• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Overseas >  ముగ్గురు పిల్లల్ని కంటే...

ముగ్గురు పిల్లల్ని కంటే రూ.50 లక్షలు.. త్వరపండి.. ప్రభుత్వ ఆఫర్

| జపాన్‌లో తగ్గుతున్న జననాల రేటును పెంచేందుకు మూడో బిడ్డను కనే దంపతులకు 10 మిలియన్ యెన్లు (సుమారు రూ.50 లక్షలు) ఇచ్చే ప్రతిపాదన చర్చనీయాంశంగా మారింది. పెరుగుతున్న జీవన వ్యయం, ఉద్యోగ ఒత్తిళ్లతో యువత పిల్లలను కనడానికి ఆసక్తి చూపడం లేదు. ఆర్థిక ప్రోత్సాహకాలతో జనాభా క్షీణతను అడ్డుకోవాలని జపాన్ భావిస్తోంది.

By - A.N.Kumar
Update: 2026-11-28 17:30 GMT

ఒకప్పుడు మేమిద్దరం.. మాకిద్దరు అని గోడల మీద రాతలు రాయించిన ప్రభుత్వాలు.. ఇప్పుడు మీరిద్దరు.. మీకు ముగ్గురు.. కావాలంటే రూ.50 లక్షల క్యాష్ బ్యాక్ అంటూ బంపర్ ఆఫర్లు ప్రకటించే రోజులు వచ్చాయి. అవును సాంకేతికతలో ప్రపంచానికే పాఠాలు చెప్పే జపాన్.. ఇప్పుడు "పిల్లల్ని ఎలా కనాలి.. జనాభాను ఎలా పెంచాలి?" అనే ప్రాథమిక పాఠం దగ్గర ఆగిపోయింది. మూడో బిడ్డను కంటే ఏకంగా 10 మిలియన్ యెన్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.50 లక్షలు ఇవ్వాలనే ప్రతిపాదన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

జపాన్ పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ పసిపిల్లల ఏడుపుల కంటే వృద్ధుల దగ్గులే ఎక్కువగా వినిపిస్తున్నాయి. యువత పెళ్లి అంటేనే ఆమడదూరం పరుగెడుతున్నారు. పొరపాటున పెళ్లి చేసుకున్నా పిల్లలంటేనే భారం అనే భావనలో ఉండిపోయారు. దీంతో దేశాన్ని నడిపించడానికి భవిష్యత్తులో మనుషులే మిగలరేమోనన్న భయంతో ప్రభుత్వం ఈ కొత్త స్కీమ్ తెరపైకి తెచ్చింది. ఇప్పటికే ఇద్దరు పిల్లలతో అమ్మో, చాలు బాబోయ్ అని చేతులెత్తేసిన తల్లిదండ్రులకు.. మూడో బిడ్డ పేరుతో రూ.50 లక్షల ఆశ చూపిస్తోంది. ఇది వినడానికి ఏదో షాపింగ్ మాల్‌లో ఆషాఢం సేల్‌లా ఉన్నా.. జపాన్ పాలిట ఇది చావుబతుకుల సమస్య.

ఈ ఆఫర్ వినగానే చాలామందికి వావ్.. భలే ఛాన్స్.. అనిపించవచ్చు. కానీ అసలు కిటుకు ఇక్కడే ఉంది. జపాన్ ప్రభుత్వం ఇచ్చే ఆ రూ.50 లక్షలు చూడ్డానికి పెద్ద మొత్తమే కావచ్చు కానీ ఆ దేశంలో ఒక బిడ్డను పెంచి.. చదివించి.. ప్రయోజకుడిని చేయడానికి అయ్యే ఖర్చు ముందు ఇది సముద్రంలో కాకి రెట్టంత..

ఒకవైపు ఆకాశాన్నంటుతున్న జీవన వ్యయం.. మరోవైపు ఊపిరి సలపనివ్వని ఉద్యోగ ఒత్తిళ్లు. ఆఫీసులో బాస్ తిట్లు.. ఇంట్లో పిల్లల బాధ్యతలు.. వీటి మధ్య నలిగిపోతున్న జపాన్ యువతకు.. ఆ రూ.50 లక్షలు ఆకలితో ఉన్నవాడికి ఇచ్చిన లాలిపాప్ లాగే కనిపిస్తున్నాయి.

