• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Overseas >  హవ్వా.. అమెరికన్లకు ఎంత...

హవ్వా.. అమెరికన్లకు ఎంత గతి పట్టింది.. టాయిలెట్ పేపర్ల కోసం పాకులాట..

| అమెరికాలో బ్లాకౌట్ భయాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. విద్యుత్ వ్యవస్థలు కుప్పకూలుతాయన్న ప్రచారంతో సూపర్ మార్కెట్లలో నిత్యావసర వస్తువులను భారీగా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా టాయిలెట్ పేపర్లకు డిమాండ్ పెరగడంతో వాటి ధరలు 4 శాతం, ఫ్రీజ్ డ్రైడ్ ఫుడ్ ధరలు 12 శాతం పెరిగాయి.

By - A.N.Kumar
Update: 2026-11-26 17:25 GMT

అంతరిక్షంలో రాకెట్లు.. చేతిలో స్మార్ట్‌ఫోన్లు.. ఆఫీసుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రపంచానికి సాంకేతిక పాఠాలు చెబుతున్న అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు ఒక వింత సంకటంలో పడింది. గ్రహాంతర యాత్రలకు సిద్ధమవుతున్న సూపర్ పవర్ దేశంలో సామాన్య ప్రజలు మాత్రం స్థానిక సూపర్ మార్కెట్ల ముందు టాయిలెట్ పేపర్ రోల్స్ కోసం క్యూ కడుతున్నారు. రాబోయే రోజుల్లో విద్యుత్ వ్యవస్థలు కుప్పకూలి బ్లాకౌట్ ఏర్పడుతుందన్న భయంతో అమెరికన్లు తమ ట్రాలీలను నిత్యావసర సరుకులతో నింపేస్తున్నారు.

ఒకవైపు ఏఐ ప్రపంచాన్ని మార్చేస్తుంది అంటూ సిలికాన్ వ్యాలీ మేధావులు ఉపన్యాసాలు ఇస్తుంటే మరోవైపు కరెంట్ పోతే మా పరిస్థితి ఏంటి? అంటూ సామాన్య అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. స్మార్ట్ హోమ్‌లు.. ఆటోమేటిక్ కార్లు.. డిజిటల్ బ్యాంకింగ్.. ఇలా అన్నీ ఇంటర్నెట్‌తో ముడిపడి ఉన్న సమాజంలో ఒక్కసారిగా సర్వర్లు డౌన్ అయితే జీవితం స్తంభించిపోతుందన్న అభద్రతాభావం వారిని వెంటాడుతోంది.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న బ్లాకౌట్ హెచ్చరికలు ఈ భయానికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. నిజంగానే అంత పెద్ద విపత్తు ముంచుకొస్తోందా అన్నది పక్కన పెడితే జనం మాత్రం ముందు జాగ్రత్త పేరుతో మార్కెట్లోని భయాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో తాగునీరు, బియ్యం, జనరేటర్లు, బ్యాటరీలు కొనుగోలు చేయడంలో ఒక అర్థం ఉంది. కానీ ఏ విపత్తు వచ్చినా అమెరికన్లకు ముందుగా గుర్తొచ్చేది మాత్రం టాయిలెట్ పేపర్. గతంలో కరోనా మహమ్మారి సమయంలోనూ సరిగ్గా ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ఇప్పుడు మరోసారి అదే సీన్ రిపీట్ అవుతోంది. జనం ఒక్కసారిగా ఎగబడటంతో ఫ్రీజ్ డ్రైడ్ ఫుడ్ ధరలు 12 శాతం.. టాయిలెట్ పేపర్ల ధరలు 4 శాతం మేర పెరిగాయి. భవిష్యత్తులో సరుకులు దొరకవేమోనన్న భయంతో అవసరానికి మించి నిల్వ చేస్తుండటంతో బ్లాకౌట్ రాకముందే సూపర్ మార్కెట్ షెల్ఫ్‌లు ఖాళీ అవుతున్నాయి. దీన్ని బట్టి మనకు ఏం అర్థమైందయ్యా అంటే.. క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఎన్ని టెరాబైట్ల డేటా దాచుకున్నా.. ఇంట్లో బాత్రూమ్ షెల్ఫ్‌లో నాలుగు రోల్స్ టాయిలెట్ పేపర్ లేకపోతే ఆ టెక్నాలజీ అంతా వృథా అని అమెరికన్లు గట్టిగా నమ్ముతున్నట్టున్నారు భయ్యా ఫాపం..

