• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Overseas >  తెలుగు విద్యార్థిని శ్రీజ...

తెలుగు విద్యార్థిని శ్రీజ ఎక్కడ? 20 రోజులుగా కనిపించని జాడ.. అసలేమైంది?

| అమెరికాలో చదువుకుంటున్న తెలంగాణ యువతి కోయ శ్రీజ అదృశ్యమై 20 రోజులు దాటినా ఆచూకీ లభించలేదు. నవంబర్ 2న బోస్టన్‌లో కనిపించకుండా పోయిన ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు, ఆధారాలు లేని పుకార్లను సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీజ ఆచూకీ కోసం భారత కాన్సులేట్, విదేశాంగ శాఖ, బోస్టన్ పోలీసులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు.

By - A.N.Kumar
Update: 2026-11-25 17:54 GMT

అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన తెలంగాణ యువతి కోయ శ్రీజ అదృశ్యమై 20 రోజులు దాటిపోయింది. కన్నకూతురి ఆచూకీ కోసం ఒక తల్లి కన్నీళ్లతో ఎదురుచూస్తుంటే.. మన వ్యవస్థలు.. సోషల్ మీడియా మాత్రం ఎప్పటిలాగే తమ బాధ్యతలను అత్యంత వేగంగా.. అద్భుతంగా నిర్వర్తిస్తున్నాయి..

ప్రపంచానికే టెక్నాలజీ పాఠాలు నేర్పే అమెరికాలో.. అదీ బోస్టన్ లాంటి నగరంలో ఒక విద్యార్థిని నవంబర్ 2న అదృశ్యమైతే 20 రోజుల తర్వాత కూడా పోలీసుల వద్ద ఉన్న సమాచారం ఏంటో తెలుసా? ఆమె నల్లటి జాకెట్.. నీలం రంగు జీన్స్ వేసుకుంది.. కార్సన్ బీచ్ వైపు వెళ్లి ఉండవచ్చు అంటూ రోటీన్ సమాధానమే ఇస్తున్నారు.. అబ్బా.. ఏం దర్యాప్తు.. శాటిలైట్లు.. అడుగడుగునా సీసీ కెమెరాలు.. ఫోన్ ట్రాకింగ్‌లు ఉన్న ఈ కాలంలో కూడా ఒక మనిషి జాడ తెలియడానికి మూడు వారాలు సరిపోవడం లేదంటే అమెరికా టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు.

అసలు విషయం ఏంటో పోలీసులకే తెలియక తలలు పట్టుకుంటుంటే మన సోషల్ మీడియా మేధావులు మాత్రం అప్పుడే కేసును క్లోజ్ చేసేశారు. ఫలానా చోట మృతదేహం దొరికింది.. అది శ్రీజదే కానీ పోలీసులు చెప్పడం లేదు అంటూ ఎలాంటి ఆధారాలు లేని పుకార్లను రాకెట్ వేగంతో షేర్ చేస్తున్నారు. ఒక తల్లి కడుపుకోతతో అల్లాడుతుంటే.. ఆ వేదనను మరింత పెంచేలా బ్రేకింగ్ న్యూస్ ల పేరుతో వీరు చేస్తున్న వికృత క్రీడ చూస్తుంటే.. అసలు మనుషుల్లో కనీస మానవత్వం మిగిలి ఉందా అన్న సందేహం కలుగుతోంది.

ఇక మన పాలకుల విషయానికి వస్తే.. ఎప్పటిలాగే ఒక ట్వీట్.. ఒక ప్రెస్ నోట్‌తో తమ కర్తవ్యాన్ని పూర్తి చేశారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ.. భారత కాన్సులేట్.. విదేశాంగ శాఖ బోస్టన్ పోలీసులు సమన్వయంతో పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని ప్రకటించారు. దౌత్యపరమైన ఒత్తిడి.. అత్యవసర బృందాల పంపిణీ లాంటి కఠిన చర్యల దిశగా ప్రభుత్వాలు ఒత్తిడిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నవంబర్ 1 రాత్రి తల్లితో ఎంతో సంతోషంగా మాట్లాడి తన పుట్టినరోజు వేడుకల గురించి ప్లాన్ చేసుకున్న శ్రీజ ఒక్క రాత్రిలో ఎక్కడికి మాయమైంది? ఆమె ఫోన్ ఎందుకు స్విచ్ఛాఫ్ అయింది? ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఒకవైపు కన్నబిడ్డ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న కుటుంబం.. మరోవైపు పుకార్లతో వ్యూస్ పెంచుకుంటున్న డిజిటల్ రాబందులు.. ఇంకోవైపు ప్రకటనలకే పరిమితమైన అధికార యంత్రాంగం.. ఈ ట్రయాంగిల్ మధ్యలో శ్రీజ ఆచూకీ అనే అసలు ప్రశ్న మాత్రం సమాధానం లేకుండా గాల్లోనే వేలాడుతోంది. కనీసం ఇప్పుడైనా పుకార్లు ఆపి.. అధికారిక యంత్రాంగం నిద్రలేచి ఆ తల్లి కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేస్తుందేమో చూడాలి..

Tags:    
  • sreejakoya 
  • koyasreeja 
  • telanganastudent 
  • missingstudent 
  • bostonmissingcase 

Similar News

పంది కిడ్నీతో ఏడాది గడిపిన మహిళ.. డయాలసిస్ అవసరం లేకుండా!

2026-11-25 17:53 GMT

భారత్‌కు ట్రంప్ మరో షాక్.. ఎగుమతులపై కొత్త టారిఫ్‌ల ప్రతిపాదన!

2026-11-25 17:53 GMT

అమెరికా కల ఎంత గొప్పదైనా.. చిన్నారుల ప్రాణాల కంటే గొప్పది కాదు...

2026-11-25 13:13 GMT

అమెరికా కల చెదిరిందా? భారతీయ టెక్కీల గుండెల్లో ఐబీఎం పెట్టిన 'డిసెంబర్ 31' పిడుగు

2026-11-25 12:51 GMT

యూఏఈలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి.. మృతుల్లో భారతీయులు!

2026-11-25 04:22 GMT

సింధూ దేశ్ ఉద్యమం షురూ.. మరోసారి ముక్కలయ్యే దిశగా పాకిస్తాన్..?

2026-11-24 18:20 GMT

మరణశిక్ష ఎదుర్కొంటున్నా వెనక్కి తగ్గని షేక్ హసీనా.. డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు రీ ఎంట్రీ

2026-11-24 18:02 GMT

ఆస్కార్ రేసులో చిన్న సినిమా.. అసలు పోటీ ఇప్పుడే!

2026-11-24 12:46 GMT

ప్రపంచానికి బట్టలు కుట్టించి.. తన పరువు మాత్రం బజారున పడేసుకున్న బంగ్లాదేశ్

2026-11-24 00:36 GMT

పాకిస్తాన్‌తో పాత సంబంధాలు.. భారత్‌తో బలమైన బంధం ఎందుకు? బైడెన్ పుస్తకంలో కీలక వ్యాఖ్యలు

2026-11-23 08:08 GMT

ఎన్విడియా చిప్స్ చైనాకు తరలింపు.. లీ మింగ్ పేరు బయటకు!

2026-11-23 04:35 GMT

Copyright @2026

Powered by Blink CMS