• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  Krishna >  టీడీపీ వ‌ర్గ‌పోరుతో...

టీడీపీ వ‌ర్గ‌పోరుతో గ‌న్న‌వ‌రం కుత‌కుత‌!

| టీడీపీకి కంచుకోటగా ఉన్న గన్నవరంలో ఇప్పుడు అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, పార్టీలోని ఇతర వర్గాల మధ్య సమన్వయం కొరవడిందనే చర్చ సాగుతోంది. ఇటీవల స్థానిక, పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ వెనుకబడటానికి వర్గపోరే కారణమని స్థానికంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోపు విభేదాలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందనే చర్చ పార్టీ వర్గాల్లో ఉంది.

By - Garuda Media
Update: 2026-11-29 16:30 GMT

టీడీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉమ్మ‌డి కృష్నా జిల్లాలోని గ‌న్న‌వ‌రం ముందు వ‌రుస‌లో ఉంటుంది. టీడీపీ హిస్ట‌రీలో ఈ నియోజ‌క‌వ‌ర్గం ఒక కంచుకోట‌గా ఉంది. ఆది నుంచి కూడా ఇక్క‌డ టీడీపీనే గెలుపుగుర్రం ఎక్కుతోంది. అభ్య‌ర్థులు మారిన‌ప్ప‌టికీ.. టీడీపీ స్థాపించిన 1983 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఒకే ఒక్క‌సారి కాంగ్రెస్ పార్టీ విజ‌యం ద‌క్కించుకుంది. ఇక‌, అన్ని ఎన్నిక‌ల్లోనూ టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. చివ‌ర‌కు 2019లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచిన సంద‌ర్భంలో కూడా.. ఇక్క‌డ టీడీపీ నే విజ‌యం సాధించింది.

అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు సొంత పార్టీలోనే విభేదాలు తెర‌మీదికి వ‌చ్చాయి. ఫ‌లితంగా పార్టీ వీక్ అవుతోం దన్న చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. గ‌త ఏడాది వైసీపీ నుంచి వ‌చ్చిన యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావుకు అవ‌కాశం ఇచ్చారు. ఆయ‌న కూట‌మి హోరులో విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉన్న‌ప్ప‌టికీ.. పార్టీ ప‌రంగా ముఖ్యంగా కూట‌మి ప‌రంగా కూడా ఎమ్మెల్యేకు మార్కులు త‌క్కువ‌గానే ప‌డుతున్నాయి. పైగా.. ఈ నెల‌లో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌లు, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లోనూ టీడీపీ ప్ర‌భావం చూపించ‌లేక పోయింది.

ఇక‌, రెండు రోజుల కింద‌ట జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ టీడీపీ త‌న ప్ర‌త్య‌ర్థి వైసీపీ కంటే కూడా మూడు పంచా య‌తీల్లో వెనుక‌బ‌డింది. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై స్థానికంగా పార్టీ త‌ర‌ఫున ఎవ‌రి వాద‌న వారికి ఉన్న‌ప్ప‌టికీ.. అంతిమంగా పార్టీకి అయితే.. న‌ష్టం వాటిల్లింద‌న్న‌ది వాస్త‌వం. ఇక‌, అస‌లు విష‌యానికి వ‌స్తే.. పార్టీలో వ‌ర్గ పోరు పెరిగిపోయింద‌న్న‌ది అంద‌రూ చెబుతున్న‌మాట‌. మాజీ ఎమ్మెల్యే, ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్న వంశీని వ్య‌తిరేకించిన వారు కూడా.. ఇప్పుడు ఆయ‌న‌తో అంత‌ర్గ‌తంగా క‌లివిడిగా ఉంటున్నార‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం.

అంతేకాదు.. ఎమ్మెల్యేగా ఉన్న యార్ల‌గ‌డ్డ వెంక‌ట‌రావుపై పెద్ద‌గా ఎవ‌రూ దృష్టి పెట్ట‌డం లేదు. దీనికి కార‌ణం.. ఈయ న గ‌త వాస‌న‌లు వ‌దులుకోలేదని, వైసీపీ నాయ‌కుల‌తో అంత‌ర్గ‌తంగా ఆయ‌న ట‌చ్‌లో ఉన్నార‌ని అంటున్నారు. ఏతావాతా ఎలా చూసుకున్నా.. ఇరు ప‌క్షాల్లోనూ ఏదో తెలియ‌ని అభ‌ద్ర‌తా భావం అయితే.. క‌నిపిస్తోంది. టీడీపీలోనే ఉన్న వారిలో వ‌ర్గాలుగా ఏర్ప‌డ‌డం.. ఎమ్మెల్యేపైనే విమ‌ర్శ‌లు చేయ‌డం ఒక ఒంతైతే.. మ‌రో వ‌ర్గం.. వైసీపీకి అనుకూలంగా ఉండ‌డం మ‌రో ప‌రిణామం. వెర‌సి.. గ‌న్న‌వరం నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ర్గం పోరు ఎక్కువ‌గానే సాగుతోంద‌ని అంటున్నారు. ఒక‌ప్పుడు బ‌ల‌మైన టీడీపీ గ్రామాలుగా ముద్ర ప‌డిన చోట కూడా.. తాజాగా వైసీపీ జెండా ఎగ‌ర‌డం దీని ప్ర‌భావ‌మేన‌ని స్థానికులు చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల లోపు ఈ ప‌రిస్థితిని స‌రిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు తేల్చి చెబుతున్నాయి.

Tags:    
  • tdp 
  • gannavaram 
  • yarlagaddavenkatarao 
  • andhrapolitics 
  • tdpinternalissues 

Similar News

రెండో విడత మున్సిపోల్స్ : అందరి దృష్టి గుడివాడపైనే.. మాటల నాని చేతల్లో చూపగలరా..?

2026-11-16 19:03 GMT

యార్ల‌గ‌డ్డ‌కు లోకేష్ మ‌ద్ద‌తు.. గ‌న్న‌వ‌రంలో యూట‌ర్న్‌..!

2026-11-15 20:41 GMT

ఎన్నిక‌లు ముగిశాయి.. టీడీపీలో గొడ‌వ‌లు పెరిగాయి!

2026-11-13 15:30 GMT

కొడాలికి లోకల్ షాక్.. గుడివాడలో తొలిసారి టీడీపీ ఇలా..

2026-11-08 13:34 GMT

బెజ‌వాడ మేయ‌ర్‌: 'భాగ్యం' తక్కువేనమ్మా.. !

2026-10-31 04:36 GMT

గుడివాడ లోక‌ల్ వార్‌లో పొలిటిక‌ల్ మంట‌లు.. !

2026-10-27 22:30 GMT

వల్లభనేని వంశీ 2.0.. మళ్లీ మొదలు పెట్టేసిన మాజీ ఎమ్మెల్యే!

2026-10-15 09:15 GMT

అభిజిత్ : ఆ సమయంలో ఏం జరిగింది ?

2026-10-12 03:49 GMT

జ‌య‌ము క‌లిగేనా.. జ‌య‌మంగ‌ళా ..?

2026-08-12 11:34 GMT

మండలి ఆవేదన ఆలోచించాల్సిందేగా !

2026-07-05 18:30 GMT

మావిగన్ తో పందెం...అమరావతికి దూరం

2026-05-23 04:02 GMT

Copyright @2026

Powered by Blink CMS