ఈ పరిణామం ఒక ఆసక్తికరమైన జీవిత సత్యాన్ని బయటపెడుతోంది. మనిషి ఎంతటి సాంకేతిక శిఖరాలను అధిరోహించినా ప్రాథమిక అవసరాల దగ్గరికి వచ్చేసరికి ఆదిమ కాలం నాటి అభద్రతాభావమే బయటపడుతుంది. ప్రపంచాన్ని శాసించే ఏఐ మోడల్స్‌కు వేల సంఖ్యలో బ్యాకప్ సర్వర్లు ఉండొచ్చు.. కానీ సామాన్యుడికి మాత్రం ఇంటి బీరువాలో నిల్వ ఉంచిన టాయిలెట్ పేపర్ ప్యాకెట్లే అసలైన సెక్యూరిటీ. ఇదే నిజం.. దీన్ని చూసి నవ్వకండి.. అత్యవసరమని గుర్తించండి..

అమెరికా ఏఐ రేసులో ప్రపంచాన్ని దాటి ముందుకెళ్తుందో లేదో తెలియదు కానీ టాయిలెట్ పేపర్ల సేకరణలో మాత్రం మళ్ళీ ప్రపంచ రికార్డు సృష్టించేలా కనిపిస్తోంది..

Tags:    
  • usblackout 
  • americans 
  • toiletpaper 
  • panicbuying 
  • blackoutfears 

Similar News

ఇరాన్‌తో మళ్లీ యుద్ధం తప్పదా?.. ఇజ్రాయెల్ జ్యోతిష్యుల సంచలన అంచనాలు!

2026-11-26 08:55 GMT

తెలుగు విద్యార్థిని శ్రీజ ఎక్కడ? 20 రోజులుగా కనిపించని జాడ.. అసలేమైంది?

2026-11-25 17:54 GMT

పంది కిడ్నీతో ఏడాది గడిపిన మహిళ.. డయాలసిస్ అవసరం లేకుండా!

2026-11-25 17:53 GMT

భారత్‌కు ట్రంప్ మరో షాక్.. ఎగుమతులపై కొత్త టారిఫ్‌ల ప్రతిపాదన!

2026-11-25 17:53 GMT

అమెరికా కల ఎంత గొప్పదైనా.. చిన్నారుల ప్రాణాల కంటే గొప్పది కాదు...

2026-11-25 13:13 GMT

అమెరికా కల చెదిరిందా? భారతీయ టెక్కీల గుండెల్లో ఐబీఎం పెట్టిన 'డిసెంబర్ 31' పిడుగు

2026-11-25 12:51 GMT

యూఏఈలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి.. మృతుల్లో భారతీయులు!

2026-11-25 04:22 GMT

సింధూ దేశ్ ఉద్యమం షురూ.. మరోసారి ముక్కలయ్యే దిశగా పాకిస్తాన్..?

2026-11-24 18:20 GMT

మరణశిక్ష ఎదుర్కొంటున్నా వెనక్కి తగ్గని షేక్ హసీనా.. డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు రీ ఎంట్రీ

2026-11-24 18:02 GMT

ఆస్కార్ రేసులో చిన్న సినిమా.. అసలు పోటీ ఇప్పుడే!

2026-11-24 12:46 GMT

ప్రపంచానికి బట్టలు కుట్టించి.. తన పరువు మాత్రం బజారున పడేసుకున్న బంగ్లాదేశ్

2026-11-24 00:36 GMT

Copyright @2026

Powered by Blink CMS