గుడివాడ లోక‌ల్ వార్‌లో పొలిటిక‌ల్ మంట‌లు.. !

ఏపీలో మున్సిపల్/స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గుడివాడలో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొడాలి నాని స్థానిక ఎన్నికల ప్రచారాన్ని, సన్నద్ధతను ముమ్మరం చేశారు.

Update: 2026-10-27 22:30 GMT

ఏపీ లో మున్సిపల్/స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గుడివాడలో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొడాలి నాని స్థానిక ఎన్నికల ప్రచారాన్ని, సన్నద్ధతను ముమ్మరం చేశారు. 2024 సాధారణ ఎన్నికల ఓటమి తర్వాత కొడాలి నాని ఈ స్థానిక సమరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గుడివాడ మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కొడాలి నాని వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో వరుసగా నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించారు.

పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్ని స్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పట్టు కోల్పోకుండా ఉండేందుకు, ఇతర పార్టీల నుంచి వైఎస్సార్‌సీపీ లోకి చేరికలను ప్రోత్సహిస్తూ తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సైతం కూటమి తరఫున మున్సిపాలిటీపై పట్టు సాధించేందుకు శ్రేణులను సిద్ధం చేస్తుండటంతో, గుడివాడలో కొడాలి నాని వర్సెస్ వెనిగండ్ల రాము అన్నట్లుగా రాజకీయం ఆసక్తికరంగా మారింది.

గుడివాడలో మున్సిపల్ ఎన్నికలు వంద శాతం జరుగుతాయని, ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఉన్నాయని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్పష్టం చేశారు. కానీ, ఈ క్ర‌మంలో మాజీ మంత్రి కొడాలి నాని చ‌క్రం తిప్ప‌డంతో.. గుడివాడలో ఏకగ్రీవాలు జరగలేదు. ఇది అధికార పార్టీకి కొంత మేర‌కు నిరాశ‌ను క‌లిగించింద‌నే చెప్పాలి. అయితే.. ఎన్నిక ల్లో విజ‌యం కోసం మాత్రం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. గుడివాడ మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తు తం 48 ఎన్నికల వార్డులు ఉన్నాయి. గతంలో ఇక్కడ 36 వార్డులు ఉండగా, పునర్విభజన ప్రక్రియలో భాగంగా వార్డుల సంఖ్య 48కి పెరిగింది.

రాజకీయంగా ఇక్కడ అధికార కూటమి తరఫున ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నేతృత్వంలోని క్యాడర్, వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీ తరఫున మాజీ మంత్రి కొడాలి నాని నేతృత్వంలోని క్యాడర్ తమ అభ్యర్థులను కాపాడుకోవ‌డంతోపాటు.. గెలుపు వ్యూహాల‌ను ర‌చిస్తున్నారు. గుడివాడ మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానం ఈసారి బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. దీంతో మ‌హిళా సెంట్రిక్‌గా ఇరు ప‌క్షాలు కూడా రాజ‌కీయాలను ముమ్మ‌రం చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే.. క్షేత్ర‌స్థాయిలో అభివృద్ధిని రాము ప్ర‌చారం చేస్తుండగా.. వైసీపీ త‌ర‌ఫున త‌న ఇమేజ్ కాపాడుతుంద‌ని కొడాలి నమ్ముతున్నారు. మొత్తంగా గుడివాడ‌లో రాజ‌కీయాలు హాట్ హాట్‌గా మారాయి.

Tags:    

Similar News