ఏఐ, రోబోటిక్స్‌లో జపాన్ నంబర్ వన్ కావచ్చు. మనుషులు చేసే పనులన్నీ యంత్రాలే చేస్తున్నాయి. కానీ ఆ రోబోలను తయారు చేయడానికి వాటికి బటన్లు నొక్కడానికి.. అన్నింటికంటే ముఖ్యంగా దేశంలో పన్నులు కట్టడానికి మనుషులు కావాలి కదా.. యంత్రాలు పనిచేస్తాయి కానీ పిల్లల్ని కనలేవు, దేశ జనాభా లెక్కల్ని మార్చలేవు. అందుకే ఇప్పుడు అక్కడి పాలకులకు మానవ వనరుల విలువ తెలిసొచ్చింది.

నిన్నటిదాకా జనాభా పెరిగిపోతోందని నెత్తీనోరూ బాదుకున్న ప్రపంచం.. నేడు జనాభా తగ్గిపోతోందని డబ్బుల సంచులు పట్టుకుని తిరుగుతోంది. పిల్లలు దేశానికి భవిష్యత్తు కావచ్చు.. కానీ తల్లిదండ్రులకు మాత్రం అది జీవితకాలపు బాధ్యత. ఉద్యోగ భద్రత.. తక్కువ ఖర్చుతో విద్య.. ప్రశాంతమైన జీవితం ఇవ్వకుండా.. కేవలం రూ.50 లక్షల ప్యాకేజీ ఇచ్చి పిల్లల్ని కనమంటే జపాన్ యువత నవ్వి ఊరుకుంటుందే తప్ప ఆసుపత్రుల ముందు క్యూ కట్టదు..

Tags:    
  • japan 
  • japanpopulationcrisis 
  • birthrate 
  • thirdchild 
  • populationdecline 

Similar News

హవ్వా.. అమెరికన్లకు ఎంత గతి పట్టింది.. టాయిలెట్ పేపర్ల కోసం పాకులాట..

2026-11-26 17:25 GMT

ఇరాన్‌తో మళ్లీ యుద్ధం తప్పదా?.. ఇజ్రాయెల్ జ్యోతిష్యుల సంచలన అంచనాలు!

2026-11-26 08:55 GMT

తెలుగు విద్యార్థిని శ్రీజ ఎక్కడ? 20 రోజులుగా కనిపించని జాడ.. అసలేమైంది?

2026-11-25 17:54 GMT

పంది కిడ్నీతో ఏడాది గడిపిన మహిళ.. డయాలసిస్ అవసరం లేకుండా!

2026-11-25 17:53 GMT

భారత్‌కు ట్రంప్ మరో షాక్.. ఎగుమతులపై కొత్త టారిఫ్‌ల ప్రతిపాదన!

2026-11-25 17:53 GMT

అమెరికా కల ఎంత గొప్పదైనా.. చిన్నారుల ప్రాణాల కంటే గొప్పది కాదు...

2026-11-25 13:13 GMT

అమెరికా కల చెదిరిందా? భారతీయ టెక్కీల గుండెల్లో ఐబీఎం పెట్టిన 'డిసెంబర్ 31' పిడుగు

2026-11-25 12:51 GMT

యూఏఈలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి.. మృతుల్లో భారతీయులు!

2026-11-25 04:22 GMT

సింధూ దేశ్ ఉద్యమం షురూ.. మరోసారి ముక్కలయ్యే దిశగా పాకిస్తాన్..?

2026-11-24 18:20 GMT

మరణశిక్ష ఎదుర్కొంటున్నా వెనక్కి తగ్గని షేక్ హసీనా.. డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు రీ ఎంట్రీ

2026-11-24 18:02 GMT

ఆస్కార్ రేసులో చిన్న సినిమా.. అసలు పోటీ ఇప్పుడే!

2026-11-24 12:46 GMT

Copyright @2026

Powered by Blink CMS