంలో ఆ పార్టీ ఇంత కాలం ఏమి చేసింది అన్నదే ఇక్కడ అంతా ఆలోచిస్తున్న విషయం. బీజేపీ ఏప్రిల్ లో బిల్లు వీగిన మరు క్షణం నుంచి కసరత్తు మొదలెట్టి సుమారు ఏడు నెలల తరువాత పూర్తి మెజారిటీ సాధించి మరీ ఇపుడు బిల్లుని లోక్ సభలో ప్రవేశపెడుతోంది. మరి ఆనాడు బిల్లుని సక్సెస్ ఫుల్ గా అడ్డుకున్న ఇండియా కూటమి తమ బలాని మరింత పెంచుకుని కనీసం న్యూట్రల్ పార్టీలను అయినా కలుపుకుని పోవాలని ఎందుకు వ్యూహాత్మకంగా ఆలోచన చేయలేదు అన్నది ఒక ప్రశ్న.

ఉపద్రవం ఏమిటో :

అదే సమయంలో టీవీకేతో ఎన్నికల అనంతరం స్నేహం చేసిన కాంగ్రెస్ 22 ఎంపీ సీట్లు ఉన్న డీఎంకేని అలా చేయి వదిలేయడం వల్ల కలిగిన ఉపద్రవం ఏమిటో ఇపుడు కళ్లారా చూడబోతోంది అని అంటున్నారు. మొత్తానికి ఇక్కడ డీలిమిటేషన్ బిల్లు నెగ్గిందా లేదా అన్నది కాదు, బీజేపీ వ్యూహాల ముందు కాంగ్రెస్ రాహుల్ వ్యూహాలు తేలిపోతున్నదే అంతా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఇండియా కూటమికి కాంగ్రెస్ కి కనుక బీజేపీని మోడీని ఓడించాలనుకుంటే తమ బలాన్ని మరింత పెంచుకోవడం జగన్ లాంటి వారిని కలుపుకుని పోవడం డీఎంకే లాంటి పార్టీలతో స్నేహాన్ని కొనసాగించడం చేసి ఉండాల్సింది అని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ మాట రాహుల్ అన్నారు అంటే రేపటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    
  • rahulgandhi 
  • ysjaganmohanreddy 
  • ysrcp 
  • congress 
  • delimitationbill 
  • chandrababu 

Similar News

జర్మనీ నుంచి వచ్చాడు.. 99 లక్షలు పాడాడు.. సర్పంచ్ అయ్యాడు..

2026-11-29 02:31 GMT

జ‌న‌సేన‌లో బాలరాజు గోల‌.. మార్పు త‌ప్ప‌దు స‌ర్‌!

2026-11-29 02:28 GMT

'అతి' విశ్వాసం.. కూటమికి ఇబ్బందేనా.. ?

2026-11-29 01:30 GMT

మేనిఫెస్టోపై జ‌గ‌న్ ఎక్స‌ర్‌సైజ్‌.. ఈ సారి ఉచితాలు త‌క్కువేనా..?

2026-11-29 00:30 GMT

వైసీపీ ఎంపీకి సాయిరెడ్డి 'ఫోన్‌ ఇన్విటేష‌న్‌'.. !

2026-11-28 23:30 GMT

జ‌గ‌న్ సెంట్రిక్‌గా తెలంగాణ రాజ‌కీయం... బెనిఫిట్టేనా.. ?

2026-11-28 22:30 GMT

టీడీపీ నుంచి బీజేపీలోకి.. మ‌ళ్లీ టీడీపీలోకి.. అన్నంవారి పాట్లు

2026-11-28 19:30 GMT

ట్రెండీ టాక్: పల్లె రాజకీయాల్లో టాలీవుడ్ తార‌ల‌ హంగామా

2026-11-28 17:00 GMT

వైసీపీలోనే ఇంత ఆశ్చ‌ర్య‌మా... ?

2026-11-28 16:50 GMT

రాధా ప్ర‌యాణం.. కొంత‌ క‌లివిడి - మ‌రింత విడివిడి.. !

2026-11-28 16:40 GMT

'యువ సార‌థ్యం' టీడీపీకి క‌లిసి వ‌చ్చిందా.. !

2026-11-28 16:40 GMT

Copyright @2026

Powered by Blink CMS