అభిజిత్ : ఆ సమయంలో ఏం జరిగింది ?
ఓట్ల నమోదులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ జాతీయ ఎన్నికల కమీషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో సీజేపీ అధినేత అభిజిత్ దీప్కే ఆందోళన చేసేందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఓట్ల నమోదులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ జాతీయ ఎన్నికల కమీషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో సీజేపీ అధినేత అభిజిత్ దీప్కే ఆందోళన చేసేందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే శాంతిభద్రతలకు ఆటంకం కలుగుతుందన్న ఉద్దేశంతో పోలీసులు ఇందిరాగాంధీ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టులో ఆయన విమానం దిగకముందే అదుపులోకి తీసుకున్నారు.
అయితే అభిజిత్ ఢిల్లీ పర్యటనలో ఉండగా మహారాష్ట్ర హింగోలి జిల్లా సంతుక్ పింప్రి గ్రామంలో దీర్ఘకాల అనారోగ్యంతో ఉన్న అభిజిత్ నానమ్మ సావిత్రీబాయి శంకర్రావు దీప్కే (85) అక్టోబర్ 10 ఉదయం 11.30 గంటలకు మరణించింది. అప్పటికే అభిజిత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులకు అభిజిత్ నానమ్మ మరణవార్త తెలిసిన వెంటనే ఏ సమయంలో అంత్యక్రియలు జరగబోతున్నాయి ? అన్న విషయం అతనికి చెప్పినట్లు ఢిల్లీ ఏసీపీ నేహయాదవ్ వెల్లడించారు. అతను ఊరికి వెళ్లి, అంత్యక్రియలకు హాజరు కావడానికి విమానం లేదా రైలు లేదా ఇతర ఏర్పాట్లు చేసినా అభిజిత్ తిరస్కరించారంటూ ఈ మేరకు ఒక వీడియో కూడా విడుదల చేశారు. తాము సహాయం చేస్తామని చెప్పినా, ఫోన్ మాట్లాడమని చెప్పినా అభిజిత్ నిరాకరించాడని వారు చెబుతున్నారు. ఈ సమాచారం ఇప్పుడు సంచలనం రేపుతున్నది. అభిజిత్ ఈ విషయంలో అడ్డంగా దొరికిపోయాడని అంటున్నారు.
అయితే సీజేపీ మరియు అభిజిత్, వారి కుటుంబ సభ్యుల వాదన మరోవిధంగా ఉంది. పోలీసులు వీడియో ఆధారంగా అబద్దాలు క్లెయిమ్ చేస్తున్నారని, పొలీసుల అదుపులో ఉన్న సమయంలో కనీసం ఫోన్ ఇవ్వలేదని, న్యాయవాదితో, సోదరుడితో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, ఉదయం 3.30 గంటలకు లేపి అరెస్టు పత్రాల మీద సంతకం పెట్టాలని వత్తిడి చేశారని, నానమ్మ చనిపోయిన దుఃఖంలో తల్లిదండ్రులకు అరెస్టు విషయం చెప్పాలని వత్తిడి చేయడంతో పాటు, ఆలస్యంగా విడుదల చేయడం మూలంగానే అంత్యక్రియలకు హాజరయ్యే పరిస్థితి లేకుండా పోయిందని వారు చెబుతున్నారు.
విమానంలోనే పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన సమయంలో ‘నేను అరెస్టు కావడానికే వచ్చాను. ఇందిరాగాంధీ కూడా ఇలా చేయలేదు. డిక్టేటర్ షిప్ చేస్తున్నారు’ అని అభిజిత్ దీప్కే వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచిన సంధర్భంగా ‘50 వేల ష్యూరిటీ బాండ్ తో ఒక సంవత్సర్ శాంతిని కాపాడాలని, ప్రజలను ఒక దగ్గరకు తీసుకొచ్చే ప్రయత్నం చేయకూడదని’ న్యాయమూర్తి అన్నట్లు తెలుస్తుంది.